మాన్సూన్ ట్రిప్‌లో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి : Monsoon Travel Tips
Monsoon Travel Tips : వర్షాకాలం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పచ్చని పర్వతాలు, జలపాతాలు, మిస్ట్, చల్లని వాతావరణమే కదా. ఇలాంటి సీజన్లో ట్రావెల్ చేయడం ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. కానీ కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల ఆ ఫన్ ట్రిప్ కాస్తా స్ట్రెస్ ట్రిప్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ జర్నీ స్టార్ట్ చేసే ముందు ఈ 5 కామన్ ట్రావెల్ మిస్టేక్స్ తప్పకుండా ఎవాయిడ్ చేస్తే మీ ట్రిప్ ఇంకా స్మూత్‌గా ఉంటుంది.
Monsoon Travel Tips : వర్షాకాలం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పచ్చని పర్వతాలు, జలపాతాలు, మిస్ట్, చల్లని వాతావరణమే కదా. ఇలాంటి సీజన్లో ట్రావెల్ చేయడం ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. కానీ కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల ఆ ఫన్ ట్రిప్ కాస్తా స్ట్రెస్ ట్రిప్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ జర్నీ స్టార్ట్ చేసే ముందు ఈ 5 కామన్ ట్రావెల్ మిస్టేక్స్ తప్పకుండా ఎవాయిడ్ చేస్తే మీ ట్రిప్ ఇంకా స్మూత్‌గా ఉంటుంది.
1. బయల్దేరే ముందు వాతావరణం చెక్ చేయడం
లొకేషన్ ఫోటోలు చూసి ఎగ్జైట్ అయిపోయి డైరెక్ట్‌గా జర్నీ స్టార్ట్ చేయకండి. ముందు ఒక్కసారి అక్కడి వాతావరణం, దారి మధ్యలో పరిస్థితులు చెక్ చేసుకోండి. భారీ వర్షాలు, ల్యాండ్‌స్లైడ్, రోడ్ బ్లాక్ లాంటి పరిస్థితులు రావచ్చు. ఒక 5 నిమిషాలు చెక్ చేస్తే అనవసరమైన ట్రబుల్ ఎవాయిడ్ చేయవచ్చు.
2. తప్పుడు షూస్ వేసుకుని వెళ్లకండి
మాన్సూన్లో స్టైల్ కంటే కంఫర్ట్ ఇంపార్టెంట్. ఫ్లాట్ స్లిప్పర్స్ లేదా స్మూత్ సోల్ ఉన్న షూస్ వేసుకుని స్లిప్పరీ రోడ్‌పై వెళ్లి ఇబ్బంది పడకండి. మంచి గ్రిప్ ఉన్న షూస్ లేదా ట్రెక్కింగ్ శాండిల్స్ వేసుకుంటే వాకింగ్ ఈజీగా ఉంటుంది. కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.
- ఇది కూడా చదవండి : ట్రెక్కింగ్ చేసే ముందు ఈ Pants గురించి తెలియకపోతే నష్టం మీకే | Convertible Trek Pants
3. ఫోన్, కెమెరా సేఫ్టీ ఇష్యూ
ట్రావెల్ అంటే ఫోటోలు తప్పనిసరి. కానీ వర్షంలో ఫోన్, కెమెరా, పవర్ బ్యాంక్ తడిసిపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే వాటర్‌ప్రూఫ్ పౌచ్ లేదా జిప్ కవర్ కేరీ చేయండి. బ్యాకప్‌లా రెయిన్ కవర్ ఉంటే ఇంకా బెటర్. చిన్న ప్రికాషన్ పెద్ద డ్యామేజ్‌ని సేవ్ చేస్తుంది.
🏃⛈Travellers! Your monsoon trip is approaching lightning-fast! But we got your back.😉
— Incredible!ndia (@incredibleindia) July 13, 2024
VC: @ ak_films1993 (Instagram)#incredibleindia #myincredibleindia #monsoonmodeon #visitindia #indiatravel #indiatourism #dekhoapnadesh #exploreindia #discoverindia #indiatravelgram… pic.twitter.com/XvHUSIVDtS
4. ఎక్స్ట్రా డ్రెస్ తీసుకెళ్లకపోవడం
మాన్సూన్లో ఎప్పుడు వర్షం పడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కసారి ఫుల్‌గా తడిస్తే జర్నీ మొత్తం చికాకుగా మారిపోతుంది. అందుకే ఒక ఎక్స్ట్రా టీ షర్ట్, సాక్స్, టవల్, రెయిన్ జాకెట్ బ్యాగ్‌లో తప్పకుండా పెట్టుకోండి. ఇవి చిన్నగా కనిపించినా బాగా యూజ్ అవుతాయి.
5. ఎక్కువగా ప్లాన్ చేయకండి
ఒక రోజులో 5-6 ప్రదేశాలు కవర్ చేయాలని చాలా మంది ఓవర్ ప్లాన్ చేస్తుంటారు. ఇది ఒక కామన్ ట్రావెల్ మిస్టేక్. రెయిన్ వల్ల ట్రాఫిక్ స్లో అవ్వచ్చు, రోడ్డుపై జామ్ అవ్వొచ్చు. అందుకే కాస్త బఫర్ టైమ్ మెయింటైన్ చేస్తూ రిలాక్స్‌గా జర్నీ ప్లాన్ చేసుకోండి. గుర్తుంచుకోండి.. ట్రావెల్ అంటే చెక్‌లిస్ట్ పూర్తి చేయడం కాదు.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
ప్రయాణికుడు వాట్సాప్ ఛానెల్లో చేరడానికి క్లిక్ చేయండి.
