Munnar Guide : సార్, వెళ్దామా మున్నార్ ? 8 డెస్టినేషన్స్ సిద్ధం మాస్టార్!

షేర్ చేయండి

మున్నార్, కేరళలోని పశ్చిమ ఘాట్స్‌లో ఉన్న ఒక అందమైన ప్రదేశం. ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గంలాంటి ప్రదేశం అని చెప్పవచ్చు. భారత దేశంలో ఉన్న అత్యంత అందమైన హిల్ స్టేషన్లలో ఒకటైన మున్నార్‌లో (Munnar Guide) ఎన్నో టీ ఎస్టేట్స్ అండ్ ప్లాంటేషన్స్ ఉన్నాయి. దీంతో పాటు ముడుత పర్వతాలు ( rolling hills), వైవిధ్య భరితమైన పర్యావరణం, విభిన్నమైన వన్యప్రాణులకు మున్నార్ ఆలవాలంగా నిలుస్తోంది. 

సో, సార్ వెళ్దామా మున్నార్ ? | Munnar Guide

మీరు మున్నార్‌కు వెళ్లాలా వద్దా అని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా ? అయితే ఈ కింది పాయింట్స్ ఒకసారి చదవండి. అప్పడు మీ నిర్ణయం మీరు తీసుకోండి. ఎందుకంటే మీరు మున్నార్ వెళ్తే హైదరాబాద్ (Hyderabad To Munnar) లేదా మీరున్న ఏరియా మిమ్మల్ని మిస్ అవుతుంది. వెళ్లకుంటే మిమ్మల్ని మున్నారు మిస్ అవుతుంది. 

1. ఎరవికూలం నేషనల్ పార్క్ (Eravikulam National Park) 

యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చుకున్న ప్రాంతం ఇది. ఈ పార్కులో నీల్‌గిరి తార్‌ను (Nilgiri Tahr) మీరు చూడవచ్చు.దీంతో పాటు ఇక్కడి రోలింగ్ హిల్స్, ఫోలా ఫారెస్ట్‌లో ఎంజాయ్ చేయవచ్చు.

2.టీ ఎస్టేట్స్ (Munnar Tea Estates )

మున్నార్ అంటే ముందుగా టీ తోటలే గుర్తుకు వస్తాయి. ఇక్కడే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టీ ప్లాంటేషన్ కొళుక్కుమలై (Kolukkumalai) ఉంటుంది. ఇక టీ ఎలా తయారు అవుతుందో తెలుసుకోవాలి అనుకుంటే మీరు కన్నన్ దేవన్ టీ మ్యూజియం (Kannan Devan Tea Museum) కూడా విజిట్ చేయవచ్చు.

3.మట్టుపెట్టి డ్యామ్ (Mattupetty Dam)

మున్నార్ నుంచి 13 కిమీ దూరంలో ఉన్న ఈ డ్యామ్ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ మీరు బోటింగ్ కూడా చేయవచ్చు. ఎటుచూసినా పచ్చదనంతో నిండి ఉండే ఈ ప్రాంతానికి చాలా మంది పిక్‌నిక్‌కు కూడా వెళ్తుంటారు.

4.పోతవేడు పాయింట్ (Pothamedu Viewpoint)

Munnar Guide
మున్నార్‌లోని ఒక హిల్ స్టేషన్

ఇక్కడి టీ ఎస్టేట్స్ చూసేందుకు చాలా మంది దూరదూరం నుంచి వస్తుంటారు ఫోటోగ్రఫీ ఇష్టపడేవారికి ఇది స్వర్గలాంటిది. 

5.టాప్ స్టేషన్ (Top Station)

మున్నార్‌‌లో అత్యంత ఎత్తైన ప్రాంతం ఇదే. సుమారు 1,700 మీటర్ల ఎత్తులో ఉండే ఈ టాప్ స్టేషన్ నుంచి వెస్ట్రన్ ఘాట్స్ (Western Ghats) అందాలను చూసేందుకు చాలా మంది వెళ్తుంటారు. ఇక్కడ నీలాకురింజి పువ్వులు (neelakurinji flowers) 12 ఏళ్లకు ఒకసారి పూస్తాయి. 

6.అనముడి పీక్ (Anamudi Peak)

దక్షిణభారత దేశంలోనే ఇది అత్యంత ఎత్తైన పర్వతం . సాహసయాత్రికులు ఇక్కడికి ట్రెక్కింగ్ (Trekking In South India) చేయడానికి వస్తుంటారు. ఇక్కడి నుంచి చుట్టు పక్కల ప్రాంతాలు చాలా అందంగా కనిపిస్తాయి.

7.అటుక్కడ్ జలపాతం (Atukkad Waterfalls)

మున్నార్ నుంచి 9 కిమీ దూరంలో ఉండే ఈ జలపాతం చాలా అందంగా ఉంటుంది. ఎటు చూసినా పచ్చదనంతో నిండిన ఈ ప్రాంతంలో రోలింగ్ హిల్స్ (Rolling Hills) కూడా ఉంటాయి.

8.చీయప్పరా జలపాతం (Cheeyappara Waterfalls)

దట్టమైన అడవుల్లో ఉన్న ఈ జలపాతం వద్దకు చాలా మంది ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తుంటారు. ప్రకృతి ప్రేమికులు ఈ ప్రాంతాన్ని బాగా ఇష్టపడతారు.

ప్రకృతి ప్రేమికుల (Nature Lover) దిల్ ఖుష్ చేసే అన్ని అందాలు మున్నార్‌లో ఉన్నాయి. ఎరవికులం జాతీయ పార్కు నుంచి టీ ఎస్టేట్స్‌లో టేస్టీ టీని రుచి చూడటం వరకు ప్రతీ ఒక్కరికి కోసం మున్నార్‌లో ఏదో ఒకటి ఉంటుంది.

బెస్ట్ టైమ్ | Best Time

వర్షాకాలంలో తప్పా మున్నార్ (Munnar Guide) ఎప్పుడైనా వెళ్లవచ్చు. అయితే అక్టోబర్ నుంచి మార్చి వరకు చాలా మంది మున్నార్ వెళ్తుంటారు.

Latest Vlog : హరిద్వార్‌లోని అతిపవిత్రమైన మా చండి దేవి ఆలయం | Maa Chandi Devi Temple

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. 

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!