ఒంటరి ప్రయాణాలు (Solo Female Travelers) అనేవి ఎంత ఎగ్జైటింగ్‌గా అనిపిస్తాయో అంతే టెన్షన్‌గా కూడా అనిపిస్తాయి. ఎందుకంటే ప్రతీ చిన్న విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే సోలో ట్రావెలింగ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. అద్భుతమైను అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు.
ముఖ్యాంశాలు
వెళ్లడానికి ముందు | Before Starting
పరిశోధించండి : మీరు ఒక ప్రాంతానికి వెళ్లే ముందు అక్కడి కల్చర్, చట్టాలు, ఆచారాలు, ఆ ప్రాంతం సేఫా కాదా అని పరిశోధించండి. దీని కోసం మీరు ట్రావెల్ బ్లాగ్స్ రిఫర్ (travel blogs) చేయవచ్చు. దీంతో పాటు ఒకసారి ఆ ప్రాంతానికి సంబంధించిన వాతావరణం, వార్తలు చెక్ చేయవచ్చు.
మీ ప్లాన్ షేర్ చేయండి : మీట్రావెల్ ప్లాన్‌ను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి. ఇందులో మీరు ఎక్కడ ఉండబోతున్నారు, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారో వివరాలు ఉండాలి.
తక్కువగా ప్యాక్ చేయండి : ప్యాకింగ్ బ్యాగులో ఎంత తక్కువ అయితే అంత తక్కువ వస్తువులను మాత్రమే ప్యాక్ చేసుకోండి. సింపుల్‌గా చెప్పాలి అంటే అనసరమైనవి కాకుండా అవసరం అయినవి మాత్రమే తీసుకెళ్లండి. విలువైన వస్తువులు సులభంగా అందకుండా ఉండేలా క్యాబిన్స్, సీక్రెట్ పాకెట్స్ ఉన్న బ్యాగ్ కొనుగోలు (Bag with Secret Pockets) చేయండి.
ప్లాన్ బీ : ఏదైనా అత్యవసరమైన పరిస్థితి ఎదురైనప్పుడు సహాయం కోరేందుకు కొన్ని నెంబర్లను సేవ్ చేసుకుని పెట్టుకోండి. దీంతో పాటు ఒక ప్రాంతంలో సురక్షితమైన ప్రాంతాలు ఏంటో కూడా కనుక్కుని పెట్టుకోండి.
ఎయిర్‌పోర్టు అండ్ ప్రయాణాల్లో | At the Airport and Travel

అలెర్టుగా ఉండండి (Solo Female Travelers) : ప్రయాణాల్లో ఉన్నప్పుడు, ఎయిర్‌పోర్టులో ఉన్నప్పుడు అలెర్ట్‌గా ఉండండి. ఫోన్లో మునిగిపోకండి. చుట్టుపక్కల ఏం జరుగుతోందో గమనిస్తూ ఉండండి. మరీ ముఖ్యంగా ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో చాలా అలెర్ట్‌గా ఉండండి. డైవర్ట్ అవ్వకండి.
మీ వస్తువులు జాగ్రత్త : మీ బ్యాగులను క్షణం పాటు కూడా వదిలివేయకండి. మార్కెట్లో యాంటి థెఫ్ట్ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. వాటిని కొనుగోలు చేయవచ్చు.
సాయం వద్దు : సాటి మనిషికి సాయం చేయడంలో తప్పులేదు. కానీ కొత్త ప్రదేశాల్లో ఉన్నప్పుడు సాయం ఆపాయంగా మారవచ్చు. ఎవరైనా తమ వస్తువులను మీ బ్యాగులో పెట్టుకోండి అని …మీరు దిగే చోట తమ బంధువు వచ్చి తీసుకుంటాడు అని అంటే అలాంటి సాయాలు చేయకండి. మరీ ముఖ్యంగా ఎయిర్‌పోర్టులో ఇలాంటి పనులు అస్సలు చేయకండి.
అలాగే మీరు బ్యాగులను చెకిన్ చేయించే ముందు ఒకసారి అందులో మీకు తెలియని వస్తువులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి. ఎందుకంటే మీ బ్యాగులో ఎవరైనా ఏమైనా పెట్టే అవకాశం కూడా ఉంది. అందుకే మీరు బయట ఉన్నప్పుడు బ్యాగులో ప్రతీ జిప్పును లాక్ చేయండి.
సురక్షితమైన రవాణా వ్యవస్థ : కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ సురక్షితమైన రవాణా వ్యవస్థ ఏంటో తెలుసుకోండి. మంచి పేరు పలుకుబడి ఉన్న ట్యాక్సీని ఎంచుకోండి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో ప్రయాణించాల్సి వస్తే మాత్రం జనం ఎక్కువగా ఉండే సమయంలో ప్రయాణించండి. రాత్రి ప్రయాణాలు ఎవాయిడ్ చేస్తే బెటర్.
వసతి | Accommodation
సురక్షితమైన హోటల్ : ఆన్లైన్లో మంచి రివ్యూలు ఉన్న హోటల్, లాడ్జి, హాస్టల్లో దిగండి. నాలుగు పైసలు ఎక్కువైనా సేఫ్టికి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే మీరు ఉండబోయే హోటల్ ఏ ప్రాంతంలో ఉందని తెలుసుకుని ఆ ప్రాంతం సేఫా కాదా అని తెలుసుకోండి. సేఫ్ కాదు అనిపిస్తే కేన్సిల్ చేసుకుంటే బెటర్. వీలైతే మహిళల కోసం ఏర్పాటు చేసిన డార్మిటరీలు (Women Dorms) హాస్టల్స్ వెతకండి.
తేడాగా అనిపిస్తే..: ప్రయాణాల్లో కాని, ఒక హోటల్లో స్టే చేస్తున్న సమయంలో కానీ మీకు అనుమానాస్పద మనుషులు కనిపించినా లేదా చుట్టుపక్కల ఏదైనా తేడాగా అనిపించినా మరో ఆలోచన పెట్టుకోకుండా అక్కడి నుంచి బయటికి వచ్చేయండి. వేగంగా నెక్ట్స్ ఉండబోయే సేఫ్ ప్లేస్‌ను ఎంచుకోండి. మరీ ఇబ్బందిగా అనిపిస్తే స్థానిక పోలీసుల సహాయం తీసుకోండి.
- ఇది కూడా చదవండి : విదేశీ ప్రయాణంలో మందులు ఎలా ప్యాక్ చేసుకోవాలి ? | Medicines For An International Trip
హోటల్ సేఫ్స్ : మీ వస్తువులను హోటల్ గదిలో అలాగే వదిలివేయకండి. బయటికి వెళ్లే ముందు హోటల్ వాళ్లు అందించి సేఫ్టీ బాక్సుల్లో వాటిని ఉంచండి. దీంతో పాటు మీ బ్యాగులకు ఎప్పుడూ లాక్ చేసి ఉంచండి.
బయటికి వెళ్లినప్పుడు | During Exploration

కలిసిపోండి : రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలి అన్నట్టు మీరు వెళ్లిన ప్రాంతాన్ని బట్టి మీ వస్త్రాధారణను మార్చుకునే ప్రయత్నం చేయండి. స్థానికుల్లా దుస్తువులు ధరిస్తే సులభంగా మీరూ వారిలో కలిసిపోతారు. అందరికన్నా భిన్నంగా కనిపిస్తే మీరు అనసరంగా చాలా మంది దృష్టిలో పడతారు. అందుకే ఒక ప్రాంతానికి వెళ్లే ముందు అక్కడి వాళ్లు ఎలాంటి దుస్తువులు ధరిస్తారో పరిశోధిచండి.
ఆల్కహాల్ వద్దు : మందు అలావాటు ఉంటే కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అలవాటుకు చిన్న బ్రేక్ ఇవ్వండి. లేదా కోటాను తగ్గించండి. కొత్త వారు మందు ఆఫర్ చేస్తే సౌమ్యంగా కాదని చెప్పండి.
రాత్రి సమయంలో : రాత్రి ప్రయాణాలు వీలైనంత వరకు తగ్గించండి (Solo Female Travelers). అలాగే అంతగా వెలుగులేని, మీకు అంతగా తెలియని ప్రాంతాలకు, అసురక్షితమైన ప్రాంతాలకు వెళ్లకండి.
తోటి ప్రయాణికులతో : వీలైనంత వరకు సోలాగా కాకుండా ట్రావెలింగ్ గ్రూపులతో (Group Travel) వెళ్లేందుకు ప్రయత్నించండి. దీని వల్ల మీకు డబ్బు కూడా ఆదా అవుతుంది. అలాగే మీ గ్రూపులో ఉన్న వారితో పరిచయం పెంచుకోండి. దీని వల్ల మీకు కాస్త భద్రతా భావం కలుగుతుంది.
టెక్నాలజీ వాడండి : మీ ప్రయాణం (Tour) మొదలు పెట్టడానికి ముందే మీ స్నేహితలకు లేదా కుంటుంబ సభ్యులకు మీరు రెగ్యులర్‌గా మీ అప్డేట్స్ ఇస్తుంటాను అని చెప్పండి. అలాగే ఒక కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు మీ లోకేషన్ వారితో షేర్ చేయండి.
- మీ ఫోన్లో చార్జింగ్ ఉండేలా చూసుకోండి. ఒక వేళ మీ ఫోన్ కలవకపోతే ఎవరికి కాల్ చేయాలో కూడా చెప్పి వారి నెంబర్ షేర్ చేయండి.
- మీ ప్రయాణానికి ఉపయోగపడే యాప్స్, మాప్స్ , ట్రాన్స్లేషన్ టూల్స్ డౌన్లోడ్ చేసుకోండి.
- Travel Vlogging Tips : ట్రావెల్ వ్లాగర్ అవ్వాలంటే ఏం చేయాలి ? 10 టిప్స్ !
అత్యవసర పరిస్థితుల్లో | Preparation For Emergency
ఎమర్జెన్సీ నెంబర్ : మీరు వెళ్లిన ప్రదేశంలో పోలిసులకు కాంటాక్ట్ చేసే నెంబర్ ఏంటో తెలుసుకొని సేవ్ చేసుకోండి. అలాగే స్థానికంగా ఎవరైనా మీకు సాయం చేయగలరు అనిపిస్తే వారి కాంటాక్ట్ సేవ్ చేసుకోండి.
కనెక్టివిటీ కోసం : మీరు వాడుతున్న సిమ్ కార్డు అన్ని చోట్లా పని చేయకపోవచ్చు. అలాగే కొన్ని సార్లు నెట్వర్క్ ఇష్యూ ఉండవచ్చు. అందుకోసం స్థానిక సిమ్ కార్డును వినియోగించండి. దీంతో పాటు మీ మొబైల్ ఎప్పుడూ చార్జ్ ఉండటానికి ఒక పవన్ బ్యాంకును క్యారీ చేయండి.
నో చెప్పడం అలవాటు చేసుకోండి : మీకు ఏదైనా విషయం నచ్చచకపోతే నో అనండి. వద్దనిపిస్తే వదిలేయండి. అలాగే ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చేయండి. కావాలంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి.
ఈ విషయాలు గుర్తుంచుకోండి | Solo Female Travelers
మీ చుట్టుపక్కన ఉన్న ప్రజల కదలికలను గమనిస్తూ ఉండండి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారికి దూరంగా ఉండండి. అలాగే కొత్త వ్యక్తులకు మీ వ్యక్తిగత విషయాలు, సమాచారం పంచుకోకండి.
- నగదు తీసుకెళ్తున్నప్పుడు వాటిని రెండు భాగాలుగా డివైడ్ చేయండి. 1. ఎక్కువ మొత్తాన్ని బయట కనిపించకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. 2. ఎకొంత చిల్లర డబ్బును జేబులోనో సులభంగా తీసే విధంగా అందుబాటులో పెట్టుకోండి. పెద్ద నోట్లు, కార్డులను అందరికి కనిపించే విధంగా తీయకండి.
- మీరు వెళ్లే ప్రాంతాన్ని బట్టి నమస్తే, థ్యాంక్యూ, సారీ, అవును, కాదు లాంటి చిన్న చిన్న పదాలు ప్రాక్టిస్ చేయండి.
- కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు వీలైనంత ప్రశాంతంగా ఉండండి. గొడవల్లో తలదూర్చడం లేదా గొడవలు పడటం చేయకండి.
ఒంటరిగా ప్రయాణించే వ్యక్తి ఎక్కువ వేగంగా ప్రయాణిస్తారు (she/he travels fast who travel alone) అంటారు. అయితే మీ ప్రయాణంలో కొన్ని టిప్స్ పాటిస్తే వేగంతో పాటు సేఫ్‌గా మీ జర్నీని పూర్తి చేయవచ్చు.
పైన వివరించిన టిప్స్‌తో పాటు (Travel Tips) మిమ్మల్ని మీరు సేఫ్‌గా ఉంచుకునేందుకు మరిన్ని టిప్స్ పాటించవచ్చు. మీకు తెలిసిన టిప్స్ ఏవైనా ఉంటే షేర్ చేయగలరు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు.
- Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.