UFO Tourism : ఎగిరే పళ్లాలు కనిపించిన ప్రాంతాలకు క్యూ కడుతున్న పర్యాటకులు | 10 ప్రదేశాలు

షేర్ చేయండి

ఈ విశ్వంలో అత్యంత రహస్యమైన విషయాల్లో (UFO Tourism) ఎగిరే పళ్లాలు కూడా ఒకటి.మీరు కూడా వీటిని చూడాలి లేదా అవి కనిపించాయని చెబుతున్న ప్రదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారా ? 
అయితే ఈ 10 ప్రదేశాలు మీ క్యూరియాసిటీని పెంచి మీరు ఉన్న సిటీ నుంచి బయటికి వెళ్లేలా చేస్తాయి.

గ్రహాంతర వాసులు, ఎగిరే పళ్లాల కథలు, సినిమాలు, వార్తలు మనం చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం. చూస్తూనే ఉన్నాం. మీక్కూడా వీటి గురించి ఆసక్తి ఉంటే ప్రస్తుతం పర్యాటక రంగంలో సరికొత్త ట్రెండ్‌గా మారిన యూఎఫ్‌ఓ టూరిజంలో (UFO) మీరు కూడా భాగం అవ్వవచ్చు.

యూఎఫ్‌ఓ అంటే ? What Is an UFO ?

What is an UFO
ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచ పర్యాటక రంగం (Tourism Industry) కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త ఐడియాలతో టూరిస్టులను ఆకట్టుకుంటున్నారు ఈ రంగంలో ఉన్న నిపుణులు, వ్యాపారులు. ఇందులో భాగంగా ప్రస్తుతం యూఎఫ్‌ఓ టూరిజం ట్రెండ్ మొదలైంది.

  • యూఎఫ్‌ఓ అంటే అన్ ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ (Unidentified Flying Object). సింపుల్‌గా  చెప్పాలి అంటే గుర్తింపు లేని లేదా గుర్తించడానికి వీలులేని ఎగిరే వస్తువు. వీటిని ఎగిరే పళ్లాలు అని కూడా అంటారు.

యూఎఫ్‌ఓ పర్యాటకం | UFO Tourism

ప్రపంచంలోనే అనేక ప్రాంతాల్లో ఎగిరే పళ్లాలను చూసినట్టు చాలా మంది చెబుతుంటారు. అనేక  ప్రాంతాల్లో ప్రజలు వీటి గురించి కథలు చెబుతుంటారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా చాలా వైరల్ అవుతుంటాయి. అవి నిజమేనని చెప్పే కథనాలు, వార్తలు కూడా ట్రెండ్ అవుతుంటాయి. అయితే యూఎఫ్‌ఓను చూడటం (UFO Sighting) అనేది ఒక మిస్టరీగానే ఉంది అని చెప్పవచ్చు. 

కానీ ఎక్కడైతే ఈ ఎగిరేపళ్లాలను చూశామని కొంత మంది చెప్పారో ఆ ప్రాంతాలు ఇప్పుడు పర్యాటక ప్రదేశాలుగా మారుతున్నాయి. అంటే అక్కడికి వెళ్తే ఈ ఎగిరే పళ్లాలు లేదా గ్రహాంతర వాసులు కనిపిస్తారని ఎవరూ చెప్పడం లేదు. కానీ ఇది ఒక ఫ్యాంటసీ టూరిజం. 

ఒక రహస్యాత్మక, నాట్ సో సమస్యాత్మక ప్రదేశానికి వెళ్తున్నాం అన్న ఫీలింగ్ కోసం చాలా మంది ఈ ప్రదేశాలకు (Top UFO Hotspots) వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఎగిరే పళ్లాలు తరచూ కనిపిస్తాయనే కొన్ని ప్రదేశాలు

Spooky Hotspots to Explore : ఈ విశ్వంలో అత్యంత రహస్యమైన విషయాల్లో (Universal Mystery) ఎగిరే పళ్లాలు కూడా ఒకటి. మీరు కూడా వీటిని చూడాలి లేదా అవి కనిపించాయని చెబుతున్న ప్రదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారా ? 

అయితే ఈ 10 ప్రదేశాలు మీ క్యూరియాసిటీని పెంచి మీరు ఉన్న సిటీ నుంచి బయటికి వెళ్లేలా చేస్తాయి.

1. ఏరియా 51 | Area 51, Nevada, USA

UFO Tourism
ప్రతీకాత్మక చిత్రం

అమెరికాలోని నెవేడా రాష్ట్రంలో ఏరియా 51 అనే ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలు, నిర్మాణలు ఇవన్నీ కూడా అక్కడ ఏం జరుగుతుందో అనే కుతూహలాన్ని ప్రజల్లో కలిగిస్తుంటాయి.

  • ఇక్కడ ఏం జరుగుతుందో అనేది ప్రపంచానికి తెలియదు. నిజం తెలియనప్పుడు అబద్దాలు, పుకార్లే రాజ్యం ఏలుతాయి.
  • అదే విషయాన్ని ప్రూవ్ చేస్తూ ఏరియా 51 విషయంలో ఎన్నో పుకార్లు, వార్తలు నిత్యం వినిపిస్తూ ఉంటాయి.
  • ఇక్కడ గ్రహాంతర వాసులపై, ఇతర గ్రహాలపై, వారి సాంకేతికతపై, ఎగిరేపళ్లాలపై పరిశోధన జరుగుతుంది అని అంటూ వార్తలు వస్తుంటాయి. 

ఏరియా 51లో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు. ఆ ప్రాంతానికి వెళ్లే అనుమతి సాధారణ ప్రజలకు లేదు. అయితే మీరు ఆ వైబ్‌ను ఆ ఫీల్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఎక్స్‌ట్రా‌టెర్రిస్ట్రియల్ హైవే (Extraterrestrial Highway) , యూఎఫ్‌ఓ థీమ్‌లో ఉన్న ప్రదేశాలకు వెళ్లవచ్చు.

2.రెండల్‌షామ్ ఫారెస్ట్, సఫోక్, ఇంగ్లాండ్ 

Rendlesham Forest, Suffolk, England : ఈ ప్రాంతాన్ని యూఎఫ్ఓ ట్రెయిల్ అని కూడా పిలుస్తుంటారు (UFO Trail). ఈ ఆటవిక ప్రాంతంలో 1980 లో వింత వెలుగులను చూసినట్టు యూఎస్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది తెలిపారు. 

  • దీనికి సంబంధించిన రహస్యం రహస్యంగానే మిగిలిపోయింది.
  • అయితే యూఎఫ్‌ఓలు అంటే ఆసక్తి ఉన్న వ్యక్తులు మాత్రం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి రెండల్‌షామ్ ఫారెస్టుకు వస్తుంటారు. 
  • ఇలాంటి ఔత్సాహికుల కోసం మూడు మైళ్ల పొడవున్న ట్రెయిల్‌ను నిర్మించారు. 
  • ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు

3. కాంగ్‌కా లా పాస్, ఇండియా చైనా బార్డర్

Kongka La Pass
కోంగ్‌కా లా పాస్ ( ప్రతీకాత్మక చిత్రం)

Kongka La Pass, India-China Border : ఇండియా చైనా బార్డర్ ప్రాంతంలో ఉన్న ఈ హిమాలయాల్లో ( Himalayas) చాలా మంది ప్రజలు, సైనికులు వింత ఎగిరే వస్తువులను చూశామని చెబుతుంటారు.

  •  అందుకే ఇది గ్రహాంతర వాసుల రహస్య స్థావరం అని కూడా కొందరంటారు.
  • జనావాసాలకు దూరంగా ఉండటంతో పాటు అధికారులు ఈ విషయంపై ఎలాంటి కామెంట్ చేేయకపోవడం వల్ల ఈ ప్రాంత రహస్యం సీక్రెట్‌గానే మిగిలిపోయింది. 
  • దీంతో చాలా మంది సాహస యాత్రికులు ఈ ప్రాంతానికి వస్తుంటారు. 

4. రాస్‌వెల్ , న్యూ మెక్సికో, యూఎస్‌ఏ

Roswell
రాస్‌వెల్

Roswell, New Mexico, USA : ఎగిరేపళ్లాల చరిత్రలో రాస్‌వెల్‌ ప్రత్యేకం అని చాలా మంది చెబుతారు. 1947 లో రాస్‌వెల్‌ అనే ఈ ప్రాంతంలో ఒక యూఎఫ్ఓ కనిపించింది అంటారు. ఇక్కడే యూఎఫ్‌ఓ మ్యూజియం (UFO Museum)‌ తో పాటు ఒక పరిశోధనా కేంద్రం కూడా ఉంది. 

  •  ప్రతీ ఏడాది ఇక్కడ రాస్‌వెల్ యూఎఫ్‌ఓ ఫెస్టివల్ (Roswell UFO Festival) జరుగుతుంది. 
  • ఈ సమయంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడి వస్తుంటారు. 

5. మెక్ మిన్‌విల్లే, ఒరెగాన్

UFO Sighting
ప్రతీకాత్మక చిత్రం

McMinnville, Oregon, USA : 1950 నుంచి ఈ పట్టణానికి యూఎఫ్ఓ ఫీవర్ పట్టుకుంది. అసలేం జరిగింది అంటే ఈ పట్టణానికి చెందిన ఒక జంట ఫోటోలు తీస్తుండగా వారికి ఒక ఫ్లైయింగ్ డిస్క్ (Flying Disc) లాంటిది ఏదో కనిపించింది. 

  • ఎగిరే పళ్లాలు అంటాం కదా అలాంటిది అన్నమాట. 
  • తరచూ ఇక్కడ యూఎఫ్‌ఓ ఫెస్టివల్ జరుగుతుంది.
  • ఈ సమయంలో ప్రజలు గ్రహాంతర వాసుల్లా తయారు అయ్యి పరేడ్ చేస్తారు.
  • ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్ 

6. ఫీనిక్స్ లైట్స్, అరిజోనా, అమెరికా

Phoenix Lights, Arizona, USA: 1997 లో వేలాది మంది ప్రజలకు ఆకాశంలో ఒక V (వీ) ఆకారంలో ఉన్న ఎగిరేపళ్లాల సమూహం కనిపించింది. ఈ స్థాయిలో ఎగిరేపళ్లాలు అంత మందికి కనిపించడం అనేది ఒక చరిత్రగా మిగిలిపోయింది. 

7. ట్రాన్స్ ఎన్ ప్రావిన్స్, ఫ్రాన్స్

Aliens In Car
ప్రతీకాత్మక చిత్రం

Trans-en-Provence, France : 1981 లో ఒక ఎగిరే పళ్లం నేలపై ల్యాండ్ అవడం చూశానని ఒక రైతు చెప్పడంతో చాలా మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాంతానికి వెళ్లారు. నేలపై ఉన్న ఆధారాలను సేకరించి చాలా కాలం పాటు పరిశోధనలు కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని చూసేందుకు చాలా మంది నేటికీ వెళ్తుంటారు.

8. కెల్లి హాప్కిన్స్‌విల్లే ఎన్‌కౌంటర్, కెంటకీ, అమెరికా

Kelly-Hopkinsville Encounter, Kentucky : 1955 లో ఇక్కడ గ్రహాంతర వాసులను (Aliens), ఎగిరేపళ్లాలను చూసినట్టు ఒక ప్యామిలీ చెప్పింది. దీంతో చాలా కాలం పాటు ఈ ప్రాంతంలో పరిశోధనలు జరిగాయి. 

9. బెట్టి అండ్ బార్నీ హిల్ అబ్డక్షన్, న్యూ హ్యాంప్‌షైర్

Alien Abduction
ప్రతీకాత్మక చిత్రం

Betty and Barney Hill Abduction, New Hampshire, USA : అమెరికా చరిత్రలోనే తొలి మానవ అపహరణ కేసు 1961లో చోటు చేసుకుంది (అని అంటారు). దీనికి సంబంధించిన కట్టు కథలు కూడా బాగా ఫేమస్ అయ్యాయి. ఒక స్టోరీ ప్రకారం ఒక జంటను గ్రహాంతర వాసులు కిడ్నాప్ చేశారు అని, వారిని స్పేస్‌క్రాఫ్టులో తీసుకెళ్లారని చెబుతుంటారు.

10. వైక్లిఫ్ వెల్, ఆస్ట్రేలియా 

Wycliffe Well, Australia : ఈ ప్రాంతాన్ని ఎగిరే పళ్లాల రాజధాని అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ ఎన్నో సార్లు యూఎఫ్‌ఓలను చూశామని చాలా మంది చెప్పారు. దీంతో మనకేమైనా కనిపిస్తాయేమో అనే కుతూహలంతో చాలా మంది వైక్లిఫ్‌ వెల్ ప్రాంతానికి వెళ్తుంటారు.

Alien Abducting Human
ప్రతీకాత్మక చిత్రం

రాత్రుల్లో ఇక్కడ స్టే చేసి ఎగిరే పళ్లాలు చూడాలనుకునే ఔత్సాహికుల కోసం  కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు

UFO Sighting : వీటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల ప్రాంతాల్లో ఎగిరేపళ్లాలను చూశామని చాలా మంది చెబుతుంటారు. అలాగే గ్రహాంతర వాసులు తమను కిడ్నాప్ చేశాయని చెప్పేవాళ్లు కూడా చాలా మంది ఉంటారు. 

మనకు కనిపించలేవు అంటే లేవు అని చెప్పలేము. విశ్వానికి ఆది అంతం ఉందో లేదో అనేది కూడా తెలియదు మనకు. అలాంటిది మనుషుల్లాంటి జీవాలు మనమధ్యే తిరుగుతున్నాయేమో…లేదా తిరగడం లేదేమో. గన్‌షాట్‌గా దీని గురించి ఎవరూ చెప్పలేరు. 

అయితే గ్రహాంతరవాసులు ప్రయాణించాయి అని చెబుతున్న ప్రాంతాలు మాత్రం నేటికీ అలాగే ఉన్నాయి. వీటి చుట్టూ కొత్తగా మొదలైన యూఎఫ్‌ఓ టూరిజం (UFO Tourism) అనేది ఇలాంటి విషయాల్లో ఆసక్తి ఉన్నవారికి ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!