మన దేశంలో ఇంత క్రిస్టల్ క్లియర్ నీరున్న నది (Dawki )మరోటి లేదు. మరి అది ఎక్కడ ఉంది ? ఎలా వెళ్లాలి? తెలుసుకుందామా ?
డాకీ..మేఘాలయలోని సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక చిన్న గ్రామం. జైంషియా హిల్స్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ప్రకృతి ప్రేమికులకు స్వర్గంతో సమానం. భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులోని డాకీలో (Dawki) క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉన్న ఉంగాట్ నది (Umngot River) ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ చారిత్రాత్మక డాకీ సస్పెన్షన్ బ్రిడ్జి కూడా ఉంటుంది.
ముఖ్యాంశాలు
చూడాల్సిన ప్రదేశాలు | Places To Visit in Dawki

డాకీ వెళ్తే మీరు తప్పకుండా ఈ ప్రదేశాలను చూసేలా ప్లాన్ చేయండి. మీ టైమ్ అండ్ మనీని సరిగ్గా వినియోగించుకునేలా పైసా వసూల్ అయ్యే ప్రయాణం కోసం కొన్ని ప్రదేశాలను ఇక్కడ సూచిస్తున్నాము. చదవండి.
ఉంగాట్ నది | Umngot River

ఈ నదిలో రుపాయి నాణెం పడినా కనిపిస్తుంది. అంత స్వచ్ఛమైన నీరు ఇక్కడ ఉంటాయి. అందుకే చాలా మంది ఈ నదిలో బోటింగ్ ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటారు. ఇక్కడి ఫోటోలు తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. బోటింగ్ చేస్తూ నదిలోని రాళ్లు, చేపలను చూడటం అనేది థ్రిల్లింగ్‌ను కలిగించే విషయం అని చెప్పవచ్చు.
డాకీ సస్పెన్షన్ బ్రిడ్జి | Dawki Suspension Bridge

ఈ బ్రిడ్జిని బ్రిటిష్ వారు 1932 లో నిర్మించారు. నాడు భారత్ బంగ్లాదేష్ మధ్య వాణిజ్యం కోసం నిర్మించిన ఈ సస్పెన్షన్ వంతెన (colonial engineering) నేడు వలసవాద సమయం నాటి ఇంజినీరింగ్‌కు తార్కాణంగా నిలుస్తోంది.
మాలిన్‌నాంగ్ గ్రామం | Mawlynnong Village

ఈ గ్రామాన్ని ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన (cleanest village in Asia) గ్రామంగా చెబుతుంటారు. ఈ గ్రామానికి వెళ్తే నీట్‌నెస్ వల్ల ప్రపంచం ఎంత అందంగా కనిపిస్తుందో చూడవచ్చు. దీంతో పాటు ఇక్కడే లివింగ్ రూట్ బ్రిడ్జి (Living Root Bridges) అంటే తీగలతో ఏర్పడిన వంతెనలను కూడా చూడవచ్చు.
ష్నోంగ్‌డెంగ్ గ్రామం | Shnongpdeng Village
సాహసాన్ని ఇష్టపడే వారికి ఈ గ్రామం బాగా నచ్చుతుంది. ఇక్కడి భౌగోళిక స్వరూపం చూసేందుకు, జిప్ లైనింగ్, కయాకింగ్ వంటి యాక్టివిటీస్ చేసేందుకు చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.
చేయాల్సిన పనులు | Activities to Do
- బోటింగ్ (Boating) : బోటింగ్ ఇష్టపడే ప్రయాణికులు ఉంగాట్ నదిలో బోటింగ్ చేయవచ్చు. మంచి ఫోటోలు తీసుకోవచ్చు.
- అడ్వెంచర్ యాక్టివిటీస్ (Adventure Activities) : థ్రిల్లింగ్ కోసం ఎక్కడికైనా వెళ్లాలి అనుకుంటే మీకు డాకీ బాగా సెట్ అవుతుంది. ఇక్కడ జిప్ లైనింగ్, కయాకింగ్ , ( Kayaking ), క్లిఫ్ జంపింగ్ వంటి ఎన్నో యాక్టివిటీస్ మీరు ట్రై చేయవచ్చు.
- మేఘాలయ కల్చర్ (Meghalaya Culture) : ఖాసీ హిల్స్ (Khasi Hills) ప్రాంతంలో ఉన్న డాకీ వెళ్లే అక్కడి కల్చర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అక్కడి ఆహార విధానం, కట్టుబాట్లు, వ్యవసాయం, పండగలు, పెళ్లిళ్లు, ఇతర ఆచారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి.
ఎలా వెళ్లాలి ? | How to Reach Dawki
డాకీ అనేది మేఘాలయ రాజధాని షిల్లాంగ్ (Shillong) నుంచి 95 కిమీ దూరంలో ఉంటుంది. మీరు ఇక్కడికి షిల్లాంగ్ లేదా గౌహతీ (Guwahati) నుంచి షేర్డ్ ట్యాక్సీ, ప్రైవేట్ ట్యాక్సీలో వెళ్లవచ్చు. లేదంటే మీరు షిల్లాంగ్‌లో బైక్ రెంటుకు తీసుకుని వెళ్లవచ్చు. కానీ నా సలహా ఏంటంటే బైక్ ఎవాయిడ్ చేయండి. ఎందుకంటే ఖాసీ హిల్స్ ప్రాంతంలో మీరు ఎంటర్ అయితే మీకు మనుషులు కనిపించరు. షాప్స్, ఏటీఎంలు, హోటల్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. ట్యాక్సీలో వెళ్లే ఆ ఇబ్బందులు ఉండవు.
మేఘాలయపై నేను చేసిన వ్లాగ్స్ చూడండి.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.