ట్రావెలింగ్, టూరిజంలో ఎన్నో కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. అందులో ఈ మధ్య కాలంలో కాస్మెటిక్ టూరిజం (Cosmetic Tourism) అనేది బాగా పాపులర్ అవుతోంది. ఈ పోస్టులో కాస్మెటిక్ టూరిజం అంటే ఏంటి ? ఏ ఏ దేశాలు దీనికి ఫేమస్సో మీకు తెలియజేస్తాను. లెట్స్ స్టార్ట్…
ముఖ్యాంశాలు
కాస్మెటిక్ టూరిజం అంటే | What is Cosmetic Tourism?
ట్రావెలింగ్, టూరిజంలో ఎన్నో కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. అందులో ఈ మధ్య కాలంలో కాస్మెటిక్ టూరిజం (Cosmetic Tourism) అనేది బాగా పాపులర్ అవుతోంది.
సౌత్ కొరియాలోని రైనోప్లాస్టీ నుంచి (Rhinoplasty) నుంచి థాయ్‌లాండ్‌లోని లైపోసక్షన్ (Liposuction) వరకు చాలా మంది ప్రయాణికులు సర్జరీకి సర్జరీ సవారికి సవారి (ప్రయాణం) అనే ఫిలాసఫీతో ఈ కొన్ని దేశాలకు వెళ్తున్నారు.
ఏ దేశంలో అయితే వారికి తక్కువ ఖర్చులో మెరుగైన కాస్మెటిక్ సర్జరీ సేవలు లభిస్తాయో అక్కడే వివిధ డెస్టినేషన్స్ తిరిగేలా ట్రావెలింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేని ఈ ట్రావెల్ అండ్ మెడికల్ టూరిజంల ఫ్యూజన్ (కలయిక) ఇది. బ్యూటీ అండ్ మెడికల్ టూరిజాన్ని ఏకం చేసి కొత్త టూరిజం ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.
- ఇది కూడా చదవండి : మెక్సికోలో ప్రభాస్ మూవీ షూటింగ్…అసలు ఈ దేశం ఎంత డేంజరో తెలుసా?
కాస్మె టిక్ టూరిజం ఎందుకు ట్రెండ్ అవుతోంది ? | Why Cometic Tourism Is Trending?

కాస్మెటిక్ టూజిజం ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతుండటానికి అనేక కారణాలు ఉన్నాయి:
డబ్బులు ఆదా అవడం
టర్కీ, థాయ్‌లాండ్ (Thailand), మెక్సికో, సౌత్ కోరియా లాంటి దేశాల్లో కాస్మెటిక్ ప్రొసీజర్ అనేది ఇతర పాశ్చాత్య దేశాలతో పోల్చితే చవకగా అయిపోతుంది.
ఉదాహరణకు టర్కీలో (Turkey) హెయిర్ ప్లాంటేషన్ అనేది 3,800 డాలర్లుకు (రూ.318,000) చేసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో అమెరికాలో వచ్చేసి దీనికి 20,000 డాలర్లు అంటే అక్షరాలా రూ.16,75,000 వరకు అవుతుంది. చాలా తేడా ఉంది కదా. అందుకే చాలా మంది తక్కువకే అందంగా మారే అవకాశం ఉన్న కొన్ని దేశాలకు వెళ్తున్నారు.
క్వాలిటీ , నైపుణ్యం
పైన వివరించిన దేశాల్లో వరల్డ్ క్లాస్ క్లీనిక్స్ అందుబాటులో ఉండటంతో పాటు మంచి నైపుణ్యం ఉన్న సర్జరీ చేసే నిపుణులు ఉండటం ప్లస్ పాయింట్ అవుతోంది. సౌత్ కొరియాలో (South Korea) అడ్వాన్స్‌డ్ ఫేస్ లిఫ్ట్ (Advanced Facelift), కంటి సర్జరీలు ఫేమస్ అయితే, టర్కీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ , రైనోప్లాస్టీ (rhinoplasty- ముక్కు ఆకారాన్ని మార్చుకోవడం) విషయంలో మంచి పేరు సంపాదించుకుంది.
కోలుకునే అవకాశం
ఈ దేశాల్లో సర్జరీ చేయించుకున్న వ్యక్తులు తమకు నచ్చిన కొత్త ప్రదేశాల్లో ఉంటూ కొలుకునే అవకాశం ఉంటుంది. ఇలా సర్జరీకి వచ్చే వారి కోసం సర్జరీ పూర్తి అయ్యాక ఉండేందుకు, కోలుకునేందుకు ఎన్నో విలాసవంతమైన హోటళ్లను సిద్ధం చేసి ఉంచుతుంటారు.
సోషల్ మీడియా ప్రభావం
చాలా మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో తమ కాస్మెటిక్ సర్జరీల గురించి షేర్ చేస్తుంటారు. దీంతో చూసే వాళ్లకు అందం కోసం సర్జరీ చేయించుకోవడం సాధారణమైన విషయంగా అనిపిస్తుంది.
గతంలో వాళ్లు ఎలా ఉండే వారు సర్జరీ తరువాత ఎలా అయ్యారు అనే విషయాన్ని ఇన్‌ఫ్లుయెన్సర్లు షేర్ చేస్తుండటంతో చాలా మంది వారి నుంచి ప్రేరణ పొందుతున్నారు. వారిలాగే అందంగా మారాలి అనుకుంటూ వారి దారిలోనే ప్రయాణిస్తున్నారు. ఇందులో కొన్ని పెయిడ్ ప్రమోషన్స్ కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది.
- ఇది కూడా చదవండి : విదేశీ ప్రయాణంలో మందులు ఎలా ప్యాక్ చేసుకోవాలి ? | Medicines For An International Trip
ఏ దేశంలో ఏ కాస్మెటిక్ సర్జరీకి ఫేమస్ అంటే..| Cosmetic Tourism Destinations
దేశం | ప్రత్యేకతలు | లాభాలు |
---|---|---|
టర్కీ | హెయిర్ ప్లాంటేషన్, రైనోప్లాస్టీ | రూ.318,000 కే (సుమారు) హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, నైపుణ్యం కలిగిన సర్జియన్లు |
దక్షిణ కొరియా | లేజర్ ట్రీట్మెంట్, ఫేస్ లిఫ్ట్, ఐ సర్జరీ | అత్యాధునిక సాంకేతికత, కొరియన్ బ్యూటీ నిపుణుల నైపుణ్యం |
థాయ్‌లాండ్ | జెండర్ అఫర్మెషన్ సర్జరీ, బాడీ కోంటోరింగ్ | గుర్తింపు ఉన్న ఆసుపత్రులు, టూరిజం |
భారత్ | డెంటల్ వర్క్, స్కిన్ ట్రీట్మెంట్ | తక్కువ ధరకు వైద్యం, ఎక్కువ విజయాల శాతం |
మెక్సికో | బ్రెజీలియన్ బట్ లిఫ్ట్, గ్యాస్ట్రిక్ బైపాస్ | అమెరికాకు దగ్గరగా ఉండటం, ధరలు తక్కువగా ఉండటం |
వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

కాస్మెటిక్ ట్రావెల్ (Cosmetic Travel) వల్ల అనేక లాభాలు ఉన్నాయని ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీడియోలు చూసి తెలుసుకుని చాలా మంది ఆయా దేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. సరదాగా తిరుగుతూ, ఎంజాయ్ చేస్తూ అందంగా, కొత్తగా తిరిగి వచ్చేయొచ్చు అని అనుకుంటారు. అయితే కాస్మెటిక్ టూరిజంలో ఉన్న రిస్కీ యాంగిల్ కూడా తెలుసుకుని తరువాత నిర్ణయించుకోండి :
- క్లీనిక్స్ గురించి రీసెర్చ్ : కాస్మెటిక్ సర్జరీ చేసే క్లినిక్‌కు అన్ని అనుమతులు ఉన్నాయా, అందులో పనిచేసేవారికి సరైన నైపుణ్యం ఉందో లేదో చెక్ చేయండి.
- కాస్ట్ : సర్జీతో పాటు అక్కడ తిరిగేందుకు ఎంత ఖర్చు అవుతుందో ఖచ్చితమైన లెక్కలు వేసుకుని ప్లాన్ చేసుకోవాలి.
- కొలుకునే సమయం : సర్జరీ పూర్తయ్యాక కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందో కనుక్కుని అంత టైమ్ వరకు అక్కడ ఉండేలా డబ్బు, సమయాన్ని కేటాయించేలా చూసుకోవాలి.
- ఆరోగ్యపరమైన రిస్కులు : విదేశాల్లో సర్జరీ చేయించుకోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్లు, రిస్కుల గురించి తెలుసుకోవాలి.వీటిని గుర్తుంచుకుని నిర్ణయం తీసుకోవాలి. అవసరం అయితే మీ వైద్యుడిని సంప్రదించి సూచనలు తీసుకోవాలి.
- ఇది కూడా చదవండి: కొత్త దేశం వెళ్తున్నారా? అయితే ఈ పపులు అస్సలు చేయకండి!
మొత్తానికి
కాస్మెటిక్ టూరిజం అనేది బ్యూటీ టూరిజం ( Beauty Tourism), మెడికల్ టూరిజం రెండింటి కలబతోల ఒక కొత్త ట్రెండ్. ప్రయాణంతో పాటు సర్జరీ చేయించుకునే ఈ అవకాశాన్ని చాలా మంది ప్రయత్నించేందుకు ప్లాన్ చేస్తుంటారు.
మెక్సికోలో ( Mexico) బ్రెజీలియన్ బట్ లిఫ్ట్ సర్జరీ కోసం ఆలోచిస్తున్నా, టర్కీలో హెయిర్ ఫ్లాంటేషన్ కోసం ప్లాన్ చేస్తున్నా నిపుణుల సలహా తీసుకోవడం మర్చిపోకండి.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.