ఈ వసంతం ఎంతో అందమైనది | ఈ 10 ప్రదేశాలు చూస్తే మీకే తెలుస్తుంది | Spring Destinations

షేర్ చేయండి

ప్రపంచంలో చాలా మందికి వసంతం (Spring Destinations) నచ్చుతుంది. ఎందుకంటే ఈ సమయంలో ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలు అత్యంత అందంగా కనిపిస్తాయి. అక్కడి నేచర్ అందంతో టార్చర్ చేసేలా ఉంటుంది. అలా స్ప్రింగ్ సీజన్‌లో అందంగా కనిపించే నగరాలు ఇవే…

క్యోటో, జపాన్ 

Kyoto, Japan
జపాన్‌లోని క్యోటో

Tokyo, Japan : వసంతంలో క్యోటో స్వర్గంలా మారిపోతుంది. అందమైన చెర్రీ బ్లాసమ్స్ చూసేందుకు చాలా మంది విదేశాల నుంచి ఈ నగరానికి చేరుకుంటారు. ఇక్కడి చారిత్రాత్మక ఆలయాలు, గార్డెన్లతో పాటు వీధుల్లో తిరుగుతూ అందమైన నేచర్‌ను, పింక్ కలర్‌లో ఉన్న పువ్వులను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. 

చెర్రీ బ్లాసమ్ పువ్వులు (Cherry Blossom) ను జపనీస్‌లో సకురా (Sakura) అని పిలుస్తుంటారు. ఇవి ఆర్నమెంటల్ చెర్రీ ట్రీకి పూస్తుంటాయి. ఇవి చూడటానికి చాలా అందంగా, ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. జపాన్‌తో పాటు ప్రపంచంలోనే అనేక దేశాల్లో వీటిని మనం చూడవచ్చు.

వాషింగ్టన్ డీసి, అమెరికా

Spring Destinations
వాషింగ్టన్ డీసి

Washington DC, USA : వసంత కాలంలో ఇక్కడ నేషనల్ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ సమయంలో ఇక్కడ టైడల్ బాసిన్, జెఫర్‌సన్ మెమోరియల్ సమీపంలో ఎటుచూసినా చెర్రీ బ్లాసమ్స్ కనిపిస్తాయి. 

టస్కానీ, ఇటలి | Spring Destinations

Tuscany, Italy spring
టస్కాని

Tuscany, Italy : ఇటలీలోని టస్కానీలో రోలింగ్ హిల్స్ చాలా ఫేమస్. చలికాలతో పాటు వసంతంలో కూడా ఇక్కడికి చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. ఇక్కడి వైల్డ్ ఫ్లవర్స్‌, కనుచూపుమేరా కనిపించే పచ్చదనం చూసి ఫిదా అయిపోతుంటారు. 

Rolling Hills Meghalaya
వెస్ట్ ఖాసీ ప్రాంతంలో రోలింగ్ హిల్స్.

నాకు ఇలాంటి వ్యూస్ అంటే రోలింగ్ హిల్స్ అనేవి మెఘాలయలోని (Meghalaya)  షిల్లాంగ్ నుంచి ఈస్ట్ ఖాసీ హిల్స్‌లో ఉన్న వారాషీ ఫాల్స్‌‌కు వెళ్తుంటే కనిపించాయి. 

ఆంస్టర్‌‌డ్యామ్, నెథర్లాండ్స్

Amsterdam, Netherlands spring
అపరిచితుడు మూవీలో ఒక పాట ఇక్కడే షూట్ చేశారు

Amsterdam, Netherlands : అంస్టర్‌డ్యామ్ మామూలుగానే చాలా అందంగా ఉంటుంది. ఇక ట్యూలిప్ పువ్వుల (Tulips) సీజన్‌‌లో అయితే మరింత అందంగా ముస్తాబవుతుంది. ఈ సమయంలో మీరు కోకెన్‌హాఫ్ (Keukenhof) గార్డెన్‌, ట్యూలిప్ బార్న్ (the tulip barn) వంటి ప్రాంతాల్లో లక్షలాది ట్యూలిప్ పువ్వులను చూడవచ్చు. 

చియాన్ విక్రమ్ నటించిన అపరిచితుడు (Aparichitudu)  మూవీలో కుమారీ అనే పాటను  నెథర్లాండ్‌లోనే షూట్ చేశారు. అందులో కనిపించే ట్యూలిప్ గార్డెన్ కూడా ఇక్కడిదే. 

ప్యారిస్, ఫ్రాన్స్ 

spring Paris, France
చెర్రీ బ్లాసమ్స్ ఫ్లవర్స్ మధ్య ఉన్న ఐఫిల్ టవర్స్

Paris, France : ప్యారిస్‌లోని జార్డిన్ డెస్ ట్యూలెరీస్ (Jardin Des Tuileries)‌ ప్రాంతంతో పాటు ఐకానిక్ ఐఫిల్ టవర్ (Eiffel Tower) వద్ద ఉన్న చెర్రీ బ్లాసమ్స్ చూసి చాలా మంది ప్యారిస్ ఎంత రొమాంటికో అని ఆలోచిస్తుంటారు.

వాంకోవర్, కెనడా

Vancouver, Canada spring
చెర్రి బ్లాసమ్స్ పూల వనంలో ఒక వనిత

Vancouver, Canada : కెనడా చాలా అందమైన దేశం. మరీ ముఖ్యంగా స్ప్రింగ్ సమయంలో ఇక్కడి బ్యూటి గుండెను లూటీ చేస్తుంది. తెల్లని మంచుతో కప్పబడి ఉన్న పర్వతాలు చెర్రీ బ్లాసమ్స్ ఒకవైపు…ఫస్ట్ లుక్‌లోనే ఆసమ్ అనిపిస్తుంది.

జిన్హే, సౌత్ కొరియా

Jinhae, South Korea
వసంతం అంటే కొరియాలనే ముందుకు గుర్తొస్తుంది.

Jinhae, South Korea : వసంత కాలంలో జిన్హే అనే ప్రాంతంలో చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ (Cherry Blossom Festival) జరుగుతుంది. ఈ సమయంలో ఈ ఏరియా మొత్తం పింక్ వండర్లాండ్‌లా మారిపోతుంది. ప్రతీ వీధి అందంగా కనిపిస్తుంది. చాలా మంది ఇక్కడికి వచ్చి ఫోటోగ్రఫీ చేయడానికి ఇష్టపడతారు. సరదాగా నడుచుకుంటూ వెళ్లి జీవితం ఎంత అందమైందో తెలుసుకుంటారు.

సెవిల్లే, స్పెయిన్ 

Seville, Spain spring
ప్రపంచంలో కొన్ని చోట్ల మాత్రమే కనిపించే ఆరెంజ్ రంగు పువ్వులు

Seville, Spain : ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో పింక్ కలర్ చెర్రీ బ్లాసమ్స్ కనిపిస్తాయి.అయితే స్పెయిన్‌లోని సెవిల్లే అనే ప్రాంతంలో మాత్రం నారింజ రంగులో పువ్వులు ( Orange Flowers In Spain) కనిపిస్తాయి. గాలిలో ఒక మధురమైన సువాసన ఉంటుంది. ఏప్రిల్‌లో జరిగే ఫెరియా అనే ఫెస్టివల్‌‌ చాలా కలర్‌ఫుల్‌గా (Spring Destinations) ఉంటుంది. 

అజోరోస్, పోర్చుగల్

Azores, Portugal spring
అందం అన్నం పెట్టదు…

Azores, Portugal : వలసవాదానికి మారుపేరుగా నిలిచిన పోర్చుగల్‌లో అజోర్స్ అనే ప్రాంతం ఉంటుంది. ఇక్కడి భౌగోళిక స్వరూపం చాలా మందిని ఇక్కడికి వచ్చేలా చేస్తుంది. ఇక్కడ వైల్డ్ ఫ్లవర్స్‌తో పాటు తీర ప్రాంత అందం అనేది వసంతంలోనే చూడాలి అంటారు. హైకింగ్, రిలాక్సేషన్ కోసం ఇది చాలా మంది స్పాట్ (Spring Destinations).

బాన్, జర్మనీ | Spring Destinations

Bonn, Germany
జర్మని

Bonn, Germany:  వసంతంలో జర్మనీలోని బాన్ ప్రాంతం మొత్తం చెర్రీ బ్లాసమ్ పువ్వుల రాజ్యంగా మారిపోతుంది. ఈ నగరంలోని పాతబస్తి అంటే ఓల్డ్ టౌన్‌ పువ్వుల అందం వల్ల మరింత అందంగా కనిపిస్తుంది.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!