ప్రపంచంలోనే అత్యంత సీక్రెట్ దేశం అయిన ఉత్తర కొరియా (North Korea) టూరిజంపై ఫోకస్ చేస్తోంది. ఆర్థికంగా పుంజుకునేందుకు విదేశీ పర్యాటకులను ఆనుమతిస్తోంది.
ముఖ్యాంశాలు
5 సంవత్సరాల తరువాత | North Korea Reopens International Tourism

సుమారు 5 సంవత్సరాల పాటు ప్రపంచం నుంచి దూరంగా ఐసోలేషన్‌లో ఉన్న ఉత్తర కొరియా (North Korea) అంతర్జాతీయ పర్యాటకులను తన దేశానికి ఆహ్వానిస్తోంది. నార్త్ కొరియా హఠాత్తుగా ఇలా చేయడానికి కారణం ఆ దేశం ఆర్థిక పరిస్థితి.
ఒకప్పుడు విదేశీ నగదు కోసం ఉత్తర కొరియా టూరిజంపై ఎక్కువగా ఆధారపడేది. తరువాత 5 ఏళ్ల నుంచి పరిస్థితి మారింది.
- దీంతే చేసేదేం లేక అంతర్జాతీయ ఆర్థిక అవసరాల కోసం విదేశీ నగదు లభ్యత కోసం విదేశీ టూరిస్టులను తమ దేశంలో పర్యటించేందుకు అనుమతించింది.
- ఈ పోస్టులో నార్త్ కొరియా పర్యాటకంపై వివరాలు, ఆ దేశంలో సందర్శించాల్సిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
ఆర్థిక అవసరాల కోసం | North Korea

మహమ్మారికి ముందు పర్యాటకం నుంచి బాగా డబ్బు సంపాదించేది ఉత్తర కొరియా. చైనా (China) నుంచే 90 శాతం పర్యాటకులు ఆ దేశం వెళ్లేవారు. అయితే అక్కడి కఠిన నియమాలు, ఫోటోగ్రఫీపై ఉన్న ఆంక్షల వల్ల పర్యాటక రంగం (North Korea Tourism) అనేది అంతగా పుంజుకోలేదు అనేది చారిత్రాత్మక సత్యం.
ఉత్తర కొరియాలో చూడదగ్గ ప్రదేశాలు | Places To Visit In North Korea

మనలో ఎంత మంది జీవితంలో ఉత్తర కొరియాకు వెళ్లాలని అనుకుంటారో, వెళ్తామో అనేది తెలియదు. అయితే జస్ట్ ఫర్ నాలెడ్జ్ అక్కడ పర్యాటకులకు అనుమతి ఉన్న సందర్శనీయ ప్రదేశాలు ఇవే.
1. సామ్జియాన్ | Samjiyon :
ఈ నగరాన్ని కిమ్ జాంగ్ 2 (Kim Jong Il) పుట్టిన ప్రదేశంగా చెబుతారు. ఈ నగరం ఉత్తర, దక్షిణ కొరియాకు సాంస్కృతికంగా ప్రధానంగా భావించే మౌంట్ పేక్టూ (Mount Paektu)కు సమీపంలో ఉంటుంది.
2. ప్యాంగ్యాంగ్ | Pyangyang :

ఉత్తర కొరియా రాజధాని ఇది. ప్యాంగ్యాంగ్ నగరం వెళ్లిన వారికి ఉత్తర కొరియా కల్చర్ (North Korea Culture) ఆచారాలు, సంప్రదాయాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడి ప్రముఖ మాంసుడే గ్రాండ్ కట్టడాన్ని (Mansudae Grand Monument) కూడా చూడవచ్చు.
3. రాసన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ | Rason Special Economic Zone
ఉత్తర కొరియాలో ఉన్న అతికొద్ది ప్రత్యేక ఆర్థిక ప్రాంతాల్లో రాస్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కూడా ఒకటి. ఇటీవలే ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులకు అనుమతించారు.
4. వాంసాన్ కాల్మా బీచ్ రిసార్ట్ | Wonsan-Kalma Beach Resort
ఈ రిసార్టు 2025 జూన్ నుంచి పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. టూరిజానికి ఊతం అందించే దిశలో ఉత్తర కొరియా అమలు చేసిన పథకాల్లో ఇది కూడా ఒకటి.
సవాళ్లు తప్పవు

ఇటీవలే ఉత్తర కొరియా చేసిన మార్పుల వల్ల ఆ దేశ పర్యాటకం వెంటనే పుంజుకుంటుంది అని చెప్పలేము. ఎందుకంటే ఈ దేశానికి చైనా నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వెళ్లేవారు.కా నీ వివిధ కారణాల వల్ల ఈ సంఖ్య తరువాత భారీగా తగ్గింది.
అయితే ఇటీవలే ఒక చిన్న గ్రూపు నార్త్ కొరియాకు (Latest North Korea Tourism News) వెళ్లి వచ్చింది. దీన్ని బట్టి కొన్ని విషయాల్లో ఉత్తర కొరియా ఆంక్షలను సడలించినట్టు సమాచారం.

నార్త్ కొరియా అనేది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన దేశం (Most Secret Country). ఇలాంటి దేశం విదేశీ పర్యాటకులను అనుమతించినా ఎంత మంది అక్కడికి వెళ్లడానికి ఇష్టపడతారో చెప్పలేము. ఎందుకంటే అక్కడి రూల్స్ (North Korea Rules) అనేవి అర్థం చేసుకోవడానికే సమయం పడుతుంది. ఆ వచ్చే అతి కొద్దిమంది టూరిస్టుల వల్ల ఆ దేశ ఆర్థిక లక్ష్యాలు నెరవేరుతాయా లేదా అనేది చూడాల్సిందే.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.