పెరుగుతున్న సముద్రమట్టం నుంచి తన భూభాగాన్ని కాపాడేందుకు వినూత్నంగా ఆలోచిస్తోంది ఒక చిన్న దేశం. తన దేశ పౌరసత్వాన్ని అందించే గోల్డెన్ పాస్‌పోర్ట్ (Nauru Golden Passport) కేవలం 105,000 డాలర్లకు (రూ.91 లక్షలకు) అమ్ముతోంది.
పసిఫిక్ ఐలాండ్స్‌లో (Pacific Islands) ఒక చిన్న దేశం నౌరూ. పెరుగుతున్న సముద్రమట్టం నుంచి తన భూభాగాన్ని కాపాడేందుకు వినూత్నంగా ఆలోచిస్తోంది. అయితే ఈ ఆలోచనపై వివాదం కూడా చెలరేగుతోంది. ఎందుకంటే తన దేశ పౌరసత్వాన్ని అందించే గోల్డెన్ పాస్‌పోర్ట్ కేవలం 105,000 డాలర్లు (రూ.91 లక్షలకు) అమ్ముతోంది.
ఇలా చేయడం వల్ల వచ్చే డబ్బుతో తన దేశ ప్రజలను కొత్త ప్రాంతానికి తరలించేందుకు, మారుతున్న వాతావరణాన్ని బట్టి బతికి బట్టకట్టేందుకు వినియోగించనుంది.
ముఖ్యాంశాలు
పర్యావరణ సంక్షోభం | Naurus Climate Crisis
ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో (Worlds Smallest Nation) నౌరూ ఒకటి. సుమారు 5 కిమీ ఉన్న ఈ బుల్లి దేశం పర్యావరణ మార్పుల (climate Change) వల్ల తన ఉనికిని కోల్పోయేలా ఉంది. పెరుగుతున్న సముద్రమట్టం, తుపానులు, తీరప్రాంతాలు కోసుకుపోవడం వంటి అనేక సమస్యల మధ్య ఈ చిన్న ఐలాండ్ దేశం భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టింది.
- ప్రపంచంలో ఇతర తీర ప్రాంతాలతో పోల్చితే నౌరులో సముద్రమట్టం 1.5 రెట్లు వేగంతో పెరుగుతోంది. అంటే నేలను సముద్రం మింగేస్తోంది అని చెప్పవచ్చు.
- ఇక్కడ మరో విషయం ఏంటంటే కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతున్న ఫాస్పేట్ మైనింగ్ వల్ల 80 శాతం భూమి నివాసయోగ్యం కాకుండాపోయింది.
- ఉన్న 20 శాతంలో సముద్రం నీటి శాతం పెరుగుతోంది. దీంతో ఎంత వీలైతే అంత త్వరగా అక్కడి ప్రజలు కొత్త ప్రాంతానికి చేరుకోడమో లేదా ఉన్న భూమిని బట్టి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం చేయాల్సి ఉంటుంది.
- దీని కోసం చాాలా డబ్బు కావాలి…ఆ అవసరంలోంచి పుట్టిందేే…
నౌరూ గోల్డెన్ పాస్‌పోర్ట్ | Golden Passport

నౌరు దేశం ప్రారంభించిన ఈ కొత్త సిటిజెన్‌షిప్ (Nauru Citizenship Program) కార్యక్రమంలో బాగా ధనికులైన వారు నౌరూ దేశ పౌరసత్వాన్ని డబ్బు ఇచ్చి కొనుగోలు చేయవచ్చు. దాని కోసం 105,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
- బదులుగా వారికి 89 దేశాలకు వీసా ఫ్రీ యాక్సిస్ లభిస్తుంది.
- అందులో యూకే, యూఏఈ (UAE), సింగాపూర్, ఐర్లాండ్ (Ireland) వంటి దేశాలు కూడా ఉన్నాయి.
- ఇప్పటికే చాలా మంది ఈ పౌరసత్వం కోసం అప్లై కూడా చేస్తున్నారు.
ఈ కార్యక్రమం వల్ల మొదటి ఏడాది 66 సక్సెస్‌ఫుల్ అప్లికేషన్లతో 5.7 మిలియన్ల డాలర్లను సంపాదించాలని భావిస్తోంది నౌరూ. భవిష్యత్తులో మొత్తం 500 మందికి పౌరసత్వాన్ని అందించి 43 మిలియన్ల డాలర్లు సేకరించాలని భావిస్తోంది.
ఈ దేశ ఆదాయంలో ఇది 20 శాతం ఉంటుంది. ఈ డబ్బులతో పర్యావరణ మార్పులను తట్టుకునే విధంగా ఉండే మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రజలను కొత్త ప్రాంతాలకు తరలించేందుకు ఉపయోగించనున్నారు.
పునరావాస దిశలో | Nauru Golden Passport
తమ దేశంలో ఉన్న జనాభాలో 90 శాతం మందిని ఎత్తైన ప్రాంతాలకు తరలించే దిశగా నౌరూ పథకాలు రచిస్తోంది. దీని కోసం తొలి దశలోనే 60 మిలియన్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ డబ్బును ఇళ్లను, కార్యాలయాలను, ఫామ్స్ నిర్మించేందుకు ఉపయోగించనున్నారు.
విప్లవాత్మకం, వివాదం కూడా
నౌరూ దేశం తీసుకువచ్చిన ఈ గోల్డెన్ పాస్‌పోర్ట్ విధానాన్ని అంతర్జాతీయంగా చాలా మంది విమర్శిస్తున్నారు. దీనిని నేరస్థులు తమకు అనుకూలంగా వినియోగించే అవకాశం ఉంది అని చెబుతున్నారు.
- అయితే తమ దేశం క్రిమినల్స్‌కు స్వర్గంగా మాకుంకుండా ఉండేందుకు. వారి చేతిలో ఒక ఆయుధంగా మారకుండా ఉండేందుకు నౌరూ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.
- ఉత్తర కొరియా (North Korea) లాంటి ప్రమాదకరమైన దేశాల నుంచి అప్లికేషన్స్ వస్తే అంగీకరించకుండా చూసుకుంటున్నారు.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.