వైయస్సార్ జిల్లా : ఒంటిమిట్టలోని కోదండరామ స్వామి ఆలయంలో (Vontimitta Temple) మహా సంప్రోక్షణం కార్యక్రమం మొదలైంది. అదే సమయంలో అమరావతిలో శ్రీవారి కళ్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు, ప్రచారం వేగంగా జరుగుతోంది. మరెన్నో విషయాలు ఈ పోస్టులో
ముఖ్యాంశాలు
వైయస్సార్ జిల్లా : ఒంటిమిట్టలోని కోదండరామ స్వామి ఆలయంలో (Sri Kodandarama Swamy Temple) మహా సంప్రోక్షణం కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆగమ సలహాదారులు శ్రీ రాజేష్ స్వామి ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో (Sri Kodandarama Swamy Temple) ఈ పవిత్ర కార్యక్రమాలు జరుతున్నాయి.
కార్యక్రమాల విశేషాలు | Vontimitta Temple

మహా సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా జరిగే వివిధ కార్యక్రామల వివరాలు ఇవే
- సహస్ర కలశవాహన : ఈ కార్యక్రమంలో కలశంలోని పవిత్ర జలంతో ఆలయాన్ని శుద్ధి జరిపిస్తారు.
- రామ తారక హోమం : అగ్ని ఆచారంలో భాగంగా శ్రీ రాముడిని (Lord Shri Rama) ప్రార్థించి దుష్ట శక్తులను పారద్రోలడం .
- శ్రీమద్రామయణ హోమం : పవిత్రమైన రామాయణానికి (Ramayanam) అంకితం చేసిన ఆచారం
- పావమాన పంచసూక్త హోమం : పవిత్ర మంత్రాలతో శుద్ధి చేసే ఆచారం
- విమార గోపురం ఛాయా స్నపనం : ఈ ఆచారంలో భాగంగా ఆలయ గోపురం నీడను పవిత్రం చేస్తారు.
- పరివార హోమం : ఆలయ ప్రాంగణాలను, పరిసరాలను శుద్ధి చేసే ఆచారం.
శ్రీనివాస కళ్యాణోత్సవం వాల్ పోస్టర్ ఆవిష్కరణ

మార్చి 15వ తేదీన తితిదే (Tirumala Tirupati Devasthanam) ఆధ్వర్యంలో వెంకటపాలెంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో (Venkatapalem Lord Balaji Temple) శ్రీనివాస కళ్యాణోత్సవం జరగనుంది. ఈ కళ్యాణోత్సవానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను టిటిడి ఈవో జే శ్యామల రావు ఆవిష్కరించారు.
- ఇది కూడా చదవండి : ఇక్కడ మారేడు దళం నీటిలో వేస్తే , కాశి గంగలో తేలుతుందంట | Kadali Kapoteswara Swamy Temple
- ఈ కళ్యాణోత్సవంలో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు (Annamacharya Project) ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
- తిరుమలలో శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించలేని భక్తులకు ఇది అద్భుతమైన అవకాశం అని తెలిపారు అధికారులు.
- ఈ కళ్యాణోత్సవవానికి అమరావతి పరిసర ప్రాంతాల్లోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి అని అధికారులు కోరారు.
శ్రీవారి ధర్మరథాలు ప్రారంభం | Dharma Ratham

అమరావతిలోని (Amaravati) వెంకట పాలెంలో మార్చి 15వ తేదీన సాయంత్రం శ్రీనివాస కళ్యాణోత్సవం జరగనుంది. దీనికి సంబంధించిన ప్రచారాన్ని నిర్వహించేందుకు శ్రీవారి ధర్మ రథాలను ప్రారంభించారు. ఈ ధర్మరథాలతో (Sri Vari Dharma Ratham) శ్రీవారి కళ్యాణోత్సం గురించి అమరావతిలో విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.