ఎండలు దంచేస్తున్నాయి…వీసా అవసరం లేని 7 దేశాలు పిలుస్తున్నాయి | Visa Free Summer Destinations

షేర్ చేయండి

ఈ ఎండాకాలం ఏదైనా ఇంటర్నేషనల్‌ ట్రిప్‌ వెళ్లాలని అనుకుంటున్నాారా? (Visa Free Summer Destinations) మీ దగ్గర వ్యాలిడ్ పాస్‌పోర్టు ఉంటే చాలు 2025 సమ్మర్‌లో ఎన్నో దేశాలకు వీసా అవసరం లేకుండా వెళ్లే అవకాశం ఉంది.

ఈ పర్యాటక ప్రాంతాల్లో సూపర్ ల్యాండ్‌స్కేప్‌, అద్భుతమైన సంప్రదాయాలకు నెలవే కాదు మీకు మంచి ట్రావెల్ (travel) ఎక్స్‌పీరియెన్స్‌ను కూడా అందిస్తాయి. దీని కోసం మీకు ఎలాంటి పేపర్ వర్క్ చేసే అవసరం కూడా లేదు. మరి ఆ ఏడు దేశాలేవో చూసేద్దామా ? 

థాయ్‌లాండ్ | Thailand

thailand
థాయ్ నమస్కారం | Gif : Tenor

భారతీయులు ఎక్కువగా ఇష్టపడే ఇంటర్నేషనల్‌ డెస్టినేషన్స్‌లో థాయ్‌లాండ్ పేరు ముందుగా ఉంటుంది. దీనిని చాలా మంది సంతోషాన్ని పెంచే దేశంగా భావించి అక్కడికి వెళ్తుంటారు.  అందమైన బీచులు (Thailand Beaches), జీవకళ ఉట్టిపడేలా ఉండే లైవ్లీ పట్టణాలు, ఘనమైన వారసత్వం, అద్భుతమైన థాయ్ కల్చర్ ఇవన్నీ భారతీయులను కట్టిపడస్తాయి. 

  • ఈ దేశానికి వెళ్లేందుకు ముందుస్తు వీసా అవసరం లేదు. మీరు థాయ్‌లాండ్ వెళ్తే వీసా అవసరం లేకుండా 30 రోజుల వరకు ఉండవచ్చు. 
  • సో ఇక క్విక్ సమ్మర్ ట్రిప్ (Summer Trip) కావాలంటే బ్యాంకాక్ మంచి ఆప్షన్ అవుతుంది. 
  • బ్యాంకాక్‌ నుంచి (Bangkok) అందమైన బీచులున్న ఫుకెట్‌ (Phuket), క్రాబీలోని (Krabi) దీవుల వరకు ప్రతీ ట్రావెలర్‌కు కావాల్సిన కంటెంట్ ఇక్కడ తప్పకుండా లభిస్తుంది. 
  • ఇది కూడా చదవండి: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?

మారిషస్ | Mauritius 

Visa Free Summer Destinations
మారిషస్

తళతళ మెరిసే సముద్ర తీరాల నుంచి అందమైన ల్యాండ్‌స్కేప్ వరకు మారిషస్ అనేది టూరిస్టుల పాలిట స్వర్గంలాంటిదే అని చెప్పవచ్చు. మారిషస్‌కు వెళ్లే భారతీయులకు 90 రోజుల పాటు వీసా లేకుండా అక్కడ ఉండే అవకాశం ఉంది.

  • ఈ అందమైన దేశాన్ని పూర్తిగా ఎక్స్‌ప్లోర్ చేసేందుకు ఈ సమయం సరిపోతుంది కదా? 

నేపాల్ | Nepal

Countries That Celebrate Republic Day
నేపాల్

నేపాల్- భారత్‌కు మధ్య బార్డర్ లేదు అనే విధంగా ఉంటుంది ఈ బంధం. ఎందుకంటే నేపాల్ నుంచి భారత్‌కు భారత్ నుంచి నేపాల్‌కు ప్రజలు, పర్యాటకులు ఏదో ఊరు దాటినట్టు దాటేస్తారు. 

  • ఇక్కడ అందమైన హిమాలయ పర్వతాలు (Himalayas), పవిత్రమైన ఆలయాలు, సాహసాన్ని తట్టిలేపే యాక్టివిటీస్ ఇలా ఎన్నో పర్యాటకులను నేపాల్ వెళ్లేలా చేస్తుంటాయి.

నేపాల్ వెళ్లేందుకు భారతీయులకు వీసా అవసరం లేదు. దీంతో పాటు మిగితా దేశాలతో పోల్చితే ఖర్చు తక్కువ. 

  • దీంతో పాటు మన దేశంలో ఉన్నట్టే అనుభూతిని కలిగించే నేపాల్ అనేది భారతీయులకు ఎవర్‌గ్రీన్ ఫేవరిట్ దేశం అని చెప్పవచ్చు.

కజకిస్తాన్ | Visa Free Summer Destinations

Kazakhstan
కజకిస్తాన్ ల్యాండ్ స్కేప్

Kazakhstan : కజకిస్తాన్‌కు వెళ్లే భారతీయుల సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఇక్కడ భౌగోళిక స్వరూపం చాలా భిన్నంగా ఉండటం వల్ల చాలా మంది ఈ దేశానికి వెళ్తున్నారు. దీంతో పాటు ఇక్కడి కల్చర్, మోడర్న్ సిటీస్ కూడా భారతీయులను ఆకట్టుకుంటున్నాయి.

ఇరాన్ | Iran

ఇరాన్‌లోని పురాతన నగరాలు (Old Cities of Iran), అద్భుతమైన నిర్మాణ శైలి, ఆతిధ్యం వంటివి భారతీయులు ఎక్కువగా ఇష్టపడే విషయాలు. 30 రోజుల పాటు ఇరాన్‌‌‌ వెళ్లి అక్కడ వివిధ ప్రాంతాలను చూసేయవచ్చు. 

  • చరిత్ర, ఆచారాల గురించి తెలుసుకోవాలి అనుకునేవారికి ఇది ఒక మంచి డెస్టినేషన్ అని చెప్పవచ్చు.
  • ఇరాన్ వెళ్లే ముందు తాజా వార్తలు చూసే చెక్ చేసి ప్లాన్ చేసుకోగలరు.

ఫిజి | Fiji

Fiji
ఫిజీ

ఆస్ట్రేలియాకు చేరువలో ఉన్న ఐలాండ్ దేశాలకు (South Pacific Nations) వెళ్లేందుకు చాలా మంది ఫిజి దేశానికి వెళ్తుంటారు. ఇక్కడి ద్వీపాలు, పగడపు దిబ్బలు, నవ్వుతూ పలకరించే స్థానికులు ఇవన్నీ భారతీయ ట్రావెలర్స్ (Indian Travelers) బాగా ఇష్టపడతారు.

భూటాన్ | Bhutan

Bhutan
భూటన్

భూతల స్వర్గంగా పిలచుకునే భూాటాన్‌కు భారత్‌కు మధ్య మంచి స్నేహ బంధం ఉంది. అందుకే ఈ భూటాన్ వెళ్లేందుకు భారతీయులకు వీసా (Visa) అవసరం లేదు. అయితే భూటాన్ వెళ్లేందుకు భారతీయులు స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది (Visa Free Summer Destinations).

  • అయితే భూటాన్ వెళ్లేందుకు మీరు భూటాన్ నుంచి అనుమతి పొంది ట్రావెల్ ఆపరేటర్ల ద్వారా ట్రావెల్ ప్యాకేజ్ బుక్ చేసుకోవాలి.
  • థింపూ (Thimpu), పారో (Paro) దాటి వెళ్లాలి అంటే స్పెషల్ పర్మిషన్ కావాలి.
  • ఇది కూడా చదవండి : Bhutan : భూటాన్ ఎలా వెళ్లాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్ 
Latest Vlog : హరిద్వార్‌లోని అతిపవిత్రమైన మా చండి దేవి ఆలయం | Maa Chandi Devi Temple

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. 

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!