Miss World 2025 : హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలకు టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? 

షేర్ చేయండి

Miss World 2025 : 72వ ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ సిద్ధం అవుతోంది. గ్లామర్, కల్చర్‌‌తో పాటు అంతర్జాతీయ ట్యాలెంట్‌కు ఈ పోటీలు వేదిక అవ్వనునాయి. అందుకే ఈ పోటీలను చూసే అవకాశం కోసం చాలా మంది వేచి చూస్తుంటారు. నెక్ట్సస్ మిస్ వరల్డ్ ఎవరనేది తేల్చే ఈ పోటి ఎప్పుడు ? టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందామా ? 

ఎప్పుడు, ఎక్కడా ? | When and Where

అద్భుతమైన చరిత్ర, వారసత్వ సంపదకు నెలవైన హైదరాబాద్‌లో (Hyderabad) ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి పోటీలసు త్వరలో ప్రారంభం అవనున్నాయి. దేశ విదేశాల నుంచి అతిధులు, సుందరీమణులు నగరానికి చేరుకుంటున్నారు.

2025 మే 7 తేదీ నుంచి 31 వ తేదీ వరకు అధికారికంగా ప్రపంచ సుందరి పోటీలు  జరగనున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమం కోసం తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ (Telangana Tourism) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మే 10వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో జరిగే మిస్ వరల్డ్ 2025 ప్రారంభోత్సవాల కోసం వేదిక సిద్ధం అవుతోంది.

హైదరాబాద్ చేరుకున్న మిస్ వరల్డ్ | Krystyna Pyszkova

Miss World 2025
Krystyna Pyszkova ( Photo Source: JacobBhoompag/x)

ఇక నగరానికి చేరుకున్న సుందరాంగులు గురువారం రోజు రిహార్సల్స్‌‌లో పాల్గొన్నారు. అందంగా నడుస్తూ నవ్వుతూ నాట్యం చేస్తూ అలరించారు. ఇక ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకుంది. మొత్తం 120 దేశాల అందాల భామలు ఈ పోటీలో పాల్లోనున్నారు.

ఏటా 10 లక్షల మంది అప్లై…| Miss World 2025

ప్రపంచ సుందరీ పోటీలకు భారత దేశంలో (Miss World In India 2025) మంచి క్రేజ్ ఉంది. ప్రతీ సంవత్సరం 10 లక్షల మంది అమ్మాయిలు ఈ పోటీలో పాల్గొనేందుకు అప్లై చేస్తుంటారు. అందంతో పాటు తెలివితేటలు, వివేకం, జాలి వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని విజేతను ఎంపిక చేస్తారు.

టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి ? | How To Book Tickets

ఇక మిస్ వరల్డ్ పోటీలసు వీక్షించాలి అనుకునే వారు తెలంగాణ టూరిజం శాఖలో నమోదు చేసుకోవచ్చు. అందులో కొంత మందిని సెలక్ట్ చేసి వారికి మాత్రమే ఫ్రీ పాసులు లభిస్తాయి. దీంతో పాటు బుక్ మై షోలో (Book My Show) కూడా టికె్లు బుక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌ను విజిట్ చేయవచ్చు.

వెబ్‌సైట్ : https://tourism.telangana.gov.in/

రిజిస్ట్రేషన్ ప్రక్రియ | Registration Process

Miss World 2025 : ఉచిత పాసుల కోసం ఈ వెబ్‌సైట్‌ను విజిట్ చేసినప్పుడు మిమ్మల్ని 5 ప్రశ్నలు అడుగుతారు. వాటి సమాధానాన్ని బట్టి పాసుల కేటాయింపు ఉంటుంది. ఇప్పటి వరకు 7000 మంది పాసుల కోసం అప్లై చేశారని సమాచారం.

Cover Photo Courtesy : jSuryareddy/x

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!