AI Fashion Feast : దోశ చీర, ఇడ్లీ షర్టు…ఆకలితో ఉంటే ఈ వీడియో అస్సలు చూడకండి

షేర్ చేయండి

దోశతో తయారు చేసిన చీరకు, పాప్‌కార్న్‌తో తయారైన చున్నీ వేసుకున్న అందమైన అమ్మాయిలను చూసి నెటిజెన్లు వామ్మో ఏందిది ఇది నేను సూడలా అని కామెంట్ చేస్తున్నారు (AI Fashion Feast). ఇక ఇడ్లీతో చేసిన షర్టు తమకు వెంటనే కావాలని మరికొంత మంది డిమాండ్ చేస్తున్నారు. 

కాదేది కవితకు అనర్హం అన్నట్టు.. కాదేదీ ఫ్యాషన్‌కు అనర్హం అంటోంది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(Artificial Intelligence). మన ఊహకే అందని ఐడియాలతో ఇప్రెస్ చేస్తోంది ఈ కొత్త సాంకేతికత. అందుకు ఉదాహరణే ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral Video) అవుతున్న ఒక ఏఐ వీడియో.

ఇందులో దోశతో తయారు చేసిన చీరకు, పాప్‌కార్న్‌తో తయారైన చున్నీ వేసుకున్న అందమైన అమ్మాయిలను చూసి నెటిజెన్లు వామ్మో ఏందిది ఇది నేను సూడలా అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఇడ్లీతో చేసిన షర్టు తమకు వెంటనే కావాలని మరికొంత మంది డిమాండ్ చేస్తున్నారు.

రోజంతా తింటూ కూర్చోవచ్చు | AI Fashion Feast

AI Fashion Feast
పానీ పూరి వాచి, శాండ్‌విచ్ ట్రాలీ, ఐస్ క్రీమ్ బ్యాగు… ఇవేం ఐడియాలురా బాబు ( Cover Photo/ This Photo Source: instagram/hoohoocreations80 )

మనం ఇష్టంగా తినే తినుభండారాలు (Food), చిరుతిళ్లను ఇలా కూడా వినియోగించవచ్చని మనం కలలో కూడా ఊహించలేమేమో. ఇలాంటి ఆలోచనతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశాడు హూహైక్రియేషన్స్ 80 (@hoohoocreations80) అనే యూజర్. ఇందులో ఫుడ్ అండ్  ఫ్యాషన్ రెండు కలవడంతో నెటిజెన్లు బాగా ఇంప్రెస్ అవుతున్నారు. అందుకే ఈ వీడియోకు 16 లక్షల లైక్స్ వచ్చాయి. ఇలాంటి డ్రెస్‌లు ఉంటూ రోజంతా తింటూ కూర్చోవచ్చు అని కొంత మంది కామెంట్ చేస్తున్నారు. 

చీర | AI Generated Desi Culture

కరకరలాడే దోశతో (Dosa) చీరను చూసి శారీ డిజైనర్స్ కూడా ఈ ఐడియా మాకెందుకు రాలేదు అని అనుకుంటారేమో. ఇక పానీ పూరి లవర్స్ కోసం చేతికి తొడుక్కునే వాచిని పానీపూరి (Pani Puri) వాచిగా డిజైన్ చేశారు. ఇడ్లీతో షర్టు కూడా డిజైన్ చేయొచ్చని ఎవరూ ఊహించలేరు కదా ? ఎయిర్‌పోర్టులో ట్రాలీ అంత శాండ్‌విచ్ కనిపిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే…

ఇలాంటి ఎన్నో ఐడియాలతో ఈ వీడియో చాలా మందిని ఇంప్రెస్ చేసింది.

నెటిజెన్ల రియాక్షన్ | Netizens Reaction

ఈ వీడియోను చూశాక నెటిజెన్లు సరదాగా రియాక్ట్ అవుతున్నారు. ఇది నిజంగా సాధ్యం అయితే తను రోజంతా తింటూ కూర్చుంటాను అని ఒక యూజర్ స్పందించారు. మరికొంత మంది యూజర్లు ఎలా స్పందించారంటే…

ఇక మరికొంత మంది పూరితో, ఢోక్లాతో కూడా ఇలాంటి వెరైటీ ప్రోడక్ట్స్ తయారు చేయవచ్చు కదా అని సలహా ఇచ్చారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలపండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!