Alcatraz : 1963 లో మూసిన భయంకరమైన జైలును మళ్లీ తెరవమన్న ట్రంప్…

షేర్ చేయండి

Alcatraz : అల్కట్రాజ్ జైలును ఎస్కేప్ ప్రూఫ్…అంటే ఎవరూ తప్పించుకోలేని విధంగా డిజైన్ చేశారు.1933 నుంచి 1963 వరకు తెరచి ఉన్న ఈ జైలు నుంచి 36 మంది మాత్రమే తప్పించుకోవడానికి ప్రయత్నించారట. ఇందులో చాలా మందిని పట్టుకున్నారు, ఆరు మందిని గన్‌తో కాల్చి చంపారట. కానీ ఒక్కరు కూడా తప్పించుకోలేకపోయారట.

అల్కాట్రాజ్ ఐలాండ్‌ను సింపుల్‌గా ది రాక్ (The Rock)అని కూడా పిలుస్తుంటారు. ఈ ద్వీపంపై వచ్చిన సినిమా అది. అమెరికా చరిత్రలోనే అత్యంత అపప్రఖ్యాతిని మూటగట్టుకుని, అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న ప్రదేశం ఇది.

ఈ జైలు నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఇందులో సమాజంలోకి ప్రవేశించే అర్హత లేని వారిని బంధించేవారు. అయితే శిథిలావస్తలోకి మారుతుండటంతో దీనిని 1963లో మూసి వేశారు. పర్యాకుల కోసం మాత్రమే అందుబాటులో ఉంచారు.

ఈ జైలును గత 60 ఏళ్ల నుంచి మూసి ఉన్నా కానీ దీన్ని ఎవరూ మర్చిపోలేకోపోయారు. ఇక దీని పని అయిపోయింది అనుకున్న తరుణంలోనే మళ్లీ ఈ జైలును తెరవాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆదేశించారు. దీంతో మళ్లీ అల్కట్రాజ్ కథ మొదలైంది. 

అల్కట్రాజ్ ఎక్కడ ఉంది ? | Location 

Alcatraz View From San Francisco
శాన్ ఫ్రాన్సిస్కో భూభాగం నుంచి కనిపిస్తున్న అల్కట్రాజ్ చెరశాల

అమెరికాలోనే శాన్‌ఫ్రాన్సిస్కో (San Francisco) నుంచి 1.5 మైళ్ల దూరంలో ఉన్న అల్కట్రాజ్ జైలు అనేది జాతీయ చారిత్రాత్మక ప్రదేశాల్లో ఒకటి. గత 60 ఏళ్లుగా ఇక్కడికి ప్రతీ ఏటా 1.4 మిలియన్ల మంది సందర్శకులు వస్తుంటారు.

అల్కట్రాజ్ అంటే ఏంటి ? | Meaning of Alcatraz

alcatraz jail
దీనికి పెలికాన్ పక్షి లేదా అరుదైన పక్షి అనే పోల్చుతూ అలా పిలుస్తుంటారని అంటారు. 

ఈ ద్వీపం అసలు పేరు లా ఐస్లా డే లోస్ అల్కట్రెసెస్ ( La Isla De Los Alcatraces). దీనికి ఈ పేరును 1775 లో స్పానిష్ అన్వేషకుడు అయిన లెఫ్టనెంట్ జువాన్ మ్యాన్సువల్ డె పెట్టాడు. అల్కట్రాజ్ అసలు అర్థం ఏంటో పూర్తిగా ఎవరికీ తెలియకపోయినా దీనికి పెలికాన్ పక్షి లేదా అరుదైన పక్షి అనే పోల్చుతూ అలా పిలుస్తుంటారని అంటారు. 

 అల్కట్రాజ్ ఎంత పెద్దది ? | How Big Is Alcatraz?

alcatraz jail
పసిఫిక్ కోస్టుకు ఇది తొలి లైట్ హౌజ్‌

తన గురించి ప్రపంచం మొత్తం మాట్లాడేలా చేసుకున్న అల్కట్రాజ్ జైలు కేవలం 22 ఎకరాల్లో విస్తరించిన చిన్న ద్వీపం మాత్రమే. శాన్‌ఫ్రాన్కిస్కో బే మధ్యలో ఉంటుంది ఈ ద్వీపం. 1884 లో ఇక్కడ ఒక మిలటరీ కేంద్రం ఉండేది అని పసిఫిక్ కోస్టుకు ఇది తొలి లైట్ హౌజ్‌గా పని చేసిందట.

అల్ కపోన్ నుంచి ఎంజికే వరకు | Famous Prisoners of Alcatraz

alcatraz jail
అల్కట్రాజ్ జైలు లోపల ఖైదీలు ఉండే ప్రాంతం

1933 లో అల్కట్రాజ్‌ను ఫెడరల్ జైలుగా మార్చారు. ఎట్టిపరిస్థితిలో కూడా సమాజంలోకి తిరిగి ప్రవేశించకూడని నేరస్థులను ఇందులో ఉంచారు.

  • అమెరికన్ మాఫియా డాన్ అయిన అల్ కెపోన్ ( Al Capone)
  • జార్జ్ మెషిన్ గన్ కెల్లి ( George Machine Gun Kelly)
  • అల్కట్రాజ్ బర్డ్‌మాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోబర్ట్ స్ట్రౌడ్ వంటి ఎంతో మంది కరుడుగట్టిన నేరస్థులను ఇందులో ఉంచారు.
  • ఇది కూడా చదవండి : అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన 18 నగరాలు | Dangerous Cities In USA 

ఎవరూ తప్పించుకోలేని జైలు ? | Alcatraz Escape Attempts

alcatraz jail
ప్రతీ ఏడాది 14 లక్షల మంది వరకు సందర్శకులు వస్తుంటారట

అల్కట్రాజ్ జైలును (Alcatraz Prison) ఎస్కేప్ ప్రూఫ్…అంటే ఎవరూ తప్పించుకోలేని విధంగా డిజైన్ చేశారు. 1933 నుంచి 1963 వరకు తెరచి ఉన్న ఈ జైలు నుంచి దాదాపు 30 ఏళ్ల పాటు కేవలం 36 మంది మాత్రమే తప్పించుకోవడానికి ప్రయత్నించారట.

14 సార్లు జరిగిన ఈ ప్రయత్నంలో చాలా మందిని పట్టుకున్నారు, ఆరుగురిని కాల్చి చంపారట. తప్పించుకునే ప్రయత్నంలో నీటిలో దూకిన మరో ఇద్దరు ముగిని చనిపోయారు. ఇందులో ఎవరూ కూడా శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లలేదని అంటారు. అందుకే దీనిని ఎవరూ తప్పించుకోలేని జైలు అని పిలుస్తుంటారు.

అల్కట్రాజ్‌ వరకు ఈత కొట్టి వెళ్లవచ్చా ? | Can You Swim to Alcatraz?

alcatraz jail
కథలు కథలుగా చెప్పనే కథలు…

అల్కట్రాజ్‌ చుట్టూ ఉన్న నీటిలో ఎవరూ బతికి బట్టకట్టలేరు… ఎందుకంటే ఇక్కడ భయంకరమైన, మనుషులను తినే షార్కులు ఉంటాయి.. అని, చాలా మంది అంటుంటారు. కానీ అందులో నిజం లేదు. ఇక్కడ టైగర్ షార్కులు, ఇతర షార్కులు ఉంటాయి కానీ అవి మనుషులపై దాడులు చేసిన ఘటనలు ఎక్కడా రికార్డు అవ్వలేదు.

ప్రతీ సంవత్సరం కొన్ని వేల మంది ఎస్కేప్ ఫ్రమ్ అల్కట్రాజ్ (Escape From Alcatraz) అనే స్విమ్మింగ్ పోటీలో పాల్గొని జైలు ప్రాంతం నుంచి మెయిన్ లాండ్ వద్దకు చేరుకుంటారు. సో, ఆ జైలును మళ్లీ తెరిచి, ఆంక్షలు పెట్టే వరకు ఈత కొట్టడం గురించి మీరు ఆలోచించవచ్చు.

కథనం మిస్టరీ మిథునం

alcatraz jail
అల్కట్రాజ్‌లోపలి భాగం

అల్కట్రాజ్‌ను బద్నాం చేసి పెట్టారు కానీ అది న్యాయాన్ని కాపాడుతూ, నేరస్థులను సమాజం నుంచి దూరంగా ఉంచడంలో అమెరికాకు సాయం చేసిన జైలు. అయితే దీనికి సంబంధించిన కథనాలు, చిత్రాలు, బుక్స్ వల్ల జనాల్లో క్యూరియాసిటీ పెరిగింది. అందుకే  ఈ జైలును మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో అనేది వేచి చూస్తున్నారు చాలా మంది.

నిజంగా తెరిచే అవకాశాలు ఉన్నాయా ?

alcatraz
మళ్లీ కరుడుగట్టిన నేరస్థులకు సింహస్వప్నం అవ్వనుందా?

అయితే 1963 లోనే శిథిలావస్థలో ఉన్న ఈ జైలు ఇప్పుడు ఎలా ఉంటుందో ఊహించవచ్చు. దీనిని మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలి అంటే చాలా డబ్బు అవసరం అవుతుంది. మరి డబ్బు ఆదా చేయడానికి కొత్త మార్గాలు వెతుకుతున్న అమెరికా అల్కట్రాజ్‌ 2.0 ను ఎలా ముందుకు నడిపిస్తుందో చూడాలి మరి!

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!