Waterfalls of Karnataka : ప్రకృతి ప్రేమికులకు నిధిలాంటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. ఇక్కడి పచ్చదనంతో పాటు దట్టమైన అడవుల్లోంచి జరజరా పారుతూ పులకరింపచేసే జలపాతాలు, భౌగోళిక స్వరూపం ఇవన్నీ పర్యాటకులను కట్టిపడేస్తాయి.
ముఖ్యాంశాలు
తెలుగు రాష్ట్రాలకు చేరువైన రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకలో తప్పకుండా సందర్శించాల్సిన 6 జలపాతులు ఏంటో ఈ పోస్టులో మీకోసం అందిస్తున్నాం. ఈ జలపాతాలు ప్రకృతి ప్రేమికులకు మాత్రమే కాదు ఫోటోగ్రఫీ ఇష్టపడేవారికి, సాహసం శ్వాసగా సాగిపోయేవారికి (Adventure Tourism) కూడా బాగా మెప్పిస్తాయి అనేది మా నమ్మకం.
- ఇది కూడా చూడండి : దక్షిణ భారతదేశంలో 8 సూపర్ వాటర్‌ఫాల్స్ | Waterfalls In South India
జోగ్ జలపాతం | Jog Falls

దీనిని గెర్సోప్పా ఫాల్స్ (Gersoppa Falls) అని, నయాగరా ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తుంటారు. కర్ణాటకలోనే మోస్ట్ ఐకానిక్ జలపాతం ఇది. 829 అడుగులు ఎత్తు (253 మీటర్లు) నుంచి జాలువారే ఈ జలపాతం భారత దేశంలోనే అత్యంత ఎత్తైన జలపాతాల్లోనే ఒకటి. ఈ జలపాతాన్ని చూస్తుంటే ఒక మ్యాజిక్‌లా అనిపిస్తుంది.
శివానసముద్ర ఫాల్స్ | Shivanasamudra Falls

కర్ణాటకలో ఉన్న అందమైన జలపాతాల్లో శివానసముద్ర జలపాతం కూడా ఒకటి. ఈ జలపాతం కావేరీ నదిపై (Kaveri River) ఉండగా రెండు పాయలు ఏర్పడి దిగువ ప్రాంతానికి అందంగా జాలువారూ ఉంటాయి. ఈ ధారలను గగనచుక్కి, భారచుక్కి అని పిలుస్తారు. దూరం నుంచి చూస్తే ఫోటోగ్రఫీ కోసం ప్రకృతి ఏర్పాటు చేసిన వాటల్‌ఫాల్ సెట్టింగ్‌లా ఉంటుంది ఇది.
ఆబ్బీ పాల్స్ | Abbey Falls

ప్రముఖ హిల్ స్టేషన్ అయిన కూర్గ్‌కు (Coorg) వెళ్లినవారు తప్పకుండా సందర్శించే ప్రాంతాల్లో అబ్బీ జలపాతం కూడా ఉంటుంది. ఇది కూర్గ్‌లోని కాఫీ తోటల్లో ఉండే ఈ జలపాతాన్ని చూసేందుకు దూరదూరం నుంచి పర్యాటకులు వస్తుంటారు.
- ఇది కూడా చదవండి : Oldest Hill Stations : భారత దేశంలో టాప్ 10 అతిపురాత హిల్ స్టేషన్స్ ఇవే!
కనువిందు చేసే ప్రకృతి రమణీయత, మనసుకు ప్రశాంతతను ఇచ్చే వాతావరణం కోసం చాలా మంది మడికెరి (Madikeri) నుంచి నడక మార్గంలో ఇక్కడికి చేరుకుంటారు.
హెబ్బె జలపాతం | Hebba Falls
కర్ణాటకలోని కెమ్మనగుండి ప్రాంతానికి చేరువలో ఉండే అందమైన జతపాతం ఇది. 551 అడుగుల ఎత్తు (168) నుంచి దొంతరదొంతరుగా జాలువారే ఈ జలపాతాన్ని చూస్తే ఏదో కలల ప్రపంచంలో ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది.
ఇరుపు జలపాతం | Irupu Falls | Waterfalls of Karnataka
కురుచిలోని బ్రహ్మగిరి పర్వశ్రేణుల్లో (Brahmagiri Hills) ఉండే బ్యూటిఫుల్ జలపాతం ఇది. దీనిని లక్ష్మణ తీర్థ జలపాతం (Lakshmana Tirtha Falls) అని కూడా పిలుస్తుంటారు. అడవి మధ్యలోంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ ఈ తీర్థానికి చేరుకోవచ్చు. పైసా వసూల్ డెస్టినేషన్ ఇది.
#Irupu falls pic.twitter.com/kFCxaWLb3l
— संजय (@sanjaytweeted) July 1, 2017
కుంచికల్ జలపాతాలు | Kunchikal Falls
మన దేశంలోనే అత్యంత ఎత్తైన జలపాతాల్లో ఇది కూడా ఒకటి. 455 మీటర్ల ఎత్తు నంచి జాలువారే ఈ జలపాతాలు భారత్‌లోనే కాదు ఆసియాలోనే రెండవ అత్యంత ఎత్తైన జలపాతాల్లో ఒకటి. వారాహి నది (Varahi River) నుంచి జాలువారే ఈ జలధారను చూసేందుకు దూరదూరం నుంచి షిమోగాకు (Shimoga) చేరుకుంటారు.
Magnificent Kunchikal Falls🌹
— M V Rao @ Public Service (@mvraoforindia) July 26, 2020
At Nidagodu village near Masthikatte
in Shimoga District, Karnataka
Total height of fall is 455 meters
These waterfalls are on Varahi river pic.twitter.com/WHEmJPb1DQ
జలజలజారే జలపాతం నుంచి ఆకాశం నుంచి జారిపడే నీటి ధార వరకు కర్ణాటకలో ఎన్నో అందమైన జలపాతాలు Waterfalls Of Karnataka) ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే ఈ పోస్టులో కవర్ చేశాము. ఇవి మీకు బాగా నచ్చాయి ఆశిస్తున్నాము. ఇంతకి మీరు వెళ్లిన జలపాతాల్లో మీకు నచ్చిన జలపాతం ఏంటో కామెంట్ సెక్షన్‌లో తెలపగలరు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.