దీపావళికి ఊరెళ్తున్నారా? ఈ రూల్ తెలియకపోతే జైలే! | south central railway diwali ban
south central railway diwali ban : దక్షిణ మధ్య రైల్వే దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికులకు ముఖ్య విజ్ఞప్తి చేసింది. రైల్వే స్టేషన్లు, రైళ్లలో బాణసంచా, మండే స్వభావం ఉన్న వస్తువులు తీసుకెళ్లవద్దని సూచించింది. పి.ఆర్ నం.537, తేదీ 06 నవంబర్ 2026 ప్రకారం హెచ్చరిక జారీ అయింది.
ఎందుకు ఈ నిషేధం?
పండుగ సమయంలో రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. భారతీయులు అందరూ సొంత ఊర్లకు వెళ్తారు. బాణసంచా వంటి పదార్థాలు ప్రయాణికుల భద్రతకు, రైల్వే ఆస్తికి తీవ్ర ముప్పు కలిగిస్తాయి. చిన్న నిప్పురవ్వ కూడా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. రద్దీగా ఉన్న బోగీలో మంటలు చెలరేగితే తప్పించుకోవడం కష్టం. అందుకే భద్రతా చర్యలు ముమ్మరం చేసినట్లు SCR తెలిపింది.
రైల్లో ఏం తీసుకెళ్లకూడదు?
రైలు ప్రయాణంలో బాణసంచా, పేలుడు పదార్థాలు, మండే ద్రవ పదార్థాలు, ఇతర ప్రమాదకర వస్తువులు తీసుకెళ్లడం పూర్తిగా నిషేధం. ఈ నిబంధన రైళ్లతో పాటు స్టేషన్ ప్రాంగణంలో కూడా వర్తిస్తుంది. తనిఖీలు, నిఘా చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. పార్సిల్ కార్యాలయాల్లో కూడా తనిఖీలు పెంచారు.
- ఇది కూడా చదవండి : Key Monastery Spiti: ఓవర్ టూరిజం కాకముందే చూసేయండి… స్పితీ వ్యాలీ!
పట్టుబడితే ఎంత శిక్ష?
ఈ నిబంధన అతిక్రమిస్తే శిక్ష తప్పదు. రైల్వే చట్టం 1989, సెక్షన్ 164 ప్రకారం ఇది శిక్షార్హమైన నేరం. పట్టుబడితే గరిష్టంగా రూ.1000 జరిమానా విధిస్తారు. లేదా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. లేదా జరిమానా, జైలు శిక్ష రెండూ విధించవచ్చు. ఈ నిబంధన ప్రతి ఏటా దీపావళి, దసరా వంటి పండుగల సమయంలో అమలు చేస్తారు.
అనుమానాస్పద వస్తువు కనిపిస్తే ఏం చేయాలి?
ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని రైల్వే కోరింది. రైళ్లలో లేదా స్టేషన్లలో అనుమానాస్పద వస్తువు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి. సమీపంలోని రైల్వే అధికారికి చెప్పవచ్చు. రైల్వే సెక్యూరిటీ హెల్ప్ లైన్ 139 కు ఫోన్ చేయవచ్చు. రైల్ మదద్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. మీ సమాచారం వందల మంది ప్రాణాలను కాపాడుతుంది.
▶️ వీడియో చూడండి : థాయ్లాండ్ కంప్లీట్ ట్రావెల్ గైడ్
