దక్షిణ మధ్య రైల్వే సేవలు వినియోగించుకునే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మీరు టికెట్ కొనుగోలు చేయడానికి క్యాష్ చెల్లించే అవసరం లేదు. జస్ట్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ( Railway Tickets With QR Code ) సింపుల్‌గా పేమెంట్ పూర్తి చేయవచ్చు. పూర్తి వివరాలు
Table Of Contents
క్యాష్ అవసరం లేదు | Cashless Railway Ticketing SCR
ప్రత్యేకంగా 879 యూటీఎస్ కౌంటర్‌ల్లో పరికరాలను ఏర్పాటు.
దక్షిణ మధ్య రైల్వేలో ( South Central Railaways ) నిత్యం లక్షలాది మంది ప్రయాణం చేస్తుంటారు. టికెట్ బుక్ చేసుకున్న వారు డైరెక్టుగా సీటుపై కూర్చోవడం గురించి ఆలోచిస్తే, టికెట్ బుక్ చేయని వారు మాత్రం కౌంటర్ వద్ద టికెట్లు కొనే పనిలో ఉంటారు. దీని కోసం జేబులోంచి క్యాష్ తీసి పేయాల్సి వచ్చేది. ఇప్పుడు అంతా యూపీఐ పేమెంట్స్ ( UPI Payments ) చేయడానికి అలవాటు పడిపోవడంతో క్యాష్ లేక, లేదంటే టైమ్ లేక చాలా మంది ఇబ్బంది పడిపోతుంటారు.
దీనికి పరిష్కారంగా క్యూార్ కోడ్ విధానాన్ని తీసుకు వచ్చింది దక్షిణ మధ్య రైల్వే. ప్రత్యేకంగా 879 యూటీఎస్ కౌంటర్‌ల్లో పరికరాలను ఏర్పాటు చేసింది.
క్యూార్ కోడ్ పేమెంట్ లాభాలు | Benefits Of QR Code Payment
సౌత్ సెంటర్ రైల్వే పరిధిలోని అన్ని జోన్లలో ఈ జనరల్ బుకింగ్, పీఆర్‌ఎస్ ( రిజర్వేషన్ ) కేంద్రాలలో ఈ పరికరాలను ఏర్పాటు చేశారు.దీని వల్ల ప్రయాణికులు ఇకపై సులభంగా టికెట్లు కొనుగోలు చేయగలరు.
- క్యూార్ కోడ్ పేమెంట్ ( QR Code Payment In SCR ) విధానం వల్ల క్యూలైన్లో నిలబడే ప్రయాణికుల టైమ్ సేవ్ అవుతుంది.
- దీంతో పాటు పేమెంట్ లావాదేవీలలో ఖచ్చితత్వాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది.
- అన్ రిజర్వుడ్ టికెటింగ్ చేసే ప్రయాణికుల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సాహించడానికి ఈ పరికరాలు అమర్చారు.
- దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న టికెట్ కౌంటర్లలో క్విక్ రెస్పాన్స్ కోడ్ ( Quick Response Code Payment SCR ) లేటెస్ట్ వెర్షన్‌తో 879 క్యూార్ పరికరాలు అందుబాటులోకి తెచ్చారు.
- ఈ విధానం అందుబాటులోకి రావడం వల్ల ఇకపై ప్రయాణికుల జేబులో డబ్బు ఉన్నా లేకున్నా ఫోన్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.
- ఇది కూడా చదవండి : ఈట్రైనుకు టికెట్ లేదు, టీసీ లేడు: 75 ఏళ్ల నుంచి ఫ్రీ సేవలు
- జనరల్ బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్లలో కూడా డిజిటల్ పేమెంట్‌ను ప్రోత్సాహించడానికి వీటిని ఏర్పాటు చేశారు.
- దీని వల్ల క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ సంఖ్య పెరుగుతాయి..
- నగదు ఇచ్చి టికెట్ కొనుగోలు చేసే సమయంలో చిల్లర, నోట్లు, నాణేల సమస్య , కొరత ఉండేది. ఈ కొత్త సిస్టమ్ వల్ల ఆ ఇబ్బంది తొలగనుంది.
చెల్లింపు చేసే విధానం | Railway Tickets With QR Code

QR Code Payment Process In SCR Railway Stations : దక్షిణ మధ్య రైల్వే జోన్లలోని స్టేషన్లలో అన్ని టికెటింగ్ కౌంటర్లలో, టికెట్ విండోకు ముందే ఈ పరికరం ఉంటుంది. టికెట్ కొనుగోలు చేయడానికి విండో ముందుకు వెళ్లినప్పుడు సిబ్బంది మీ వివరాలు, ఎన్ని టికెట్లు కావాలో తెలుసుకుని వివరాలు ఎంటర్ చేస్తారు.
- ఇది కూడా చదవండి : ఈ రాష్ట్రంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు..ఏ రాష్ట్రమో తెలుసా?
- మీ ముందు ఒక స్క్రీన్‌లో ఆ వివరాలతో పాటు ఒక క్యూర్ కోడ్ కూడా కనిపిస్తుంది.
- పేరు టికెట్ల సంఖ్య చెక్ చేసుకోండి. అన్నీ సరిగ్గా ఉంటే స్కాన్ చేసి పేమెంట్ పూర్తి చేయవచ్చు.
- దీని కోసం ప్రత్యేకంగా ఎలాంటి యాప్ డౌన్‌లోడ్ చేసే అవసరం లేదు.
- మన మొబైల్లో ఉన్న పేటియం, ఫోన్‌పే లాంటి పేమెంట్ యాప్స్ లేదా మన బ్యాంకు ఆప్ ఇలా మీరు రెగ్యులర్‌గా ఎలా స్కాన్ చేసి చెల్లింపులు చేస్తారో అలాగే చేయవచ్చు.
- మీరు పేమెంట్ చేసిన వెంటనే అది సక్సెస్ అయితే మీ టికెట్ జనరేట్ అవుతుంది.
కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ క్యూార్ కోడ్ ( Railway Tickets With QR Code ) విధానాన్ని ప్రయాణికులు ఉపయోగించుకొని తమ టైమ్ సేవ్ చేసుకోవాల్సింది దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ప్రయాణికులను కోరారు. ట్రైనులో ప్రయాణించే వారందరూ రిజర్వ్ చేసిన టికెట్స్, జనరల్ టికెట్స్ కొనడానికి ఈ సదుపాయాన్ని వినియోగించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.