Indian Railways : రైలులో మందు బాటిల్స్ తీసుకెళ్లవచ్చా ?.. రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయి

Indian Railways : రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. అయితే, ప్రయాణంలో కొన్ని వస్తువులను తీసుకెళ్లడానికి ప్రత్యేక నియమాలు ఉంటాయి. ముఖ్యంగా, రైలులో మద్యం బాటిళ్లు తీసుకెళ్లవచ్చా లేదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఈ విషయంపై స్పష్టమైన సమాచారం లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతుంటారు.

రైలు ప్రయాణంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రైల్వేకు సంబంధించిన రూల్స్ తెలుసుకోవాలి. ఈ వార్తలో రైలులో మద్యం తీసుకెళ్లడానికి సంబంధించి నియమ నిబంధనలు, ఏ రాష్ట్రాల్లో అనుమతి ఉంది, ఏ రాష్ట్రాల్లో నిషేధం ఉంది, అలాగే నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో వివరంగా తెలుసుకుందాం.

రైలులో ప్రయాణించేటప్పుడు మద్యం బాటిళ్లు వెంట తీసుకెళ్లడంపై చాలా మందికి సందేహాలు ఉంటాయి. నిజానికి దీనిపై రైల్వే శాఖ (Railway Department) నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. దీంతో పాటు ఈ విషయంలో రాష్ట్రాల ఎక్సైజ్ చట్టాలు ఇక్కడ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

Indian Railways
బీహార్, గుజరాత్, నాగాలాండ్, మిజోరాం వంటి రాష్ట్రాల్లో మద్యం తీసుకెళ్లడం, విక్రయించడం, సేవించడం పూర్తిగా నిషేధం.

రాష్ట్రాల చట్టాలే కీలకం
కొన్ని వార్తా సంస్థల ప్రకారం…రైలులో మద్యం తీసుకెళ్లడం అనేది మీరు ఏ రాష్ట్రం నుంచి బయలుదేరుతున్నారు, ఏ రాష్ట్రానికి వెళ్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ప్రయాణించేటప్పుడు, ఆ రెండు రాష్ట్రాల మద్యం చట్టాలను పాటించాలి. సాధారణంగా ఒక రాష్ట్రంలో మద్యం చట్టబద్ధంగా ఉండి, మీరు వెళ్తున్న రాష్ట్రంలో కూడా నిషేధం లేకపోతే లిమిటెడ్ సైజులో మద్యం తీసుకెళ్లవచ్చు అని కొన్ని వెబ్‌సైట్స్ ప్రచురించాయి.

ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్ 

ఎంత మద్యం తీసుకెళ్లవచ్చు?

ఆన్‌లైన్లో ఉన్న కొన్ని కథనాల ప్రకారం…
సాధారణంగా ప్రయాణికులు ఒకరు ఒక సీలు వేసిన మద్యం బాటిల్ లేదా రెండు బాటిళ్లు తీసుకెళ్లవచ్చు. దీని పరిమితి 750ఎంఎల్ వరకు ఉండొచ్చు. ఈ బాటిళ్లు సీలు తెరిచి ఉండకూడదు. అలాగే, మీరు మద్యం కొనుగోలు చేసినప్పుడు వచ్చిన బిల్లు మీ దగ్గర ఉంచుకోవడం చాలా ముఖ్యం.

ఇది మిమ్మల్ని ఎలాంటి సమస్యల నుంచైనా కాపాడుతుంది. ఒకవేళ మీరు ఎక్కువ పరిమాణంలో మద్యం తీసుకెళ్లాలనుకుంటే స్పెషల్ పర్మీషన్ లేదా లైసెన్స్ ఉండాలి అని కొన్ని కథనాలు చెబుతున్నాయి.

మద్యం నిషేధం ఉన్న రాష్ట్రాలు
కొన్ని రాష్ట్రాల్లో మద్యం పూర్తిగా నిషేధించబడింది. ఉదాహరణకు, బీహార్, గుజరాత్, నాగాలాండ్, మిజోరాం వంటి రాష్ట్రాల్లో మద్యం తీసుకెళ్లడం, విక్రయించడం, సేవించడం పూర్తిగా నిషేధం.

మీరు ఈ రాష్ట్రాల్లోకి ప్రయాణించేటప్పుడు మద్యం బాటిళ్లు వెంట తీసుకెళ్తే, అది నేరంగా పరిగణించబడుతుంది. పట్టుబడితే భారీ జరిమానాలు లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అందుకే, ఈ రాష్ట్రాలకు వెళ్లే ముందు తప్పకుండా అక్కడి చట్టాలను తెలుసుకోవాలి.

ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు

ఇక రైల్వే చట్టాల ప్రకారం..

ట్రైనులో మద్యం తీసుకెళ్లే విషయంలో ఎన్నో కన్‌‌ఫ్యూజన్లు ఉన్నాయి. అయితే రైల్వే రూల్స్ (Railway Act 1989) ప్రకారం మద్యాన్ని ఏ రూపంలో, ఏ పరిమాణంలో అయినా ట్రైనులో తీసుకెళ్లడం ట్రైనులో మధ్యం సేవించడం అనేది నిషేధం.

రైలులో నిబంధనలకు విరుద్ధంగా మద్యం తీసుకెళ్తే రూ. 5,000 నుంచి రూ. 25,000 వరకు జరిమానా పడొచ్చు. అంతేకాకుండా, రైలులో మద్యం సేవించడం కూడా శిక్షార్హమైన నేరం. ఇలాంటి సందర్భాల్లో కూడా జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

కొన్ని రాష్ట్రాల్లో మూడేళ్ల శిక్ష, రూ.3 లక్షల జరిమానా వరకు పడే అవకాశం ఉంటుంది.

చివరిగా
రైలులో ప్రయాణించే ముందు మీరు బయలుదేరుతున్న రాష్ట్రం, చేరుకునే రాష్ట్రం మద్యం చట్టాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఫైనల్లీ ట్రైనులో మద్యం తీసుకెళ్లకపోవడం ఉత్తమం. అది పరిమితిలో ఉన్నా పరిమితి లేకపోయినా రిస్కు అనవసరం.

రైల్వే చట్టాల గురించి తెలుసుకోవాలంటే రైల్వే యాక్ట్ 1989 చదవండి

 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

Leave a Comment

error: Content is protected !!