బస్సు బ్రేక్ డౌన్ తో మీటింగ్ మిస్.. కన్స్యూమర్ కోర్టులో గెలుపు! | bus breakdown compensation
bus breakdown compensation కేసులో బళ్లారి కమిషన్ సంచలన తీర్పు. బళ్లారి – హైదరాబాద్ బస్సు స్కిప్ చేసి, మోతీ సర్కిల్ వద్ద బ్రేక్ డౌన్ అవ్వడంతో ప్రయాణికుడికి రూ.14,725 పరిహారం చెల్లించాలని Go Tour Travels కు ఆదేశం.
బళ్లారి నుండి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుడికి బస్సు ఆపరేటర్ అన్యాయం చేయడంతో కన్స్యూమర్ కోర్టు షాక్ ఇచ్చింది. టికెట్ ఉన్నా బస్సు ఎక్కనివ్వకపోవడంతో రూ.14,725 పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
అనూదీప్ అనే ప్రయాణికుడు మార్చి 21, 2026న రెడ్ బస్ లో Go Tour Travels బస్సు టికెట్ బుక్ చేశాడు. బళ్లారి నుండి హైదరాబాద్ కు వెళ్లేందుకు టికెట్ ధర రూ.1,725. పికప్ పాయింట్ బళ్లారిలో దుర్గమ్మ గుడి దగ్గర, సమయం రాత్రి 11 గంటలు.
సమయానికి స్టాప్ కు వెళ్లినా సిబ్బంది లేరు. డ్రైవర్ కు, కండక్టర్ కు ఫోన్ చేస్తే సమాధానం లేదు. BUDA కాంప్లెక్స్ దగ్గర ఉన్న ఆఫీసులో అడిగితే వేచి ఉండమని చెప్పారు. బస్సు లేటుగా వచ్చి స్టాప్ లో ఆపకుండా వెళ్లిపోయింది. ప్రయాణికుడు వెంబడించి ఎక్కినా తర్వాత కూడా ఇబ్బందులు తప్పలేదు.
- ఇది కూడా చదవండి : Key Monastery Spiti: ఓవర్ టూరిజం కాకముందే చూసేయండి… స్పితీ వ్యాలీ!
బస్సు దారిలో 3 నుండి 4 సార్లు ఆగింది. చివరికి మోతీ సర్కిల్ వద్ద పూర్తిగా బ్రేక్ డౌన్ అయింది. దీంతో హైదరాబాద్ లో జరగాల్సిన అత్యవసర ఆఫీస్ మీటింగ్ మిస్ అయ్యాడు. రీఫండ్ అడిగితే దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఏప్రిల్ 10, 2026న లీగల్ నోటీసు పంపినా ట్రావెల్స్ స్పందించలేదు. దీంతో బళ్లారి జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించాడు. ట్రావెల్స్ హాజరు కాకపోవడంతో కేసు ఎక్స్ పార్టీగా విచారణ జరిగింది.
అక్టోబర్ 13, 2026న కమిషన్ తీర్పు ఇస్తూ టికెట్ రూ.1,725 రీఫండ్, సేవలో లోపానికి రూ.5,000, మానసిక వేదనకు రూ.5,000, కేసు ఖర్చులకు రూ.3,000 కలిపి మొత్తం రూ.14,725 ను 45 రోజుల్లో చెల్లించాలని, లేకపోతే 6 శాతం వడ్డీతో పాటు Consumer Protection Act 2019 సెక్షన్ 72 కింద చర్యలు ఉంటాయని ఆదేశించింది. సరైన సర్వీస్ ఇవ్వనప్పుడు రీఫండ్ ఇవ్వడం ఏజెన్సీ బాధ్యత అని స్పష్టం చేసింది.
▶️ వీడియో చూడండి : థాయ్లాండ్ కంప్లీట్ ట్రావెల్ గైడ్
