Act Of Kindness : షెడ్యూల్స్ అండ్ డెడ్‌లైన్స్ గొడవలో పడి సాటి మనిషికి సాయం చేయడం గురించి ఆలోచించని జనరేషన్ మనది. ఇలాంటి సమయంలో ఒక చిన్న సాయం కూడా మానవత్వం ఇంకా బతికే ఉంది అనే సందేశాన్ని సమాజానికి అందిస్తాయి. చిన్నదే కానీ చాలా మంచి సందేశాన్ని ఇచ్చే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముఖ్యాంశాలు
ఈ వైరల్ వీడియోలో భారతీయ రైల్వేకు (Indian Railways) చెందిన ఒక లోకో పైలెట్ ఒక వృద్ద జంటను ట్రెయిన్ ఎక్కేందుకు సహకరిస్తాడు. మనం ఎంత బిజీగా సాటి మనిషికి సాయం చేయాలనేది మర్చిపోరాదు అనే సందేశాన్ని ఇస్తోంది ఈ వీడియో.
పెద్దల విఙ్ఞప్తి…పెద్ద మనసుతో అంగీకారం | Act Of Kindness
ఈ వీడియో ఎక్కడిదో, ఎప్పటిదో తెలియదు. రైల్వే ప్లాట్‌ఫామ్ నుంచి ట్రైన్ వెళ్లిపోతుండగా ఒక వృద్ధ జంట అందులో ఎక్కలేకపోయింది. అయితే అదే సమయంలో ఇంజిన్‌లో లోకో పైలెట్ (Loco Pilot) కనిపించడంతో చేతులు జోడించి మేము ఎక్కలేకపోయాం దయచేసి అవకాశం ఇవ్వండి అన్నట్టు అతన్ని రిక్వెస్ట్ చేశాడు పెద్దాయన.
- ఇది కూడా చదవండి : Cautionary Tale : భారత్‌లో ట్రైన్ ప్రయాణం…ఆసుపత్రిపాలైన అమెరికన్ వ్లాగర్
వారి పరిస్థితిని అర్థం చేసుకున్న లోకోపైలెట్ వెంటనే ట్రైన్ వేగం తగ్గించాడు. నిజానికి ఇలాంటి నిర్ణయాలు, లేదా ఇద్దరు ప్యాసెంజర్ల కోసం ట్రైన్ స్లో చేయడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. పెద్దమనసు చేసుకుని వారి కోసం ట్రైన్ ఆపడాన్ని మానవత్వానికి ప్రతీకగా భావిస్తూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు నెటిజెన్లు.
Bro earned my respect ❤️ #Humanity #OperationSindoor#IndiaPakistanWar#IndianArmy#WorldThalassemiaDay #railway #Blast#Subham#russiahonoursbijupatnaik pic.twitter.com/H4HqrAyFpo
— Sonal Chauhan (@itsSonalChauhan) May 8, 2025
అరుదైన విషయం | Indian Railways
నిజానికి భారతీయ రైల్వే తన షెడ్యూల్ విషయంలో ఖచ్చితత్వాన్ని పాటిస్తుంది. దీంతో పాటు ట్రైన్ నడవడం మొదలెట్టాక ప్రయాణికుల కోసం ఇలా ఆపడం అనేది అసాధారణమైన విషయం. లోకోపైలెట్ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే మనిషిగా తన బాధ్యతను కూడా నిర్వహించాడు. అతడిని మనం మనస్పూర్తిగా అభినందించాల్సిందే.
ఇంతకి మీరు ఆ లోకోపైలెట్ అయితే ఏం చేసేవారు ? కామెంట్ చేయండి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.