మహిళల భద్రతలో భారత్ సూపర్.. ఫిదా అయిన జర్మన్ వ్లాగర్! : Women Safety India
women safety india : మహిళల భద్రత విషయంలో జర్మన్ వ్లాగర్ పౌలా భారత్ ను మెచ్చుకుంది. బస్సు, రైళ్లలో మహిళలకు ప్రత్యేక సీట్లు, తక్కువ ధరలో ఇంటర్నెట్, భారతీయుల ఆతిథ్యం గురించి ఆమె చెప్పిన నిజమైన అనుభవం.
విదేశీయుల దృష్టిలో భారత్ ఎలా ఉందో తెలుసా? ఒంటరిగా ఇండియా పర్యటనకు వచ్చిన జర్మనీ ట్రావెల్ వ్లాగర్ పౌలా (german vlogger india) చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత్ లో పర్యటన అంటే చాలా మంది విదేశీయులు భయపడతారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోతుందని పౌలా చెప్పింది. ముఖ్యంగా మన దేశంలోని మూడు విషయాలు ఆమెను బాగా ఆకట్టుకున్నాయి.
మొదటిది మొబైల్ ఇంటర్నెట్. భారత్ లో రోజుకు 4GB డేటా, నెల మొత్తం కేవలం 6 యూరోలకే, అంటే సుమారు 540 రూపాయలకే లభిస్తుందని తెలిసి ఆమె ఆశ్చర్యపోయింది. ఇంత తక్కువ ధరకు ఇంత ఎక్కువ డేటా ప్రపంచంలో మరెక్కడా దొరకదని ఆమె అంది.
- ఇది కూడా చదవండి : Jungfraujoch : యూరప్‌లో హయ్యెస్ట్ రైల్వే స్టేషన్
రెండవది మహిళా భద్రత. బస్సులు, రైళ్లలో మహిళల కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేసిన సీట్లు, స్లీపర్ బెర్త్ లు ఉండటం ఆమెకు చాలా భరోసా ఇచ్చింది. ఈ సదుపాయం వల్ల ఒంటరిగా ప్రయాణించే మహిళలు కూడా ధైర్యంగా, సురక్షితంగా ప్రయాణం చేయవచ్చని ఆమె మెచ్చుకుంది. ఇది చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా లేదని చెప్పింది.
మూడవది భారతీయుల ఆతిథ్యం. స్ట్రీట్ ఫుడ్ తిన్నా, బయట చాయ్ తాగినా ఎలాంటి అనారోగ్య సమస్య రాలేదని, రుచి అద్భుతంగా ఉందని చెప్పింది. దారి తెలియని చోట భారతీయులు చూపించే సహాయం, ఆప్యాయత మాటల్లో చెప్పలేనిదని ఆమె కితాబిచ్చింది.
ఒక విదేశీ ట్రావెలర్ మన దేశాన్ని ఇలా మెచ్చుకోవడం భారతీయులుగా మనందరికీ గర్వకారణం.
▶️ వీడియో చూడండి : థాయ్‌లాండ్ కంప్లీట్ ట్రావెల్ గైడ్
