New Pamban Railway Bridge : భారత ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనం కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి గురించి | 10 ఆసక్తికరమైన విషయాలు బ్రిటిష్ కాలం నాటి తమిళనాడులోని పంబన్ బ్రిడ్జి స్థానంలో భారత ప్రభుత్వం కొత్త బ్రిడ్జిని ( New Pamban Railway Bridge) నిర్మించింది. ఈ కొత్త రైల్వే బ్రిడ్జి అనేది ప్రజా రవాణాకు ఎంత ముఖ్యమైనదో భారత ఇంజినీరింగ్ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడంలో కూడా అంతే కీలకమైనది. ఈ బ్రిడ్జి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు 1. తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జి: పంబన్ బ్రిడ్జి అనేది మన దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జి (Vertical Lift Railway Bridge). ఇది రామేశ్వరం నుంచి భారత భూభాగాన్ని కనెక్ట్ చేస్తుంది. ఈ బ్రిడ్జి కింది నుంచి నావలు వెళ్లేందుకు లిఫ్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీంతో సముద్ర రవాణాకు కూడా మార్గం ఏర్పడుతుంది. 2. చాలా పొడవైనది : ఈ బ్రిడ్జి 2.07 కిమీ పొడవైనది. ఇందులో 99 స్పాన్స్ ఉండగా 18.3 మీటర్ల గ్రైండర్స్ ఈ ఇంజినీరింగ్ అద్భుతానికి ప్రతీకగా నిలుస్తోంది. 3.లిఫ్టు ఎత్తు ఎంత అంటే 3. ఈ బ్రిడ్జిలో ఉన్న లిఫ్టును వినియోగించే సమయంలో అది 72 మీటర్లు అంటే 236 అడుగుల ఎత్తు వరకు పైకి లేగుస్తుంది. సముద్ర రవాణాకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. 4.పాత బ్రిడ్జి కన్నా ఎత్తైనది 4. కొత్త బ్రిడ్జి అనేది పాత బ్రిడ్జి కన్నా 3 మీటర్లు ఎత్తైనది. మొత్తానికి సముద్ర మట్టానికి 22 మీటర్ల ఎత్తులో రైల్వే బ్రిడ్జి నిర్మించారు. 5. 2019లో శంకుస్థాపన 5. ఈ బ్రిడ్జిని 2019 లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు 2020 ఫిబ్రవరిలో ప్రారంభం అయ్యాయి.2024 నవంబర్ నాటికి దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయి. 6.అత్యాధునిక సాంకేతికత 6. ఆధునిక సాంకేతికత: ఈ బ్రిడ్జి నిర్మాణానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగించారు.ఇందులో స్టెయిల్‌లెస్ స్టీల్ రిఎంఫోర్స్‌మెంట్ కంపోసిట్ స్లీపర్స్ వల్ల బ్రిడ్జి ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. 7.రైల్వే ట్రాఫిక్ మేనేజ్మెంట్ : ఈ బ్రిడ్జిలో ఉన్న లిఫ్టు అనేది ట్రైన్ కంట్రోల్ సిస్టమ్‌తో అనుసంధానించబడింది. ఇది ఎలక్ట్రోమెకానికల్‌గా కంట్రోల్ చేయబడుతుంది. సో ట్రైన్లు, షిప్పులు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 8. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా : ప్రస్తుతం ఈ బ్రిడ్జిపై సింగిల్ రైల్వే లైన్ ఏర్పాటు చేశారు. అయితే భవిష్యత్తులో డుబుల్ లైన్ వేయాలనుకుంటే దానికి కూడా వెసులు బాటు కల్పించే విధంగా డిజైన్ చేశారు. 9. రవాణ సదుపాయం : రైల్వే సర్వీసు అందుబాటులోకి రాగానే ఈ కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి అనేది రామేశ్వరం (Rameshwaram) నుంచి ప్రధాన భూభాగానికి మధ్య ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తుంది. 10. చెక్కు చెదరని రంగులు : ఈ బ్రిడ్జి నిర్మాణంలో వాడిన రంగులు 35 ఏళ్ల వరకు చెక్కు చెదరవు. దీనికి తగిన విధంగా మూడు లేయర్ల కలర్ కోటింగ్ వేశారు.