Greece షేర్ చేయండి 1. Santorini Sunset : ప్రపంచంలో ఎన్నో చోట్ల సూర్యోదయాన్ని చూడటానికి చాలా మంది వెళ్తుంటారు. అయితే గ్రీస్‌లోని సాంటోరినికి మాత్రం చాలా మంది సూర్యాస్తమయాన్ని ( Sunset At Santorini ) చూడటానికి వెళ్లుంటారు.సూర్యస్తమ సమయంలో అక్కడి ఆకాశం ఒక పెయింటింగ్‌లా ఉంటుంది.మీక్కూడా అలాగే అనిపిస్తోంది కదా ? Santorini Sunset Plaka, Greece: ఏథెన్స్ (Athens) నగరానికి అతి సమీపంలో ప్లాకా అనే ఏరియా ఉంటుంది. ఇక్కడి అందమైన వీధులు, నివాసాలు, నిర్మాణ శైలి, కేఫేలు ఇవన్నీ మిమ్మిల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తాయి. ఇక్కడికి వెళ్తే మీ ఫ్రెండుకు వీడియో కాల్ చేసి నమస్తే కాకా...ఐయామ్ ఇన్ ప్లాకా అనండి...సరదాగా .. Charming Streets of Plaka Meteora Monasteries : ప్రపంచంలో అందమైన మోనాస్టరీ ( బౌద్ధరామం ) లో మీటియోరా మోనాస్టరీ ఒకటి. ఎత్తైన ఏకశిలా రాయిపై ఉన్న ఈ మోనాస్టరీ దూరం నుంచి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మోనాస్టరీ నుంచి చుట్టు పక్కల ప్రాంతాలు చాలా అందంగా కనిపిస్తాయి. Meteora Monasteries, Kalabaka Greece 2. The Acropolis of Athens : గ్రీకు చరిత్రలో ఏథెన్స్ నగరం అతి కీలకం అని చెప్పవచ్చు. నేటికీ ఈ పురాతన నగరం తాలుకూ గుర్తులను మనం చూడవచ్చు. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిన ఏథెన్స్ నగరాన్ని చూడటానికి వివిధ దేశాల నుంచి వేలాది మంది వెళ్తుంటారు. The Acropolis of Athens Navagio Beach : ప్రపంచంలో వాటర్ స్పోర్ట్స్ ఇష్టపడే వారు ప్లాన్ చేసి మరీ నవాగియో ప్రాంతానికి వెళ్తారు. ఇక్కడి నీరు చాలా స్వచ్ఛంగా బ్లూ కలర్‌లో అలరిస్తుంది. తెల్లని బీచులో పాత షిప్ వద్దకు వెళ్లి చాలా మంది సరదాగా సమయాన్ని సస్పెండ్ చేస్తుంటారు. Crystal Clear Waters of Navagio Beach గ్రీకు ఫుడ్ : గ్రీస్ ప్రజలు మనలాగే భోజన ప్రియులు. అయితే మనలా ఇన్ని వెరైటీస్ ఉంటాయని మాత్రం నేను చెప్పలేను. కానీ మీరు అక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చింగా మూసకా ( Moussaka ) , సోలాకీ ( Souvlaki ) అండ్ గ్రీక్ సలాడ్ ట్రై చేయండి. తాజా పదార్థాలతో చేసే ఇక్కడి ఫుడ్ మీకు తప్పుకుండా నచ్చుతుంది. గ్రీకు బీరు చేతిలో తీసుకుని ( సరదాకి ) అలెగ్జాండర్ గ్రీకు వీరుడు నేను గ్రీకు బీరుడు అని సరదాగా పోస్ట్ పెట్టండి.కామెంట్స్ ఎలా వచ్చాయో ఈ పోస్టులో కామెంట్ చేయండి. Delicious Greek Cuisine Sliced Tomato With Cucumber and Taco షేర్ చేయండి