Handicrafts Exhibition : ట్యాంక్ బండ్ పై అబ్బుర పరుస్తున్న చేతివృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రంలో చేతివృత్తుల వారికి, కుటీర పరిశ్రమలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ చేతివృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల స్టాళ్లను ఏర్పాటు చేశారు.
ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కొనసాగుతుంది.
హైదరాబాద్ నగరం నుంచే కాకుండా , ఇతర జిల్లాల నుంచి కూడా కుటీర పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంటాయి.
ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుంది.
ఈ ఎగ్జిబిషన్‌లో చాలా రకాల బీసీ కుల కళాకారులు చేసిన వస్తువులు ప్రదర్శించబడ్డాయి.
బీసీ సంక్షేమ శాఖ చరిత్రలోనే మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన బీసీ చేతివృత్తుల కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శనను హైదరాబాద్‌లో నిర్వహించడంపై పలువురు ప్రశంసలు కురిపించారు.