Sampoorna Ramayanam: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం…ఆకట్టుకున్న సంపూర్ణ రామాయణం సెట్టింగ్
తిరుపతిలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంపూర్ణ రామాయణం (Sampoorna Ramayanam) సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకట్టకుంటోంది.