Latest | Lord Shiva | Temple | Uttarakhand
Tungnath : ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం.. తుంగ్‌నాథ్ కథ ఇదే!
Tungnath :హిమాలయాల ఒడిలో, మేఘాలకు పైన కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం తుంగ్‌నాథ్ ఆలయం. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో, సముద్ర మట్టానికి 3,680 మీటర్లు (12,073 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా, శివుడికి అంకితమైన అత్యంత ఎత్తైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇది పంచ కేదారాలలో మూడవది, అంటే తృతీయ కేదార్.
