South African Visa : భారతీయులకు ఈజీగా సౌత్ ఆఫ్రికా వీసా
పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశలో సౌత్ ఆఫ్రికా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా వీసా ప్రక్రియతో ( South African Visa ) పాటు , ఎంట్రీ అరేంజ్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మార్పులను భారతీయ పర్యాటకులను ప్రధాన లక్ష్యంగా చేసుకుని చేసినట్టు దక్షిణాఫ్రికా అధికారులు ప్రకటించారు.