లోకోమోటివ్ ఉత్పత్తిలో అమెరికా, యూరోప్‌ను వెనక్కి నెట్టిన భారత్ | Locomotive Production
ఉత్పాదన రంగంలో భారత్ ఒక కీలక (Locomotive Production) మైలురాయిని చేరుకుంది. 2024-25 సంవత్సరంలో ఏకంగా 1,681 రైల్వే లోకోమేటివ్స్ (ట్రైన్ ఇంజిన్లు) తయారు చేసింది. ఈ సంఖ్య అనేది అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్, సౌత్ అమెరికా, ఆఫ్రికా దేశాల ఉత్పత్తిని కలిపితే వచ్చే సంఖ్య కన్నా ఎక్కువ.