సంక్రాంతికి TGSRTC స్పెషల్ బస్సులు | కంప్లీట్ గైడ్ | TGSRTC Sankranti Special Buses 2026

TGSRTC Sankranti Special Buses 2026 : సంక్రాంతికి తెలంగాణ ఆర్టీసి బస్సుల కంప్లీట్ గైడ్, హైదరాబాద్ బోర్డింగ్ పాయింట్స్, టికెట్ ధరలు, మహిళల ఉచిత బస్సు సమాచారం, బుకింగ్ టిప్స్, ట్రావెల్ ప్లానింగ్ ఇవన్నీ ఈ పోస్టులో…

సంక్రాంతి అంటే పండుగ మాత్రమే కాదు… సొంత ఊరికి ప్రయాణం చేసే ఒక అవకాశం కూడా. హైదారాబాద్ నుండి గ్రామాలకు, పట్టణాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లాలి అంటే లాస్ట్ మినిట్ కన్‌ఫ్యూజన్, రష్, టికెట్స్ వంటి సమస్యలు కామన్.

ఈ గైడ్‌ అనేది ఆర్టీసి అధికారుల నుంచి వచ్చిన సమాచారాన్ని అందించడం కోసం మాత్రమే అందించడం లేదు….మీరు ఎప్పుడు వెళ్లాలి ? ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్స్‌ట్రా చార్జీలు ఎందుకు ? మహిళల ఫ్రీ ట్రావెల్ ఎలా వర్క్ అవుతుంది అనే సందేహాలను కూడా తీర్చే గైడ్ కూడా.

Sankranti Travel Rush – ఎప్పుడు ఎక్కువ ఉంటుంది ?

తెలంగాణ ఆర్టీసి ప్రకారం జనవరి 9,10,11,12,13వ తేదీల్లో Outward Journey అంటే హైదరాబాద్ నుంచి గ్రామాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక రిటర్న్ జర్నీలో ఉండే రష్ విషయానికి వస్తే జనవరి 18, 19 తేదీల్లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. 

అందుకే మీరు కుటుంబంతో కలిసి ప్రయాణిస్తే:

  • జనవరి 9 కి బదులు జనవరి 8వ తేది రాత్రికి, లేదా జవనరి 11వ తేది ఉదయం ట్రావెల్ చేయడం ఉత్తమం.
  • రిటర్న్ జర్నీలో జనవరి 17న ట్రై చేస్తే క్రౌడ్ కాస్త తక్కువగా ఉంటుంది.

ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్యాాటర్న్. వచ్చే ఏడాది కూడా ఇలాగే ఉంటుంది.

హైదరాబాద్‌లో స్పెషల్ బస్సులు ఎక్కడ స్టార్ట్ అవుతాయి ?

సంక్రాంతి సమయంలో తెలంగాణ ఆర్టీసి సిటీ బస్డాండ్‌పై డిపెండ్ కాకుండా డైరక్ట్ బోర్డింగ్ పాయింట్స్ నుంచి స్పెషల్ బస్సులునడుపుతోంది. 

ఇందులో పాయింట్స్ :

  • ఎంజిబీఎస్
  • జేజీఎస్ (సికింద్రాబాద్)
  • ఉప్పల్ క్రాస్ రోడ్స్
  • ఎల్బీ నగర్ క్రాస్ రోడ్
  • ఆరాంఘర్
  • కేపీహెచ్‌బీ
  • బోయిన్‌పల్లి
  • గచ్చిబౌలి

ఈ బోర్డింగ్ పాయింట్స్‌కు వచ్చే ప్రయాణికుల కోసం తాత్కాలిక టెంటులు, సీటింగ్ కోసం కుర్చీలు, మంచినీరు, మొబైల్ టాయిలెట్స్, పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. మహిళలు , పిల్లలకు ఇవి బాగా ఉపయోగపడతాయి.

స్పెషల్ బస్సుల సంఖ్య, ఎవైలబిలిటీ | Special Buses Count & Availability

TGSRTC Sankranti Special Busses Travel Guide 2026
TGSRTC Sankranti Special Busses Travel Guide 2026

ఈ సంక్రాంతికి మొత్తం 6,400 కన్నా ఎక్కువ బస్సులను ప్లాన్ చేశారు. ప్రయాణికులు రద్దీని ఎక్కువగా ఉంటే ఆన్ ది స్పాట్ అడిషనల్ బస్సులను కూడా జోడిస్తారు.

ఇంపార్టెంట్ విషయం ఏంటంటే…అంటే చివరి నిమిషంలో క్రౌడ్ ఉన్న దారిలోకి ఎక్కువ బస్సులు వస్తాయి.రిటర్న్ జర్నీలో బస్సులు ఖాళీ ఉండకుండా డిమాండ్ ఉన్న రూట్స్‌లోకి వెంటనే డైవర్ట్ చేస్తారు.

టికెట్ చార్జీలు | Ticket Charges | TGSRTC Sankranti Special Buses 2026

అసలు 1.5 ఫేర్ అంటే ఏంటి ? 

ఈ సమయంలో ప్రయాణికులకు ఇలాంటి ఎన్నో డౌట్స్ వస్తాయి. అసలు 1.5 ఫేర్ అంటే కేవలం స్పెషల్ బస్సుల్లో.. అది కూడా జనవరి 9,10,12,13 తో పాటు జనవరి 18,19 తేదీల్లో మ్యాగ్జిమం 1.5 టైమ్స్ ఫేర్ / చార్జీలు అప్లై అవుతుంది. 

రెగ్యులర్ బస్సుల్లో ఈ అదనపు చార్జీలు అప్లై కావు. నార్మల్ చార్జీలే ఉంటాయి. ఇది ఈ రోజు వచ్చిన రూల్ కాదు 2003 లో ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.16 ప్రకారం అమలు అవుతున్నాయి. సో ఇది తెలుసుకుని షాక్ అవ్వకండి. ప్లాన్ చేసుకోండి.

సంక్రాంతి సమయంలో Women Free Travel ఉంటుందా ?

ఉంటుంది.

మహా లక్ష్మి పథకం అనేది సంక్రాంతి సమయంలో కూడా అప్లై అవుతుంది. మహిళలకు ఫ్రీ ట్రావెల్ అప్లికేబుల్ అయ్యే బస్సులు వచ్చేసి :

  • పల్లె వెలుగు
  • ఎక్స్‌ప్రెస్
  • సిటీ ఆర్డినరీ
  • మెట్రో ఎక్స్‌ప్రెస్

స్పెషల్ బస్సుల్లో మహిళలకు ఫ్రీ ట్రావెల్ అప్లై కాదు. రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ / పల్లెవెలుగు బసెస్ ఎంచుకుంటే కాస్ట్ సేవ్ అవుతుంది.

Ticket Booking | సేఫ్‌గా ఎలా ప్లాన్ చేయాలి ?

సంక్రాంతి సమయంలో రష్ గురించి మీకు బాగా తెలుసే ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే సగం టెన్షన్ తగ్గుతుంది. వెళ్లేదే కాదు రిటర్న్ జర్నీ టికెట్ అడ్వాన్స్ బుక్ చేసుకోండి. దీని కోసం మీరు తెలంగాణ ఆర్టీసి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. 

ఆ వెబ్‌సైట్ వచ్చేసి : www.tgsrtcbus.in

హెల్ప్ లైన్ నెంబర్స్

  • 040-69440000
  • 040-23450033

బుకింగ్ కోసం చిట్కాలు | Prayanikudu Travel Tip

పండగ పీక్స్‌ తేదీల్లో కాకుండా 3 నుంచి 5 రోజుల ముందు బుక్ చేయండి.

  • బోర్డింగ్ పాయింట్ కేర్‌ఫుల్లీ సెలెక్ట్ చేయండి. (MGBS vs City Pickup)
  • SMS / టికెట్స్ స్క్రీన్ షాట్ బ్యాకప్ పెట్టుకోండి.

Note : సంక్రాంతి బస్ ట్రావెల్ ప్యాటర్న్ ప్రతీ సంవత్సరం ఒకేరకంగా ఉంటుంది. తేదీలు మారినా, ప్లానింగ్ లాజింగ్ సేమ్‌గా ఉంటుంది.

“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

Leave a Comment

error: Content is protected !!