TGSRTC: విజయవాడ వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసి స్పెషల్ డిస్కౌంట్

షేర్ చేయండి

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలని ప్లాన్  చేస్తున్నారా ? అయిటే టికెట్ బుక్ చేసుకోవడానికి ఇదే పర్ఫెక్ట్ టైమ్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC ) ప్రయాణికులకు ప్రత్యేక రాయితీని ప్రకటించింది. దీని వల్ల మీరు అతి తక్కువ ధరకే ప్రశాంతంగా మీ గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

తరచూ ప్రయాణాలు చేసే ట్రావెలర్స్‌కు (Travelers),  కుటుంబ సమేతంగా బడ్జెట్‌లో ప్రయాణించాలి అనుకుంటున్న వారికి ఇది అద్భుతమైన వార్త అని చెప్పవచ్చు. మరి ఈ టికెట్‌పై వచ్చే రాయితీ ఎంత? ఏఏ బస్సుల్లో రాయితీ ఉంటుందో తెలుసుకుందాం. 

ఈ డిస్కౌంట్‌ను వివరాలు : TGSRTC Discount Vijayawada Bus

  • లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ అండ్ సూపర్ డీలక్స్ బస్సుల్లో మీకు స్ట్రెయిట్‌గా 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. అందుబాటు ధరలో మంచి ప్రయాణ అనుభవం సొంత చేసుకోవాలి అనుకుంటే ఇది (Lahari-Non AC ) మంచి ఛాయిస్ అవుతుంది.
  • రాజధాని ఏసీ బస్సు | Rajdhani AC Busses:  ఎయిర్ కండిషన్ బస్సులో ప్రయాణిస్తూ 8 శాతం రాయితీని మీరు పొందవచ్చు. డబ్బులు  ప్రశాంతంగా, ఏసీలో ప్రయాణించాలి అనుకుంటే ఇది మంచి ఛాయిస్ అవుతుంది. ఎండాకాలం దాదాపు వచ్చేసింది కాబట్టి టికెట్లు ముందే బుక్ చేసుకోండి.
  • Read Also : బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసి గుడ్ న్యూస్

తెలంగాణ ఆర్టీసి బస్సే ఎందుకు ? | Why Choose TGSRTC?

ప్రస్తుతం అందిస్తున్న డిస్కౌంట్లతో పాటు తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే !

  • విశ్వసనీయత : ఆర్టీసీ బస్సు అంటే ఖచ్చితత్వానికి, సరైన నిర్వహణకు పెట్టింది పేరు. ప్రశాంతమైన ప్రయాణానికి ఆర్టీసీని మించిన ఛాయిస్ లేదు.
  • సౌలభ్యం :  మారుమూల గ్రామాలను కూడా చేరగలిగే ఆర్టీసీ ఎంతో మంది ప్రయాణికులను తమ గమ్యస్థానానికి చేర్చుతోంది.
  • భద్రత : తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ బస్సులు భద్రతకు మారు పేరుగా చెప్పవచ్చు.ఇందులో డ్రైవర్లకు చక్కని శిక్షణ  ఇచ్చిన తరువాతే డ్రైవింగ్ చేసే అనుమతి ఇస్తారు. వేగం కన్నా సేఫ్టీకే ప్రాధాన్యత ఇస్తుంది ఆర్టీసి.
  • అందుబాటులో ధర : ఈ పోటీ ప్రపంచంలోన అన్ని సేవలు ధరలు పెరుగుతూ, ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. కానీ ఆర్టీసి మాత్రం రీజనబుల్ ధరలతో ప్రయాణికులను తమ గమ్యస్థానానికి చేర్చుతోంది. 

టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి ? | TGSRTC Bus Ticket Booking

TGSRTC
PC: web/tgsrtc

తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ ప్రకటించిన అద్భుతమైన రాయితీని మీరు మిస్ చేసుకోరాదు అనుకుంటే వెంటనే టికెట్లు బుక్ చేసుకోండి. దీని కోసం మీరు ఆర్టీసి అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయాల్సి ఉంటుంది.

ఆ వెబ్‌సైట్ వచ్చేసి : 

https://www.tgsrtcbus.in/ లేదా www.tgsrtcbus.in/ లేదా tgsrtcbus.in/

ఇందులో ఏ లింక్ పై క్లిక్ చేసినా మీకు అఫిషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. మీ ప్రయాణ వివరాలు ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోండి.

టికెట్ బుకింగ్ టిప్స్ | Tips for a Smooth Booking

  • అడ్వాన్స్ బుకింగ్ :  మీ ప్రయాణం ఎప్పుడో అని తెలిసిన వెంటనే టికెట్లు బుక్ చేసుకోండి. అడ్వాన్స్ బుకింగ్ వల్ల చివరి నిమిషం హడావిడి ఉండదు.
  • ఆఫర్ల కోసం చూడండి : ఆర్టీసి సంస్థ వెబ్‌సైట్ లేదా సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేస్తూ ఉండండి. ఆఫర్లు ఎప్పుడు వస్తాయో చెప్పలేము కదా.
  • బస్సు సెలక్షన్ :  మీ ప్రయాణంలో సౌకర్యం, బడ్జెట్, సమాయాన్ని బట్టి బస్ సర్వీసును బుక్ చేసుకోండి.

సో, ఇంకెందుకు ఆలస్యం విజయవాడ వెళ్లాలి (Hyderabad To Vijayawada) అనుకుంటే మాత్రం కోరి వచ్చిన డిస్కౌంట్‌ను ఎందుకు కాదనడం. మీలోని ప్రయాణికుడిని తట్టి లేపండి !వెంటనే తెలంగాణ ఆర్టీసీ డిస్కౌంట్‌ను ఎంజాయ్ చేయండి. 

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!