తెలంగాణ వైభవాన్ని ఆకాశంలో చాటించే పతంగుల పండుగ | Kite Festival Showcasing Telangana’s Grandeur

Kite Festival : సంక్రాంతి అంటేనే ఊర్లో గాలిపటాలు, పండుగ సందడి.
ఈసారి అదే ఫీలింగ్‌ని హైదరాబాద్ ఆకాశంలో పెద్ద స్థాయిలో చూపించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

తెలంగాణ కల్చర్, ట్రెడిషన్‌కు ఆధునిక ఆలోచనలు తోడై, ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌లో కైట్ ఫెస్టివల్ సహా పలు టూరిజం ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు తెలిపారు.

Kite Festival Showcasing Telangana’s Grandeur
Kite Festival Showcasing Telangana’s Grandeur

డా. బీఆర్. అంబేడ్కర్ సచివాలయంలో జరిగిన సమావేశంలో, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండి క్రాంతి వల్లూరి, నిథమ్ డైరెక్టర్ వెంకటరమణ, ఇతర అధికారులు కలిసి ఈ వేడుకల వివరాలను వెల్లడించారు.

International Kite & Sweet Festival – అసలు హైలైట్ ఇదే 

తేదీలు: 2026 జనవరి 13 నుంచి 15 వరకు
వేదిక: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్

Hyderabad International Kite Festival
2025 లో జరిగిన కైట్ ఫెస్టివల్ (File Photo)

ఈ వేడుకను “Celebrate the Sky” అనే థీమ్‌తో నిర్వహించనున్నారు.
పరేడ్ గ్రౌండ్ మొత్తం ఈ మూడు రోజులు పండుగ మూడ్‌లో ఉండబోతోంది.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే
19 దేశాల నుంచి 40 అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్,
భారతదేశంలోని 15 రాష్ట్రాల నుంచి 55 మంది కైట్ ఫ్లయర్స్ వచ్చి పాల్గొంటారు.

అంటే… మన గాలిపటాల మధ్యలో ప్రపంచం కూడా ఉంటుంది.

Sweet Festival కూడా అదే గ్రౌండ్‌లోనే

కైట్ ఫెస్టివల్‌తో పాటు Sweet Festival కూడా జరుగుతుంది.
ఇది నిజంగా ఫుడ్ లవర్స్‌కి పండుగే.

  • 1,200కి పైగా స్వీట్స్
  • తెలంగాణ సంప్రదాయ పిండి వంటలు
  • దాదాపు 60 స్వీట్ స్టాల్స్
  • 100 హ్యాండ్లూమ్స్ & హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్

ఇవన్నీ చూస్తుంటే… కైట్ ఎగరేయాలా, తినాలా అన్న డౌట్ వస్తుంది.

తెలంగాణ జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి.
ఇంకో మంచి విషయం ఏంటంటే, ఎంట్రీ పూర్తిగా ఫ్రీ.

హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ | Hot Air Balloon Festival 

(ఇది చూసాక ఫోటోలు తప్పనిసరి)

hot air balloon ride in manali
hot air balloon ride in manali…జస్ట్ ఐడియా కోసం షేర్ చేశాను

కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయిపోయిన వెంటనే,
జనవరి 16 నుంచి 18 వరకు, హైదరాబాద్ ఔట్‌స్కర్ట్స్‌లో హాట్ ఎయిర్ బెలూన్లు కనిపించబోతున్నాయి.

ఉదయం పూట ఓపెన్ ఏరియాల్లో డిస్‌ప్లే ఉంటుంది.
సాయంత్రం అయితే… పరేడ్ గ్రౌండ్స్‌లో Night Glow Balloon Show.

బెలూన్‌లో ఎక్కి ఆ అనుభవం తీసుకోవాలంటే
BookMyShow లాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ముందుగానే బుక్ చేసుకోవాలి.

  • తెలంగాణలో సందర్శనీయ స్థలాలు ఏవో జిల్లవారిగా తెలుసుకోవడానికి క్లిక్ చేయండి.

Mega Drone Show – హైదరాబాద్ ఆకాశంలో టెక్ ఫెస్టివల్ 

జనవరి 16, 17 తేదీల్లో
గచ్చిబౌలి స్టేడియం వేదికగా మెగా డ్రోన్ షో ఉంటుంది.

ఇది సాదా డ్రోన్ షో కాదు.
లేటెస్ట్ టెక్నాలజీతో చేసే విజువల్ ట్రీట్.

ఇక్కడ చూడబోయేవి:

  • LED డ్రోన్ రేస్
  • FPV (First Person View) లైవ్ ఫీడ్స్
  • ఆకాశంలో Drone Soccer
  • తెలంగాణ టూరిజం డెస్టినేషన్స్ విజువల్ షోకేస్

నిజం చెప్పాలంటే… ఇది చూసాక
“ఇది హైదరాబాద్‌లోనే జరుగుతుందా?” అనిపించే ఛాన్స్ ఉంది.

కొత్త కళను సంతరించుకున్న చెరువుల దగ్గర కూడా Kite Festival

Hyderabad International Kite Festival
కైట్ ఫెస్టివల్‌లో కల్చరల్ ప్రోగ్రామ్ (file Photo)

HYDRA చర్యలతో పునరుజ్జీవం పొందిన కొన్ని చెరువుల దగ్గర కూడా కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.

  • బాగ్ అంబర్‌పేట్ – బతుకమ్మ కుంట
  • కూకట్‌పల్లి – నల్ల చెరువు
  • మాధాపూర్ – తమ్మిడి కుంట
  • రాజేంద్రనగర్ – Bum Rukn-ud-Daula చెరువు
    (National Police Academy దగ్గర)

ఇది మంచి ఐడియా. పండుగ + పబ్లిక్ స్పేస్ = మంచి వాతావరణం.

ఎందుకు ఇప్పుడు అందరూ Telangana Tourism గురించి మాట్లాడుకుంటున్నారు?

Hyderabad International Kite Festival
ఈ ఫెస్టివల్‌లను పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు (File Photo 2025 kite Fesival)

మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పినట్టు, తెలంగాణ టూరిజం ఇప్పుడు investment-friendly destinationగా మారుతోంది.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్త టూరిజం పాలసీ ద్వారా

  • ఇప్పటివరకు ₹22,324 కోట్ల పెట్టుబడులు
  • దాదాపు 90,000 ఉద్యోగాల లక్ష్యం

మిస్ వరల్డ్ ఈవెంట్స్, ఫ్లోరల్ ఫెస్టివల్ లాంటి కార్యక్రమాల వల్ల తెలంగాణ పేరు ఇప్పుడు గ్లోబల్ టూరిజం మ్యాప్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

సందర్శకుల కోసం కొన్ని ఉపయోగకరమైన విషయాలు 

టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండి క్రాంతి వల్లూరి తెలిపిన వివరాలు:

  • పరేడ్ గ్రౌండ్స్‌కు ప్రత్యేక పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్
  • Uber, Rapido వాడేవారికి ప్రత్యేక ఆఫర్లు
  • చైనీస్ మాంజా పూర్తిగా ఎవాయిడ్ చేయండి.
  • కేవలం కాటన్ మాంజాలు మాత్రమే ఉపయోగించాలి

ఇది భద్రత కోసమే. మనందరి బాధ్యత కూడా.

ప్రయాణికుడు టేక్ 

(ఇది పూర్తిగా నా అనుభవం)

2025 లో పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన Kite & Sweet Festival‌కి నేను వెళ్లాను.
అంత పెద్ద గ్రౌండ్‌లో క్రికెట్ ఆడటం చూసుంటాం. కానీ అదే గ్రౌండ్‌లో పెద్ద పెద్ద గాలిపటాలు, బెలూన్లు చూసాక… కాసేపు నిజంగానే చిన్నపిల్లాడిలా అనిపించింది.

గ్రౌండ్ మొత్తం తిరుగుతూ అలసిపోయాక, పెద్ద స్టేజ్ దగ్గర కూర్చుని తెలంగాణ జానపద సంగీతం విన్నాను.
పిల్లలు, పెద్దలు అందరూ తమకు నచ్చిన గాలిపటాలు ఎగురవేస్తూ, నచ్చినవి తింటూ బిజీగా ఉన్నారు.

నేను మధ్యాహ్నం వెళ్లాను కాబట్టి కాస్త ఎండగా అనిపించింది.
👉 మీరు మాత్రం మార్నింగ్ ఎర్లీగా వెళ్లేలా ప్లాన్ చేయండి.

ఫ్యామిలీతో వెళ్లొచ్చా? | Can We Go To Kite Festival With Family

Hyderabad International Kite Festival
వంద పదాలు కాాదు..ఒక్క ఫోటో చాలు..(2025 kite Festival file Photo)

సింపుల్‌గా చెప్పాలంటే – అవును.వెళ్లొచ్చు

నా గత అనుభవం ఆధారంగా:

  • మంచి పోలీస్ బందోబస్తు ఉంటుంది
  • ప్రతి విజిటర్‌కి సెక్యూరిటీ చెక్
  • మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి
  • నీళ్లు, లైట్ స్నాక్స్, సన్‌గ్లాసెస్ తీసుకెళ్లండి
  • పిల్లలను కాస్త జాగ్రత్తగా చూసుకోండి
  • 2–3 గంటలు ఈజీగా గడిపేయొచ్చు
  • బయట పార్కింగ్ ఉంటుంది. కార్లు అవాయిడ్ చేస్తే బెటర్

ఈ బులెట్ పాయింట్స్ రాస్తుంటేనే… మళ్లీ అక్కడికి వెళ్లిన ఫీలింగ్ వస్తోంది.
ఈసారి కూడా వెళ్తాను. వీలైతే కలుద్దాం.

“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

Leave a Comment

error: Content is protected !!