Kumbh Mela 2025 : సికింద్రాబాద్ నుంచి మహాకుంభ పుణ్య క్షేత్ర యాత్ర ట్రైన్…టికెట్, సదుపాయాల వివరాలు ఇవే
2025 లో జరగనున్న కుంభమేళకు ( Kumbh Mela 2025) వెళ్లాలని భావిస్తున్న తెలుగు వారికి ఐఆర్సీటీసీ ఒక గుడ్ న్యూస్ తెలిపింది. మహా కుంభ పుణ్య క్షేత్ర యాత్ర పేరుతో ప్రత్యేక రైలు ప్రకటించింది. ఈ ట్రైన్ రాకతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి యాత్రికులకు అందుబాటులో ఉండనున్న భారత్ గౌరవ్ పర్యాటక రైళ్ల ( Bharat Gaurav Trains) సంఖ్య కూడా పెరిగింది.