–40°C నుంచి –60°C చలిలో జీవితం.. డీప్ ఫ్రిడ్జిలా నగరం : Yakutsk
Yakutsk : మనిషి సంకల్పానికి ప్రకృతి పరీక్ష పెట్టే ప్రాంతం అది. మన ఇంట్లో ఉన్న డీప్ ఫ్రిడ్జ్ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ చలి ఉండే ఒక మంచు ప్రపంచం. అలాంటి ప్రదేశంలో కూడా మనుషులు సంతోషంగా జీవిస్తున్నారు.
రష్యాలోని యాకుట్స్ (Yakutsk) మామూలుగానే ఒక మంచు నగరం. చలికాలంలో అక్కడ మైనస్ 40 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండటం సాధారణమే. ప్రపంచంలోనే Coldest Inhabited Cities (మానవ నివాసాలు ఉన్న అత్యంత చల్లని నగరాలు)లో ఒకటైన యాకుట్స్లో, శబ్దం కన్నా నిశ్శబ్దమే ఎక్కువగా వినిపిస్తుంది.
మంచును కూడా మింగేసేంత చలి ఉండే ఈ నగరం నిత్యం ఒక మంచు దుప్పటిలో కప్పబడి ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ శ్వాస తీసుకుని వదిలితే అది క్షణాల్లోనే పొగమంచుగా మారిపోతుంది. కంటిపాపలపై కూడా మంచు పేరుకుపోవడం సాధారణమే.
- ఇది కూడా చదవండి : Oymyakon : -70 c ..ప్రపంచంలోనే అత్యంత చల్లని గ్రామం
ముఖ్యాంశాలు
రాళ్లు లేని ఇల్లు | Houses in Yakutsk
ఇక్కడ ఇళ్లను ఎక్కువగా కలపతో నిర్మిస్తారు. కారణం భూమి మొత్తం పెర్మాఫ్రాస్ట్‌తో (Permafrost) ఉండటం. ఇలాంటి అత్యంత చల్లని ప్రదేశంలో నివసించేందుకు ప్రతి ఇంట్లో రూమ్ హీటర్లు, మందపాటి చలిదుస్తులు, ప్రత్యేక ఏర్పాట్లు తప్పనిసరిగా ఉంటాయి.
- ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, ఆహార పదార్థాలను ప్రత్యేకంగా ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం పెద్దగా ఉండదు.
- ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్ కన్నా ఎక్కువ చలి బయటే ఉన్నప్పుడు, అదనపు ఫ్రిడ్జ్ అవసరం లేకుండానే వస్తువులు సురక్షితంగా ఉంటాయి.
యాకుట్స్లో పగటి సమయం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే నగరం మొత్తం మెల్లగా, నెమ్మదిగా కదులుతుంది. నిలబడితే నిలబడిన చోటే మనిషి గడ్డకట్టిపోతాడేమో అన్నంత తీవ్రంగా ఉంటుంది అక్కడి చలి.
- ఇది కూడా చదవండి : అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
చలిదుస్తులే చర్మం | Life in Yakutsk
యాకుట్స్ లాంటి అత్యంత చల్లని ప్రదేశంలో మనిషి చర్మం కనిపించడం చాలా అరుదు. అంత చలిని తట్టుకోవాలంటే నాలుగు నుంచి ఐదు లేయర్ల దుస్తులు ధరించాల్సిందే. ముక్కు, చెవులు, నోరు, శరీరం మొత్తం కవర్ చేసుకుని, కళ్లను మాత్రమే బయట ఉంచుతారు. లేదంటే చలి తీవ్రంగా ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది.
Just another day in one of the coldest places on Earth. Yakutsk at −50°C.
— Massimo (@Rainmaker1973) December 17, 2025
[📹 evelinasuperflower]pic.twitter.com/Tbv5Jey1cW
ఇంజిన్ ఆయిల్‌కూ మంచులే
తీవ్రమైన చలికాలంలో ఇక్కడ కార్లను ఎక్కువసేపు ఆపకుండా ఉంచడం సాధారణం. ఒక్కసారి ఇంజిన్ ఆగిపోయితే మళ్లీ స్టార్ట్ అవ్వడం కష్టమవుతుంది. అందుకే కార్ల కోసం వేడి అందించే ప్రత్యేక గ్యారేజీలు ఉన్నాయి.
అలాంటి గ్యారేజీలు అందుబాటులో లేని వారు ‘నటాషా’ (Natasha Car Cover) అనే ప్రత్యేక వెచ్చని కవర్‌ను కారుపై కప్పుతారు. అంటే కారుకే దుప్పటి కప్పినట్టే.
యాకుట్స్లో పొగమంచు చాలా దట్టంగా ఉంటుంది. కొన్ని రోజుల్లో ఐదు మీటర్ల దూరం తర్వాత ఏమి కనిపించదు. అందుకే రోడ్డు దాటే సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే, రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ కనిపించడం కూడా కష్టమే.
- ఇది కూడా చదవండి : మనాలిలో చేయాల్సిన 30 పనులు | 30 Activities in Manali | With Photos
వ్లాగింగ్ కష్టం
యాకుట్స్, ఓమ్యాకాన్ లాంటి అత్యంత చల్లని ప్రాంతాల్లో మొబైల్ లేదా కెమెరాతో వీడియోలు తీయడం చాలా కష్టం. చిత్రీకరణ కోసం చేతులను బయటకు తీయాల్సి ఉంటుంది. వేడి నీటిని గాలిలో విసిరితే అది క్షణాల్లోనే మంచుగా మారి కింద పడిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో చేతులు బయట పెట్టడం ఎంత కష్టమో ఊహించవచ్చు.

- స్థానిక సఖా (Yakut) సంస్కృతిలో గుర్రం మాంసం ఒక సంప్రదాయ ఆహారం.
- యాకుట్స్ నగరంలో సుమారు 3,50,000 మంది ప్రజలు నివసిస్తున్నారు.
- జనవరి నెలలో యాకుటియా ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 60 డిగ్రీల కంటే కూడా దిగజారిన సందర్భాలు ఉన్నాయి.
- అంత చలిలో కూడా కొంతమంది ఐస్ బాత్‌లు (మంచు నీటిలో స్నానం) చేస్తుంటారు.
- ఇది కూడా చదవండి : కోహీర్: తెలంగాణలో చాలా మందికి తెలియని చలి ప్రదేశం | Kohir coldest place in Telangana
ఎలా వెళ్లాలి? | How To Reach Yakutsk
యాకుట్స్ ప్రపంచంలోనే అత్యంత చల్లని మానవ నివాస ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడికి వెళ్లాలంటే కేవలం డబ్బు మాత్రమే సరిపోదు. అలాంటి వాతావరణాన్ని తట్టుకునే ఆసక్తి, ఆరోగ్యం కూడా చాలా అవసరం.
యాకుట్స్కు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. ముందుగా ఢిల్లీ, యూరప్ లేదా మధ్యప్రాచ్య మార్గాల ద్వారా రష్యాలోని మాస్కో చేరుకోవాలి. అక్కడి నుంచి యాకుట్స్కు విమానం ఎక్కవచ్చు.
టికెట్ ధరలు సీజన్‌ను బట్టి మారుతుంటాయి. రానూ–పోనూ కలిపి సుమారు రూ. 5 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది.
- ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts
బయట సేఫ్ కాదు
యాకుట్స్లో బయట ఎక్కువసేపు ఉండటం సురక్షితం కాదు. అందుకే స్థానికులు కార్లు, క్యాబ్‌లను ఎక్కువగా వినియోగిస్తారు. కాలి నుంచి తల వరకు స్థానికులు తీసుకునే జాగ్రత్తలన్నీ తీసుకుంటేనే బయటివారు అక్కడి పరిస్థితులను ఎదుర్కోగలరు.
సంకల్పానికి పరీక్ష
మొత్తానికి యాకుట్స్ ఒక సాధారణ వింటర్ టూరిస్ట్ డెస్టినేషన్ కాదు. ఇది మనిషి సంకల్పానికి ప్రకృతి పరీక్ష పెట్టే ప్రదేశం. ఆర్కిటిక్ జీవితం ఎలా ఉంటుందో అనుభవించాలంటే, యాకుట్స్ ఒక నిజమైన ఉదాహరణ. ఇది పర్యటన కోసం మాత్రమే కాదు, మనిషి తట్టుకునే శక్తిని పరీక్షించే ఒక మంచు ప్రపంచం.
- ఇది కూడా చదవండి : హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
