Kedarnath Ropeway : ఇక 36 నిమిషాల్లో కేదార్‌నాథ్ ఆలయం చేరుకోవచ్చు…
కేదార్‌నాథ్‌కు వెళ్లాలనుకునే తీర్థయాత్రికులకు శుభవార్త. ప్రయాణికుల కోసం ప్రతిష్ఠాత్మకమైన రోప్‌వే ప్రాజెక్టుకు (Kedarnath Ropeway) కేంద్ర మంత్రివర్గం అమోదం తెలిపింది. ఈ రోప్‌వే అందుబాటులోకి వస్తే దేశంలోనే అత్యంత పవిత్ర క్షేత్రాలలో ఒకటైన కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తుల శారీరక శ్రమ తగ్గనుంది. గతంలో ట్రెక్కింగ్‌కు పట్టే సమయం 8 నుంచి 9 గంటల నుంచి 36 నిమిషాలకు తగ్గనుంది.