TGSRTC Special Busses : సంక్రాంతికి తెలంగాణ ఆర్టీసి ప్రత్యేక బస్సులు .. టికెట్ ధరలో సవరింపు
ఏడాది మొత్తం ఎక్కడ ఉన్నా తమ సొంత ఊళ్లకు వెళ్లాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటారు. దీని కోసం ప్రజారవాణా వ్యవస్థను అత్యధికంగా వినియోగిస్తుంటారు. సంక్రాంతి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TGSRTC Special Busses ) యాజమాన్యం 6432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.