AP House Boat Guide : ఇక ఏపీలో కూడా కేరళ హౌస్‌బోట్..ఎప్పటి నుంచో తెలుసా? | Full Details
AP House Boat Guide : ఆంధ్రప్రదేశ్ పర్యాటకులకు, స్థానికులకు ప్రభుత్వం ఒక మంచి శుభవార్త అందించింది. కుటుంబం, స్నేహితులతో కలిసి హాయిగా గడిపేందుకు వీలుగా రాష్ట్రంలో కొత్తగా అడ్వెంచర్ టూరిజాన్ని మొదలుపెడుతున్నారు.
దీనిలో భాగంగా కేరళలో (Kerala House Boats) ప్రసిద్ధి చెందిన హౌస్బోట్లు (నీటిపై తేలియాడే ఇళ్లు) త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో కేరళ తరహా హౌస్‌బోట్ పర్యాటకం ప్రజలకు మరింత దగ్గర కానుంది.
AP House Boat Guide: దీనిలో భాగంగా కేరళలో (Kerala House Boats) ప్రసిద్ధి చెందిన హౌస్బోట్లు (నీటిపై తేలియాడే ఇళ్లు) త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో కేరళ తరహా హౌస్‌బోట్ పర్యాటకం ప్రజలకు మరింత దగ్గర కానుంది.
ముఖ్యాంశాలు
PPP మోడల్లో హౌస్బోట్లు
ఈ హౌస్‌బోట్ టూరిజం (House Boat Tourism) ప్రజా-ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. సంక్రాంతి పండుగ నాటికి సూర్యలంక, రాజమండ్రి, భవానీ ఐలాండ్ (Bhavani Island) ప్రాంతాల్లో మొత్తం ఐదు హౌస్బోట్లు ప్రారంభించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ అడ్వెంచర్ టూరిజాన్ని (Adventure Tourism) నిర్వహించడానికి కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కొన్ని ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. అధికారులు మొత్తం పది ప్రాంతాల్లో హౌస్బోట్లు నడపాలని ప్రతిపాదించారు.
- ఇది కూడా చూడండి : దక్షిణ భారతదేశంలో 8 సూపర్ వాటర్‌ఫాల్స్ | Waterfalls In South India

హౌస్‌బోట్ ప్రయాణాలు ఎక్కడంటే? | AP House Boat Guide
ప్రారంభంలో హౌస్‌బోట్ ప్రయాణాలు రెండు ముఖ్య ప్రాంతాల్లో జరుగుతాయి.
ఇది కూడా చదవండి : అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
విజయవాడ/కృష్ణా నది తీరం: | Vijayawada / Krishina River Front
హౌస్బోట్లు విజయవాడలోని (Vijayawada) బేరం పార్క్ నుండి మొదలవుతాయి. అక్కడి నుంచి భవానీ ఐలాండ్ చుట్టూ తిరిగి, పవిత్ర సంగమం వరకు వెళ్లి, ఆపై ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంటాయి. రాత్రిపూట ఆగేందుకు భవానీ ఐలాండ్‌లో బోట్లను లంగరు వేస్తారు. పర్యాటకులు అక్కడే విశ్రాంతి తీసుకోవచ్చు. ఉదయం తిరిగి ప్రయాణం మొదలుపెట్టి బేరం పార్కుకు చేరుకుంటారు.
రాజమండ్రి/గోదావరి నది తీరం: Rajahmundry / Godavari River Front
ఇక్కడ బోట్లు పద్మావతి, సరస్వతి ఘాట్ల నుంచి బయలుదేరుతాయి. ఇవి పిచ్చుకలంక, బ్రిడ్జి లంక మీదుగా ధవళేశ్వరం (Dhavaleshwaram) వరకు వెళ్తాయి.
- గోదావరి నది (Godavari River) అందాలను చూపిస్తూ, వచ్చిన మార్గంలోనే తిరిగి రాజమండ్రికి చేరుకుంటాయి.
- ఈ బోట్లు ప్రతి మార్గంలో దాదాపు 20 నుండి 30 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి.
ఇది కూడా చదవండి : Ramayana Trail : శ్రీలంకలో రామాయణం టూరిజం…ఏం చూపిస్తారు? ఎలా వెళ్లాలి ? Top 5 Tips
ప్యాకేజీ వివరాలు | Package Details
ప్రయాణ సమయం, వసతి
సాధారణంగా మధ్యాహ్నం 2 గంటలకు బోటు బయలుదేరితే, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు తిరిగి వస్తుంది.
- రాత్రిపూట ప్రయాణికులకు బోటులోనే భోజనం (మీల్స్), వసతి (రూములు) సదుపాయాలు అందిస్తారు.
- ప్రతి హౌస్‌బోట్‌లో నలుగురు వ్యక్తులు ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
ప్రభుత్వ సహాయం
AP House Boat Guide : పర్యాటక విధానం 2024-2029 ప్రకారం హౌస్బోట్లను నడపడానికి ముందుకు వచ్చే సంస్థలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది.
- వీటిలో విద్యుత్ రాయితీ, ఏడు సంవత్సరాల వరకు జీఎస్టీ తిరిగి చెల్లించడం (NTGST Refund), ఇతర సబ్సిడీలు ఉంటాయి.
- ఈ చర్యలతో రాష్ట్రంలో పర్యాటక రంగం (Tourism Industry) మరింతగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
