సంక్రాంతికి హైదరాబాద్ దగ్గర్లో 7 ట్రావెల్ ఆప్షన్స్ | 7 Easy Sankranti Trips from Hyderabad
సంక్రాంతికి షార్ట్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా ? మీ కోసం ఒకటి లేదా రెండు రోజుల్లో కవర్ చేసుకునేలా 7 Easy Sankranti Trips from Hyderabad మీ కోసం..
సంక్రాంతి అంటే కొన్ని దారుల్లో విపరీతమైన రష్ ఉంటుంది. మరికొన్ని దారులు మాత్రం ప్రశాంతంగా, ఎలాంటి హడావిడి లేకుండా సాగుతాయి. హైదరాబాద్‌లో ఉంటున్న వారికి కాంక్రీట్ జంగిల్ నుంచి కొద్దిసేపైనా బయటకు రావాల్సిన సరైన సమయం ఇదే.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్‌లో పతంగులు ఎగురేయడానికి 5 బెస్ట్ ప్రదేశాలు ఇవే | 5 Best Places To Fly Kites In Hyderabad
ఈ సెలవుల్లో ఒకటి లేదా రెండు రోజులు ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, హైదరాబాద్‌కు దగ్గరలో మీ మూడ్, బడ్జెట్‌కు తగిన 7 డెస్టినేషన్స్ ఇవి.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్ మొత్తాన్ని 2 రోజుల్లో పూర్తి చేయగలమా? – No | 2-Day Hyderabad Practical Tour
ముఖ్యాంశాలు
1. అనంతగిరి హిల్స్
Hyderabad → Ananthagiri Hills Distance: 85 km
ఇది అరకులో ఉన్న అనంతగిరి కాదు. హైదరాబాద్‌కు దగ్గరలో, వికారాబాద్ జిల్లాలో ఉన్న చిన్నపాటి హిల్ స్టేషన్. అనంతగిరి వెళ్లే ఫారెస్ట్ రోడ్స్ చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. చలికాలంలో ఇక్కడి సూర్యోదయం ప్రత్యేక ఆకర్షణ. అనంత పద్మనాభ స్వామి ఆలయం, చుట్టుపక్కల ప్రకృతి కలిసి మంచి అనుభూతిని ఇస్తాయి. ఫ్యామిలీతో వెళ్లేందుకు అనువైన ప్రదేశం ఇది.
Travel Tip:
అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే తొలి మంచు (fog)ని ఎంజాయ్ చేయొచ్చు. మధ్యాహ్నం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది.
- ఇది కూడా చదవండి : Hyderabad లో తప్పకుండా వెళ్లాల్సిన Top 7 Best Family Parks – Entry Fee, Timings & Complete Guide
2. నాగార్జున సాగర్
Hyderabad → Nagarjuna Sagar Distance: 183 km
కృష్ణా నదిపై నిర్మించిన ఈ భారీ డ్యామ్ ఈ ట్రిప్‌లో ప్రధాన హైలైట్. చుట్టుపక్కల వ్యూపాయింట్లు, ఓపెన్ స్పేసులు మీ ప్రయాణాన్ని ప్రశాంతంగా మార్చుతాయి.
Travel Tip:
నీటిని విడుదల చేసే షెడ్యూల్, బోట్ టైమింగ్స్ ముందుగానే చెక్ చేయండి.
- ఇది కూడా చదవండి : ఈ ఆదివారం ఖాళీనా? Hyderabad దగ్గర ఈ 6 ప్లేసులు మిస్ అవ్వకండి ! 6 Weekend Destinations
3. వేములవాడ | కొండగట్టు
Hyderabad → Vemulawada Distance: ~150 km
Hyderabad → Kondagattu Distance: ~178 km
సంక్రాంతి సమయంలో ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకుంటే ఈ రూట్ బాగా సెట్ అవుతుంది. రాజ రాజేశ్వర స్వామి ఆలయం దర్శనం తర్వాత కొండగట్టు ఫారెస్ట్ స్ట్రెచ్‌లో ప్రశాంతమైన డ్రైవ్ ఉంటుంది. అంజన్న దర్శనం తర్వాత ట్రిప్ పూర్తయిన ఫీలింగ్ వస్తుంది.
Travel Tip:
దర్శనానికి రష్ ఎక్కువగా ఉంటుంది. పొద్దున్నే వెళ్లడం బెటర్.
- ఇది కూడా చదవండి : కొండగట్టు అంజన్న ఆలయం ట్రావెల్ గైడ్ 2025 | Kondagattu Anjaneya Temple Travel Guide
4. శ్రీశైలం
Hyderabad → Srisailam Distance: ~231 km

నల్లమల అడవుల మధ్య రోడ్ జర్నీ ఈ ట్రిప్‌లో ప్రధాన ఆకర్షణ. ఆధ్యాత్మిక అనుభూతితో పాటు నేచర్‌ను ఆస్వాదించాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక.
Travel Tip:
ఫారెస్ట్ చెక్‌పోస్ట్ టైమింగ్స్ స్ట్రిక్ట్‌గా ఉంటాయి. రాత్రి డ్రైవింగ్ చేయకండి.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్ నుంచి 245 కిమీ దూరంలో తెలంగాణలో ఒక జైపూర్ | Jaipur In Telangana Travel Guide 2025
5. బీదర్ | 7 Easy Sankranti Trips from Hyderabad
Hyderabad → Bidar Distance: ~142 km
చరిత్ర, వారసత్వ సంపదపై ఆసక్తి ఉన్నవారికి బీదర్ మంచి ఛాయిస్. పాత కోటలు, పురాతన కట్టడాలు ఈ పట్టణానికి ప్రత్యేక గుర్తింపు ఇస్తాయి.
Travel Tip:
కర్ణాటక బార్డర్ క్రాస్ అవుతారు కాబట్టి సరైన గుర్తింపు కార్డు తీసుకెళ్లండి.
6. మెదక్ | పోచారం
Hyderabad → Medak Distance: ~100 km
Hyderabad → Pocharam Distance: ~115 km
సింపుల్, ప్రశాంతమైన డే ట్రిప్ కోసం మెదక్ – పోచారం చక్కగా సెట్ అవుతుంది. మెదక్‌లోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దర్శనం తర్వాత పోచారం లేక్ దగ్గర మంచి టైమ్ స్పెండ్ చేయవచ్చు.
Travel Tip:
పొద్దున్నే విజిట్ చేస్తే ఎండ, రద్దీ రెండూ తక్కువగా ఉంటాయి.
7. కావల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
Hyderabad → Kawal Wildlife Sanctuary Distance: ~258 km
సిటీ క్రౌడ్ నుంచి పూర్తిగా ఎస్కేప్ కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఫారెస్ట్‌లో స్టే ప్లాన్ చేస్తే అనుభవం ఇంకా బెటర్ అవుతుంది.
Travel Tip:
సంక్రాంతి సీజన్లో ఫారెస్ట్ లాడ్జీలు త్వరగా ఫిల్ అవుతాయి. అడ్వాన్స్ బుకింగ్ తప్పనిసరి.
- ఇది కూడా చదవండి : కోహీర్: తెలంగాణలో చాలా మందికి తెలియని చలి ప్రదేశం | Kohir coldest place in Telangana
సంక్రాంతి ప్రయాణ చిట్కాలు
సంక్రాంతి సెలవుల్లో హైవేల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అందుకే తెల్లవారగానే స్టార్ట్ అవ్వడం బెటర్. గాలిపటాల సీజన్ కావడంతో చైనీస్ మాంజా రిస్క్ ఉంటుంది, ముఖ్యంగా ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
నేను పాటించే సింపుల్ చిట్కా ఏమిటంటే, డ్రైవ్ చేసే సమయంలో మెడకు మఫ్లర్ వేసుకుంటాను. ఇప్పటివరకు మాంజా తగిలిన పరిస్థితి రాలేదు కానీ, సేఫ్‌గా ఉంటాననే భరోసా ఉంటుంది.
దూర ప్రాంతాలకు వెళ్తే ఫుడ్ ఆప్షన్స్ తక్కువగా ఉండొచ్చు. కాబట్టి మంచినీరు, స్నాక్స్ వెంట తీసుకెళ్లండి. అడవి ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ ఆగి వనభోజనాలు చేయడం సేఫ్ కాదు. స్థానిక అధికారులు లేదా పోలీసులు కనిపిస్తే సేఫ్ స్పాట్ అడిగి తెలుసుకోండి.
ఈ డెస్టినేషన్స్ అన్నీ షార్ట్ బ్రేక్ ట్రిప్స్ కోసమే సూచించాం. మీ ప్రయాణాన్ని ఇంకా పొడగించాలనుకున్నా, ఇతర ఆప్షన్స్ చూడాలనుకున్నా ప్రయాణికుడు డాట్‌కామ్ లో హైదరాబాద్ లేదా తెలంగాణ సెక్షన్ చెక్ చేయవచ్చు.
- హైదరాబాద్‌ను పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసందుకు క్లిక్ చేయండి.
- తెలంగాణలో సందర్శనీయ స్థలాలు ఏవో జిల్లవారిగా తెలుసుకోవడానికి క్లిక్ చేయండి.
- ఆంధ్రప్రదేశ్ ట్రావెల్ అండ్ టూరిజం స్టోరిస్ కోసం క్లిక్ చేయండి.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
