Kolyma : మైనస్ 50 డిగ్రీల నరకం.. ట్రావెల్ డెస్టినేషన్ కాదు.. శ్మశానం
Kolyma : మైనస్ 50 డిగ్రీల చలిలో గడ్డకట్టే కోలిమా ఒకప్పుడు స్టాలిన్ గులాగ్ లేబర్ క్యాంప్. లక్షల మంది ఖైదీలు ఇక్కడ బంగారు గనులు, రోడ్ల నిర్మాణంలో ప్రాణాలు కోల్పోయారు.
మైనస్ 50 డిగ్రీల కన్నా తక్కువగా ఉండే అతి చల్లని వాతావరణం… చుట్టూ అంతులేని మంచు పర్వతాలు.. జనసంచారం చాలా తక్కువ. రష్యాలోని ఈశాన్య భాగంలో ఉన్న కోలిమా ప్రపంచంలోని అత్యంత కఠినమైన, ఏకాంత ప్రదేశాల్లో ఒకటి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ ప్రాంతాన్ని ప్రపంచం గుర్తించేలా చేసింది అక్కడి చలి మాత్రమే కాదు.. దాని వెనుక ఉన్న విషాద చరిత్ర.
- ఇది కూడా చదవండి : Lonar Lake Mystery : దక్కన్ పీఠభూమిలో అంతరిక్ష రహస్యం
సోవియట్ పాలకుడు జోసెఫ్ స్టాలిన్ పాలనలో కోలిమా ప్రాంతం ఒక పెద్ద లేబర్ క్యాంప్‌గా మారింది. గులాగ్ అనే వ్యవస్థలో భాగంగా వేలాది కిలోమీటర్ల దూరం నుంచి ఖైదీలను ఇక్కడికి తరలించేవారు. బంగారం, ఇతర ఖనిజాల తవ్వకాలు, రహదారుల నిర్మాణం వంటి అత్యంత కఠినమైన పనుల్లో వారిని ఉపయోగించేవారు.
Driving over the misty river Kolyma near the settlement of Srednekan in Magadan region, video by drs_mgdn pic.twitter.com/5BLIAi7oEw
— The Siberian Times (@siberian_times) December 27, 2020
తీవ్రమైన చలి, తగిన ఆహారం లేకపోవడం, వ్యాధులు, కఠినమైన వర్కింగ్ కండిషన్స్, ఇవన్నీ అక్కడి ఖైదీల జీవితాన్ని దారుణంగా మార్చేశాయి. అసలు కొలిమాకు ఎంతమందిని తరలించారు, అక్కడ ఎంత మంది మరణించారు అనే విషయంపై చరిత్రకారుల్లోనే స్పష్టత లేదు. అయితే బాధితుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది అని అంచనా వేస్తున్నారు.
అయితే కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చినట్టు చరిత్రకారులు భావిస్తున్నారు.
నేడు కోలిమాలో చిన్న చిన్న పట్టణాలు, గనులు, విస్తారమైన అడవులు కనిపిస్తాయి. అయితే శీతాకాలంలో తీవ్రమైన చలి, పరిమితమైన రవాణా సదుపాయం, కఠినమైన ప్రకృతి ఈ ప్రాంతాన్ని ఛాలెంజింగ్ లొకేషన్‌గా మార్చాయి.
కోలిమా అనేది ఒక ట్రావెల్ డెస్టినేషన్ మాత్రమే కాదు…ఒకప్పుడు వేలాది మంది ఖైదీలు అనుభవించిన బాధను గుర్తు చేసే ప్రదేశంగా చరిత్రలో నిలిచిపోతోంది. పూర్తిగా మంచుతో నిండి ఉన్న ఈ నేల సోవియట్ చరిత్రలోని ఒక చీకటి అధ్యాయానికి నేటికీ నిశ్శబ్ద సాక్షిగా నిలిచిపోయింది.
▶️ వీడియో చూడండి : భారత దేశంలో మొదటి గ్రామం







