Agumbe : మేఘాల్లో దాగిన గ్రీన్ స్వర్గం!
Agumbe : నేచర్‌లో కొన్ని ప్రదేశాలు మన మనసులను మెల్లిగా మార్చేస్తాయి. ఆగుంబే కూడా అలాంటి ఒక ప్రదేశమే. ఫస్ట్ టైమ్ వెస్టర్న్ ఘాట్స్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఇది చాలా సాఫ్ట్ ఎంట్రీలా ఫీల్ అవుతుంది. గ్రీనరీ మధ్య కామ్‌గా సెటిల్ అయ్యే ప్రదేశంలా ఉంటుంది.
రోడ్ జర్నీలోనే మార్పు స్టార్ట్ అవుతుంది. సిటీ సౌండ్స్ తగ్గి, చుట్టూ లష్ ఫారెస్ట్స్, మిస్ట్‌తో కప్పబడ్డ కొండలు కనిపిస్తాయి. ఆగుంబేలో వాక్ చేస్తుంటే ప్రతి కార్నర్లో తడిసిన ఆకుల సువాసన, తాజా గాలి టచ్ క్లియర్‌గా తెలుస్తుంది.
సందర్శనీయ స్థలాలు | Places to Visit
సన్‌సెట్ పాయింట్ దగ్గర మెల్లిగా ఆకాశం రంగులు మారడం చూస్తే కాలం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఆగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ వద్ద చిక్కటి అడవులను పర్యాటకులు బాగా ఇష్టపడుతుంటారు.

బర్కానా ఫాల్స్ (Barkana Falls) చుట్టుపక్కల నేచర్ చాలా రా & బ్యూటిఫుల్‌గా ఉంటుంది.
చిన్న ఫారెస్ట్ ట్రైల్స్‌లో నడిస్తే సైలెన్స్ కూడా ఒక ఎక్స్‌పీరియెన్స్‌లా అనిపిస్తుంది.
- ఇది కూడా చదవండి : Arunachalam: అరుణాచల పర్వతంపైకి వెళ్లొచ్చా? గిరి ప్రదక్షిణ ఏ సమయంలో చేయాలి? పూర్తి గైడ్
ట్రై చేయాల్సిన ఫుడ్ | Food to Eat
ఇక్కడ ఫుడ్ చాలా సింపుల్‌గా ఉంటుంది. లోకల్ స్టైల్ మీల్స్ ఫ్రెష్‌గా సర్వ్ చేస్తారు. హాట్ రైస్, లైట్ కర్రీలు ఇంటి భోజనం ఫీల్ ఇస్తాయి. వర్షాకాలంలో (Rain In Agumbe) చాయ్‌తో స్నాక్స్ ఎంజాయ్ చేయడం ఒక మెమరీలా ఉంటుంది.
ఎప్పుడు వెళ్లాలి? | Best Time
జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాల్లో ఆగుంబే ఒక ఆకు పచ్చ ప్రపంచంలా (Karnataka rainforest)మారిపోతుంది. చలికాలంలో కూడా ఇక్కడి అందాలు అలరిస్తాయి.
#Agumbe 187 mm 🔥
— Naveen Reddy (@navin_ankampali) August 18, 2025
Crossed 1 K for the August month, With just 1,002 mm of rain so far, August hasn't even reached half of its average monthly rainfall of 2,146 mm. pic.twitter.com/awcOqKwBUU
ఎలా చేరుకోవాలి? | How To Reach
అగుంబే అనే గ్రామం కర్ణాటకలోని (Karnataka) శివమొగ్గ జిల్లాలోని (Shivamogga) తీర్థనహల్లి ప్రాంతంలో ఉంది. ఇక్కడికి వెళ్లాలి అంటే హైదరాబాద్ నుండి మాంగళూరు లేదా ఉడుపి వరకు ఫ్లైట్ లేదా ట్రైన్లో చేరి, అక్కడి నుండి రోడ్ జర్నీ ద్వారా ఆగుంబే చేరుకోవచ్చు. మొత్తం ట్రావెల్ టైమ్ సుమారు 10–12 గంటలు.
ఆగుంబేలో లైఫ్ స్లోగా, నేచర్‌తో సింక్ అయిన ఫ్లోగా ఉంటుంది. ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా సమయాన్ని గడపవచ్చు. ఈ గ్రీనరీ జర్నీలో మీరు ఒక రీల్లో ఉన్నట్టే రియల్ అనుభూతిని పొందుతారు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.







