భారతదేశంలో ఉన్న ఏకైక యాక్టివ్ అగ్నిపర్వతం | Barren Island Volcano
Barren Island Volcano : భారతదేశం అంటే మనకు హిమాలయాలు, ఎడారులు, బీచులు మాత్రమే గుర్తుకు వస్తాయి కదా. కానీ మన దేశంలో ఒక యాక్టివ్ అగ్నిపర్వతం ఉంది అనే విషయం చాలా మందికి తెలియదు.
అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉన్న Barren Island లో ఇండియాలో ఉన్న ఒకే ఒక్క క్రీయాశీల అగ్నిపర్వతం (India Active Volcano) ఉంది.
పోర్ట్ బ్లెయిర్ నుంచి సుమారు 135 కిమీ దూరంలో ఉన్న ఈ ఐలాండ్‌లో ఎవరూ నివసించరు. దీనికి తగినట్టే దీని పేరు కూడా “Barren” అంటే బంజరు, జీవం లేని లేదా నిస్సారమైన భూమి అని అర్థం.ఇక్కడ మనుషులు నివసించరు. ఎలాంటి నివాసాలు లేవు. ఎందుకంటే ఇక్కడ నేచర్ తన పవర్ ఏంటో చూపిస్తూ ఉంటుంది.
- ఇది కూడా చదవండి : Floating Post Office : నీటిపై తేలే పోస్టాఫీస్…ఎక్కడ ఉందో తెలుసా?
బ్యారెన్ ఐలాండ్‌లోని ఈ అగ్నిపర్వతంలో గత కొన్నేళ్లుగా చిన్నపెద్ద విస్ఫోటనలు జరిగాయి. 1991లో ఒక భారీ విస్ఫోటనం జరిగింది. దాని తరువాత అడపాదడపా లావా, బూడిద బయటకు రావడం కనిపించింది.

సాధారణ ప్రజలకు ఇక్కడికి వెళ్లే అనుమతి లేదు. కానీ శాస్త్రవేత్తలకు ఇది ఒక ముఖ్యమైన స్టడీ జోన్‌గా మారింది.
సేఫ్టీ కారణాల వల్ల సామాన్యులకు ఈ దీవికి వెళ్లే అనుమతి లేదు. అయితే బోటు నుంచి సురక్షితమైన దూరంలో ఉంటూ దీనిని చూసే అవకాశం ఉంది. కానీ అంత దూరం నుంచే అగ్నిపర్వతం నుంచి వచ్చే లావా, పొగ చూస్తే భూమి ఎంత శక్తివంతమైనదో అర్థం అవుతుంది.
మన దేశంలో అగ్నిపర్వతం ఉంది అని మీరు ఎప్పుడైనా విన్నారా?
ఇలాంటి Extreme Stories కోసం Follow Prayanikudu
Watch It On Reel and Do Follow Us On Instagram
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
