Konkan Railway : రత్నగిరి నుండి కర్వార్ వరకు..ఇండియాలోనే అందమైన ట్రైన్ రూట్
Konkan Railway : కోంకణ్ రైల్వేలో ట్రావెల్ చేస్తుంటే అది సాధారణ ట్రైన్ జర్నీలా అనిపించదు. ఒక సినిమాలో మనం భాగమైనట్టుగా అనిపిస్తుంది. విండో సీట్ దగ్గర కూర్చొని బయట చూస్తే ప్రతీ నిమిషం సీన్ మారిపోతూనే ఉంటుంది.
టన్నెల్స్ మధ్య వెళుతుంటే లైట్ సడెన్‌గా మారిపోతుంది. ఒక్కసారి అందమైన చీకటి… తరువాత చందమైన వెలుగులో పచ్చని కొండలు కనిపిస్తాయి. ఆ కాంట్రాస్ట్లోనే ఈ జర్నీ ఒక మ్యాజిక్‌లా అనిపిస్తుంది.
- ఇది కూడా చదవండి : Eateries In Goa : గోవాలో తప్పకుండా ట్రై చేయాల్సిన 10 రెస్టారెంట్స్ ఇవే
బ్రిడ్జిలు క్రాస్ అయ్యేటప్పుడు ఒక పక్కన వెస్టర్న్ ఘాట్స్ (Western Ghats) కొండలు, మరోవైపు అరేబియన్ సీ బ్లూ లైన్లా కనిపిస్తుంది. కొన్ని ప్రదేశాల్లో సముద్రం హఠాత్తుగా కనిపించి, వెంటనే కొబ్బరి చెట్ల మధ్య మాయమైపోతుంది.
చిన్న చిన్న స్టేషన్ల దగ్గర ట్రైన్ స్లో అయ్యే సమయంలో ప్లాట్‌ఫారమ్ మీద లోకల్ లైఫ్ మణిరత్నం సినిమా ఫ్రేమ్‌లా కనిపిస్తుంది. ఛాయ్ స్టాల్స్, ఫిషింగ్ బాస్కెట్స్, సైలెంట్ బెంచులు… ఇవన్నీ ఒక సినిమాటిక్ ఫీలింగ్ కలిగిస్తాయి.
సందర్శనీయ స్థలాలు | Places To Visit
Ratnagiri లో ట్రైన్ ఆగే సమయంలో సముద్రం ఒక బ్లూ స్పార్క్‌లా కనిపిస్తుంది. Karwar దగ్గర కోస్ట్ ఇంకా దగ్గరగా వస్తుంది. సముద్ర గాలి దాదాపు రైలు కిటికీలోకి మనల్ని తాకేందుకే వచ్చినట్టుగా అనిపిస్తుంది. ప్రతీ స్టేషన్ ఒక కోస్టల్ పోస్టుకార్డ్లా ఉంటుంది.
హైదరాబాద్ నుండి ఎలా చేరాలి? | How To Reach From Hyderabad
హైదరాబాద్ నుండి మడ్గావ్ (Madgaon) లేదా మంగళూరు వరకు డైరెక్ట్ ట్రైన్స్ దొరుకుతాయి. అక్కడి నుంచి కోంకణ్ కోస్టల్ స్ట్రెచ్‌లో జర్నీ కొనసాగిస్తే రైలు యాత్ర ఒక అందమైన స్మృతిగా మారిపోతుంది. వెలుగు, నీళ్లు, పచ్చని పర్వతాల మధ్య నిలిచిపోయే ఒక అనుభవంగా మిగిలిపోతుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
