Lonar Lake Mystery : దక్కన్ పీఠభూమిలో అంతరిక్ష రహస్యం
Lonar Lake Mystery : మహారాష్ట్రలో ఒక జలరాశి ఉంది (Waterbody). అది నది కాదు. సముద్రం కాదు. వర్షం వల్ల పుట్టింది కాదు. మనిషి క్రియేట్ చేసినది అస్సలే కాదు. భూమికి, అంతరిక్షానికి మధ్య జరిగిన ఒక భయంకరమైన ఘటనకు సాక్ష్యంగా నిలుస్తుంది ఈ ప్రదేశం.
ముఖ్యాంశాలు
ఎక్కడ ఉంది? ప్రత్యేకత ఏంటి? | Where It Is & Why It’s Hidden
లోనార్ లేక్ మహారాష్ట్రలోని (Maharastra) బుల్ధానా జిల్లాలో ఉంది. దక్కన్ పీఠభూమి మధ్యలో, సాధారణ గ్రామాల మధ్యలో ఈ సరస్సు ఉంటుంది.
నిజానికి టూరిజం మ్యాప్‌లలో లేదా టూరిస్టులు తప్పక వెళ్లాల్సిన ప్రదేశాల జాబితాలో దీనిని చేర్చరు అనేది వాస్తవం. ఎందుకంటే ఇది సరదాగా వెళ్లే ప్రదేశం కాదు. అలాగే హ్యాంగౌట్ ప్రదేశం అస్సలే కాదు. ఇనిస్టాగ్రామంలో నివసించే గ్రామస్తులు ఇక్కడికి ఎక్కువగా రారు.
ఇది ఎన్నో ప్రశ్నలకు జన్మనిచ్చే ప్రదేశం. కుతూహలం కలిగించే ప్రదేశం. అలాగే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన ప్రదేశం కూడా. ఎందుకంటే ఇది మనకు తెలిసిన చరిత్రకు ముందు జరిగిన చరిత్ర.
- ఇది కూడా చదవండి : Malana Village Mystery : హిమాలయాల్లో ఒక రహస్య గ్రామం..
ఉల్కాపాతం వల్ల ఏర్పడిన క్రేటర్ | Lonar Crater History
శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. ఇది ఒక ఉల్కాపాతం (Meteor Impact) వల్ల ఏర్పడిన క్రేటర్.
అత్యంత వేగంతో వచ్చిన ఉల్క భూమి ఉపరితలాన్ని ఢీకొట్టినప్పుడు, దాని తీవ్రతకు ఒక భారీ లోతైన గుంట ఏర్పడుతుంది. సాధారణంగా ఇలాంటి క్రేటర్లు వేల నుంచి లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటాయి. డైనాసార్లు అంతరించిన కాలానికి చెందినవై ఉండే అవకాశమూ ఉంది.
ఈ క్రేటర్లు భూమి–అంతరిక్షం మధ్య ఉన్న చరిత్రకు సాక్ష్యాలు. సౌరమండలంలో జరిగిన మార్పులకు చిహ్నాలు అని కూడా చెప్పవచ్చు. అలాగే భూమిపై జీవనం ఎలా వికసించింది అనేది తెలుసుకోవడానికి కూడా ఇవి సహాయపడతాయి.

సైన్సు కథ..విశ్వాసల స్క్రీన్‌ప్లే | Science and Belief
లోనార్ లేక్ ఒక ఉల్కాపాతం వల్లే ఏర్పడిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే స్థానికుల నమ్మకాలు, వారి కథనాలు కాస్త భిన్నంగా ఉంటాయి.
ఇక్కడి నీటిని పవిత్రంగా భావించి, ఈ సరస్సు చుట్టూ ఎన్నో ఆలయాలను నిర్మించారు.
ఇక్కడ శాస్త్రీయతకు, నమ్మకాలకు మధ్య తేడాలను బేరీజు వేయడం నా డిపార్ట్మెంట్ కాదు. నష్టం లేనప్పుడు నమ్మితే తప్పేంటి అనేది నా అభిప్రాయం. శాస్త్రంతో పాటు విశ్వాసాన్ని బ్యాలెన్స్ చేయడం ముఖ్యం కదా.
- ఇది కూడా చదవండి : పండరిపురం ఆలయ దర్శనం కంప్లీట్ గైడ్
బయటవారు అరుదుగా గమనించేది | What Outsiders Rarely See
బయట నుంచి చూస్తే ఈ సరస్సు నిశ్చలంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. సరస్సులోని నీటి రంగు సీజన్‌ను బట్టి మారుతుంది. అయితే దీనిని మనం రంగులు మార్చే లేక్ అని ప్రమోట్ చేయడం కరెక్టు కాదు. లేదంటే అనవసరమైన ట్రెండ్‌ను మనం స్టార్ట్ చేసినవాళ్లం అవుతాం.
#Lonar Lake in Maharashtra, was created by an asteroid in Pleistocene Epoch. It is one of the four known, hyper-velocity, impact craters in basaltic rock anywhere on Earth. Something strange happened within few days here. The water turned into pink. Captured by Landsat 8 of @NASA pic.twitter.com/v9wHj1EYPV
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 24, 2020
చుట్టుపక్కల ఉన్న రాళ్లలో అయస్కాంత లక్షణాలు ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఉదయం వేళ పక్షుల కిలకిలారావాలతో పాటు, చాలా తక్కువ సంఖ్యలో పర్యాటకులను కూడా చూడవచ్చు.
వాస్తవం ఏంటంటే? | Lonar Lake mystery Reality Check
లోనార్ లేక్ పర్యావరణ వ్యవస్థ (Ecosystem) అనేది చాలా సున్నితమైనది. ఇక్కడ నచ్చినట్టు ప్రవర్తించే అవకాశం లేదు. శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయవచ్చు. పర్యాటకులు పరిశీలించవచ్చు. అంతే కానీ ఎవ్వరూ కూడా ఇక్కడి ఎకోసిస్టమ్‌ను డిస్టర్బ్ చేయకూడదు అనే విషయం తెలుసుకోవాలి.
నీటిలో రాళ్లు వేయడం, కాళ్లు పెట్టడం లాంటి పనులు ఇక్కడ అనుమతించబడవు. అయితే ఇది హాంటెడ్ ప్లేస్ అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. మిమ్మల్ని భయపెట్టాలని కూడా నేను చెప్పడం లేదు కానీ ఇది ఒక Protected Geological Site — అంటే అరుదైన భౌగోళిక వారసత్వ ప్రదేశం.
ప్రభుత్వం దీనిని అధికారికంగా రక్షిస్తోంది. ఇక్కడి రాతి నిర్మాణాలు, భౌగోళిక రూపాలు, ఉల్కాపాతానికి సంబంధించిన ఆనవాళ్లు, గుర్తులు ఇవన్నీ శాస్త్రీయంగా ఎంతో విలువైనవి. మనిషి సృష్టించలేని అంశాలు ఇవి కాబట్టి, ఇక్కడి నియమాలు చాలా కఠినంగా ఉంటాయి.
ఈ ప్రదేశం ఎందుకు ముఖ్యం? | Why This Place Matters Today
లోనార్ లేక్ భారతదేశంలోనే ఒక అరుదైన భౌగోళిక ప్రదేశం. భూమి చరిత్ర, అంతరిక్ష శాస్త్రం, స్థానిక సంస్కృతి, ప్రజల విశ్వాసాలు ఇవన్నీ కలిసిన ఒక యూనిక్ ప్రదేశం ఇది.
లోనార్కు వెళ్లి “చూసొచ్చాం” అని చెప్పడం కన్నా, “తెలుసుకుని వచ్చాం” అని చెప్పడం బెస్ట్.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్ నుంచి 245 కిమీ దూరంలో తెలంగాణలో ఒక జైపూర్ | Jaipur In Telangana Travel Guide 2025
ఇక్కడికి వెళ్తే సెల్ఫీలు, వ్లాగులు కాసేపు ఆపేసి ఊహాలోకంలోకి వెళ్లండి. అంతరిక్షం నుంచి వచ్చిన ఒక ఉల్క పడిన ప్రాంతం మీ కళ్ల ముందే ఉంది. ఆ సమయంలో ఏం జరిగి ఉండొచ్చో మీ ఊహకే వదిలేయండి. హాలీవుడ్ మూవీస్ చూసే అలావాటు ఉంటే మీ ఊహ మరింత రియలిస్టిగ్గా ఉండే అవకాశం ఉంటుంది.
కానీ ఒక్కటి మాత్రం సూపర్ స్టార్ రజినీ కాంత్‌లా చెప్పాలి అనుకుంటున్నాను. భూమి గురించి మనకు తెలిసింది గోరంత. తెలియనిది కొండంత.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
