Kyoto Spring Travel : సకూరా పుష్పాలతో మేల్కొనే ప్రాచీన నగరం

Kyoto Spring Travel : కొన్ని ప్రదేశాలను కళ్లతో చూస్తాము. కొన్ని ప్రదేశాలను మనసులో అనుభూతి చెందుతాము. క్యోటోలో వసంతం జీవితాంతం ఒక మోమోరీగా దాచుకుంటాం. జపాన్‌లో ఉన్న క్యోటో అనే ప్రాచీన నగరం మార్చి నుంచి సమ్మర్ ప్రారంభం వరకు ఒక అందమైన రెంగుల కథలా మారిపోతుంది.

సకూరా చెట్ల గులాబీ పుష్పాలతో విరిసిన ఒక సందర్భంలో వీధుల్లో చెరువులు, సరస్సులు, ఆలయాలు ఇవన్నీ కలిసి ఒక లైవ్ పెయింటింగ్ అనిపిస్తాయి. ఇక్కడ ప్రయాణం అంటే చెక్‌లిస్ట్ టూరిజం కాదు..ఒక స్లో వాక్…ఒక సైలైంట్ ఫీలింగ్.

వసంత వెలుగుల్లో క్యోటో రిథమ్ | Kyoto Spring Travel

ప్రభాత సమయంలో లైట్ మిస్ట్ మధ్య నడుస్తే గాలిలో ఒక ఫ్రెష్ ఫ్రెగ్నెన్స్ ఉంటుంది. రోడ్ సైడ్‌లో చిన్న చిన్న కేఫేలు (Cafes In Kyoto) తెరుచుకుంటాయి.సైకిల్‌పై స్కూల్‌కు వెళ్లే పిల్లలు కనిపిస్తారు. పక్కనే ఓల్డ్ వువెన్ హౌసెస్, సైలెంట్‌గా ఉంటాయి. ఇక్కడ ఫాస్ట్ కాదు..కామ్‌‌గా బ్యాలెన్స్‌గా సాగుతుంది జీవితం.

kyoto travel guide
Kyoto Spring Travel

మధ్యాహ్నం సమయంలో కెనాల్ పక్కనే కూర్చుని ఉంటే నీటీపై పడిన చెర్రీ బ్లాసమ్ (Cherry Blossom) పెటెల్స్ స్లోగా ప్లోట్ అవుతూ ఉంటాయి. ఆ సీన్ చూస్తే టైమ్ కూడా స్లో మోషన్‌లో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. క్యోటోలో సమ్మర్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ వసంత కాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

లోకల్  ఫీల్ ఇచ్చే ప్రాచీన కల్చర్ | Culture Of Kyoto

క్యోటో అంటే జపాన్ కల్చరల్ క్యాపిటల్ లాంటిది. జియాన్ ఏరియాలో సాయంత్రం సమయంలో వాక్ చేస్తే ట్రెడిషనల్ కిమోనో (Kimono) వేసుకున్న అమ్మాయిలు చాలా మంది కనిపిస్తారు. ఓల్డ్ టీ హౌసెస్ నుంచి వస్తున్న వార్మ్ లైట్ స్ట్రీట్ మీద పడితే సిటీ ఒక వింటేజ్ సినిమా ఫ్రేమ్‌లా మారిపోతుంది. 

ఇక్కడ టీ సెర్మనీ అనుభవం అనేది చాలా స్పెషల్‌గా ఉంటుంది. సింపుల్‌గా టీ సర్వ్ చేసిన విధానంలో కూడా ఒక డిసిప్లెన్, ఒక గౌరవం ఉంటుంది. లోకల్ మార్కె‌ట్‌లో ఫ్రెష్ ఫ్రూట్స్, హ్యాాండ్ మేడ్  క్రాఫ్టులు, సీజనల్ స్వీట్స్ లభిస్తాయి. ఇక్కడి ప్రజలు ప్రకృతి మమేకమై జీవిస్తారు. అది మీరు బాగా గమనించవచ్చు.

సందర్శనీయ స్థలాలు | Places to Visit

క్యోటోలో ప్రయాణం అంటే ప్లేస్ నుండి ప్లేస్‌కు ట్రావెల్ కాదు. ఫీలింగ్ నుండి ఫీలింగ్‌కి మూవ్ అవ్వడం లాంటిది. ఫుషిమీ ఇనారీ (Fushimi Inari Taisha) తైషా దగ్గర రెడ్ టోరీ గేట్స్ మధ్య నడవటం అంటే ఒక స్పిరిచువల్ టన్నెల్‌లో వెళ్తున్నట్టు ఉంటుంది. ప్రతీ అడుగులో నిశ్బబ్దానికి ప్రశాంతతకు మరింత చేరువ అవుతున్నట్టు ఉంటుంది.

కింకాకు జి (Kinkaku Ji), అంటే గోల్డెన్ పెవీలియన్, దీని ప్రతిబింబం స్థానిక సరస్సులో కనిపిస్తే వెంటనే ఫోటోలు తీయాలని అనిపిస్తుంది. కానీ అలా చేయకుండా మౌనంగా ఆ నిమిషాన్ని ఎంజాయ్ చేయడమే కరెక్టు అని మనసు కూడా చెబుతుంది. 

Kyoto Spring Travel
Kyoto Spring Travel

అరాషియామా బాంబూ గ్రూవ్‌లో తనువుతో పాటు మనసును తాకుతూ వెళ్లే గాలి, ఆ గాలికి వినిపించే నేచురల్ సౌండ్స్ ఇవన్నీ ఒక మ్యూజికల్ ఎక్స్‌పీరియెన్స్‌లా మిగిలిపోతాయి.

ఫిలాసఫర్స్ పాత్ కెనాల్ (Philosophers) పక్కన సుకూరా ఛాయలో నడుస్తే ప్రతీ టర్న్‌లో గులాజి పెటల్స్ పడుతున్న భావన కలుగుతుంది. ఇక్కడ వాక్ కంప్లీట్ అయ్యాక కూడా ఈ సీన్ మనసులో కంటిన్యూ అవుతుంది.

ఎలా వెళ్లాలి? | How To Reach Kyoto

హైదరాబాద్ నుంచి టోక్యో (Hyderabad To Tokyo) లేదా ఒసాకాకి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంాయి. అక్కడి నుండి ట్రైన్ ద్వారా క్యోటోకి ఈజీగా రీచ్ అవ్వొచ్చు. జపాన్ రైల్వే సిస్టమ్ స్మూత్‌గా ఉంటుంది కాబట్టి ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్ కూడా పార్ట్ ఆఫ్ ది జర్నీలా ఉటుంది.

ఎక్కడ ఉండాలి? | Accommodation

సిటీ సెంటర్ దగ్గర్లో ట్రెడిషనల్ ర్యోకన్ స్టైల్ స్టేలు అందుబాటులో ఉంటాయి. సింపుల్ వుడెన్ రూమ్స్, తతామీ మ్యాట్స్, స్లైడిండ్ డోర్స్ ఇలా స్టే కూడా కల్చరల్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. మోడర్న్ హోటల్స్ కడూా అందుబాటులో ఉంటాయి. కానీ ఓల్డ్ స్టైల్ ఎకామడేషన్‌‌లో ఉంటేనే క్యోటో వైబ్ ఫీల్ అవ్వవచ్చు.

kyoto travel guide

ఏం చూడాలి? | Places to Visit

ఆలయాలు, చిన్న చిన్న మందిరాలు, కెనాల్ వాక్స్, బాంబూ ఫారెస్ట్, ఈవినింగ్ లాంటర్న్ స్ట్రీట్స్ ఇవన్నీ రష్ లేకుండా స్లోగా చూడాలి. ఇక్కడ బ్యూటీ అని కళ్లకు ఇంపుగానే కాదు మోమోరీస్‌లో సింక్ అయ్యేలా ఉంటుంది.

ఏం తినాలి ? | Food It Kyoto

క్యోటోలో మీరు తప్పకుండా లోకల్ రేమెన్ ట్రైచేయండి. దీంతో పాటు మాచా బేస్డ్ స్వీట్స్, తాజా సుషీ, సీజనల్ సకూరా ఫ్లేవర్ ఉన్న డెజర్ట్స్ మిస్ చేయకండి. అలాగే స్మాల్ స్ట్రీట్ కేఫెలో సింపుల్ టీ తాగితే కూడా ఎక్స్‌పీరియెన్స్ కంప్లీట్ అవుతుంది.

ఎప్పుడు వెళ్లాలి? | When To Visit

క్యోటో వెళ్లేందుకు వసంతమే ఉత్తమ సమయం. మాార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో సకూరా పీక్ సీజన్. సమ్మర్ట్ ప్రారంభం అవ్వడానికి ముందే వెదర్ కంఫర్ట్‌గా ఉంటుంది కాబట్టి ఇది గమనించి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సమ్మర్ మొదలయ్యాక కూడా పచ్చదనంతో క్యూటో అందంగా కనిపిస్తుంది. 

క్యోటో ప్రయాణం కంప్లీట్ అయ్యాక ఫోటోల కన్నా మెమోరీస్ ఎక్కువగా మిగులుతాయి. గులాబీ పెటల్స్ పడిన ఆ మూమెంట్స్, బాంబూ సౌండ్స్, ఆలయ గంటల శబ్దాలు ఇవన్నీ కలిసి ఒక పీస్‌ఫుల్ చాప్టెర్లా మనసులో నిలిచిపోతాయి. ఎందుకంటే క్యోటో వసంతం ఒక సీజన్ కాదు. ఆనందానికి ఒక రీజన్ కూడా..

  • ఈ కథనం సాక్షి దినపత్రిక ఈ-పేపర్ లో కూడా ప్రచురితమైంది. కంటెంట్ రచయిత: ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు పాఠకుల కోసం పునఃప్రచురణ చేశారు.
  • ఈపేపర్ స్క్రీన్ షాట్ చూడండి.

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

Leave a Comment

error: Content is protected !!