Phugtal Monastery : ప్రపంచంలోనే యూనిక్ మోనాస్టరీ – ట్రెక్ చేసి చేరాల్సిందే!
Phugtal Monastery : హిమాలయ పర్వతాల మధ్య ఒక రాక్ కేవ్‌లో నిలిచిన ఫుగ్తాల్ మోనాస్టరీని చూస్తే అది కలలో చూసిన ఒక దృశ్యంలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జీవితం చాలా ప్రశాంతంగా, సింపుల్‌గా గడుస్తుంది. అందుకే మనశ్శాంతి కోసం చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి చేరుకోవడం అనేది ఒక ప్రయాణం మాత్రమే కాదు… అది ఒక అనుభవం కూడా.
మోనాస్టరీ జీవనం | Life in Monastery
మోనాస్టరీలో బౌద్ధ సన్యాసుల దినచర్య చాలా సింపుల్‌గా ఉంటుంది. ప్రతి ఉదయం ప్రార్థనల శబ్దం పర్వతాల మధ్య ఒక ఎకోలా మార్మోగుతుంది. చుట్టూ గోధుమ రంగులో మెరిసే పర్వతాలు, కింద నిశ్శబ్దంగా సాగే నది… ఈ కాంబినేషన్లో మనసు నెమ్మదిగా ప్రశాంతంగా మారుతుంది.

ఇక్కడ టైమ్ అనేది నిలిచిపోయినట్లే అనిపిస్తుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌గా సాగుతున్న జీవితానికి ఈ ప్రదేశం ఒక స్పీడ్ బ్రేకర్లా పని చేస్తుంది.
- ఇది కూడా చదవండి : Ziro Valley : సమ్మర్లో పచ్చని ప్రశాంతత
ప్రకృతితో సహజీవనం | Phugtal Monastery
ఇక్కడ ఎలక్ట్రిక్ లైట్స్ కన్నా సహజనమైన సూర్యోదయానికి ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గాలి శబ్దం, నీటి చలనం ఇవన్నీ కలిసి ఒక నేచురల్ రిథమ్‌ను క్రియేట్ చేస్తాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఈ వ్యూస్‌ను ఆస్వాదిస్తూ, నిశ్శబ్దంలో ప్రకృతి పలికే మాటలను వినడానికి ప్రయత్నిస్తారు.
#DidYouKnow that the Phugtal Monastery in #Ladakh is one of the remotest #buddhist monasteries in the world. It is built around a natural cave and can only be accessed by foot after a one day trek.#sundayvibes #Trivia #DekhoApnaDesh@tourismgoi @utladakhtourism @kishanreddybjp pic.twitter.com/kj4rRQ5QVR
— Dhanraj Nathwani (@DhanrajNathwani) May 29, 2022
ఎలా వెళ్లాలి? | How To Reach
హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు ఫ్లైట్ లేదా ట్రెయిన్లో వెళ్లాలి. అక్కడి నుంచి లేహ్‌కి ఫ్లైట్ తీసుకుని, లేహ్ నుంచి జాన్స్కార్ (Zanskar travel guide) ప్రాంతానికి రోడ్డు ప్రయాణం చేయాలి. చివరిగా ఒక చిన్న ట్రెక్ చేసి ఫుగ్తాల్ మోనాస్టరీకి చేరుకోవచ్చు. అయితే ఈ ప్రయాణాన్ని ఒక చెక్లిస్టుగా కాకుండా మనశ్శాంతికి మార్గంగా భావించి ప్లాన్ చేసుకోవాలి.
ఈ ప్రాంతంలో ప్రతి అడుగు ఒక డిస్కవరీలా అనిపిస్తుంది. ఈ రహస్య నిలయం… ఈ బౌద్ధ ఆలయం..మనసులో చాలా లోతుగా నిలిచిపోతుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.


