Travel Tips 07 : వర్షాకాలంలో హిమాలయాలకు వెళ్తున్నారా ? ఈ టిప్స్ పాటించండి !
| |

Travel Tips 07 : వర్షాకాలంలో హిమాలయాలకు వెళ్తున్నారా ? ఈ టిప్స్ పాటించండి !

Travel Tips 07 : హిమాలయాల అందాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఎత్తైన పర్వతాలు, పచ్చని లోయలు, ఉప్పొంగుతున్న నదులు మనసును కట్టిపడేస్తాయి. కానీ వర్షాకాలంలో ఈ ప్రాంతంలో వాతావరణం చాలా అంచనాలకు అందకుండా (Himalayan Tours In Monsoon) మారిపోతుంది. అకస్మాత్తుగా వచ్చే వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, క్లౌడ్‌బర్స్ట్‌లు, వాగులు, నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించడం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి.

Monsoon Season : మీరెంత సాహసీకులైనా వానాకాలంలో అస్సలు ఈ ప్రాంతాలకు వెళ్లొద్దు.. ఎందుకో తెలుసా ?

Monsoon Season : మీరెంత సాహసీకులైనా వానాకాలంలో అస్సలు ఈ ప్రాంతాలకు వెళ్లొద్దు.. ఎందుకో తెలుసా ?

Monsoon Season : భారతదేశంలో వర్షాకాలం మొదలైంది. వానలు భూమిని సస్యశ్యామలం చేసినా, కొన్నిసార్లు అందమైన పర్యాటక ప్రాంతాలను ప్రమాదకరంగా మారుస్తుంది. ప్రస్తుతం రుతుపవనాలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. దీంతో భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాకాలం సమయంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. అవేంటో తెలుసుకుందాం. పచ్చని కొండలు, తీరప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు కూడా వర్షాల తీవ్రతను చవిచూస్తున్నాయి. అందుకే కొన్ని ప్రాంతాలకు ప్రయాణించడం చాలా ప్రమాదకరం.