Monsoon Season : మీరెంత సాహసీకులైనా వానాకాలంలో అస్సలు ఈ ప్రాంతాలకు వెళ్లొద్దు.. ఎందుకో తెలుసా ?
Monsoon Season : భారతదేశంలో వర్షాకాలం మొదలైంది. వానలు భూమిని సస్యశ్యామలం చేసినా, కొన్నిసార్లు అందమైన పర్యాటక ప్రాంతాలను ప్రమాదకరంగా మారుస్తుంది. ప్రస్తుతం రుతుపవనాలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. దీంతో భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాకాలం సమయంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. అవేంటో తెలుసుకుందాం. పచ్చని కొండలు, తీరప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు కూడా వర్షాల తీవ్రతను చవిచూస్తున్నాయి. అందుకే కొన్ని ప్రాంతాలకు ప్రయాణించడం చాలా ప్రమాదకరం.
మహారాష్ట్ర
మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఐఎండి థానే, రాయ్‌గఢ్, పూణే జిల్లాలకు రెడ్ అలర్ట్‌లు జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు నదులుగా మారాయి, ప్రయాణం చాలా కష్టం. లోనావాలా, మహాబలేశ్వర్ వంటి పర్యాటక ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడటం సాధారణమైంది.ఇది రాకపోకలకు అంతరాయం కలిగించి, ప్రమాదాలను సృష్టిస్తోంది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం, పట్టణ ప్రాంతాల్లో తీవ్రమైన వరదలు, రవాణా అంతరాయం కారణంగానే ఇక్కడి వెళ్లే వాళ్లు వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచింది.

గుజరాత్
గుజరాత్ ఇటీవలి చరిత్రలో 2024లో అత్యంత దారుణమైన రుతుపవనాలను ఎదుర్కొంటోంది. ఆ సమయంలో సూరత్, భరూచ్ ప్రాంతాలకు ఐఎండి రెడ్ అలర్ట్‌లు జారీ చేసింది. రాష్ట్రంలోని మైదానాలు వరదనీటిలో మునిగిపోయాయి. ప్రస్తుతం హైవేలు ప్రయాణించలేని స్థితిలో ఉన్నాయి. ప్రజలను తరలించాల్సిన పరిస్థితి. ప్రయాణించడం ప్రమాదకరమే కాకుండా, సహాయక చర్యలకు కూడా ఆటంకం కలిగిస్తుంది. మరి ఈ సారి కూడా పరిస్థితి అలాగే ఉంటుందని అంటున్నారు. కాబట్టి పరిస్థితిని ముందుగానే తెలుసుకుని వెళ్లడం మంచింది.
ఇది కూడా చదవండి : Thanjavur : ఈ ఆలయం నీడ నేలపై పడదు
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్
ఈ ప్రశాంతమైన పర్వత ప్రాంతాలు తీవ్రమైన వర్షాలను చవిచూస్తున్నాయి. ఐఎండి రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. సిమ్లా, మనాలి, నైనిటాల్, అన్ని కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంటుంది.అందుకే వర్షాకాలంలో ఇక్కడికి వెళ్లకపోవడం మంచింది.
మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లో కూడా వానాకాలంలో నిరంతరం వర్షాలు కురుస్తాయి. భోపాల్, ఇండోర్, ఉజ్జయిని వంటి నగరాలకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో రాష్ట్రంలోని నదులు ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తాయి. తీవ్రమైన నీటిమట్టం పెరగడం వల్ల రోడ్లు ప్రమాదకరంగా మారుతాయి. ప్రజా రవాణా నమ్మదగినది కాదు. నీటి ద్వారా వచ్చే వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే వానాకాలంలో అక్కడికి ప్రయాణం మానుకోవడం మంచింది.

ఒడిశా, పశ్చిమ బెంగాల్
ఈ రెండు రాష్ట్రాలు సముద్ర తీరానికి దగ్గరల్లో ఉంటాయి. వానాకాలంలో వర్షాలకు మొదట ప్రభావితం అయ్యేవి ఇవే. ఈ తీరప్రాంత రాష్ట్రాలు తీవ్రమైన రుతుపవన వర్షాలను ఎదుర్కొంటాయి. ముఖ్యంగా భువనేశ్వర్, కోల్‌కతా, సుందర్బన్స్కు ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వానాకాలంలో ఈ ప్రాంతాల్లో తీవ్రమైన వరదలు, తుఫానుల ముప్పును ఎదుర్కొంటాయి. లోతట్టు ప్రాంతాలలో వరదలు, సుందర్బన్స్ వంటి సున్నితమైన పర్యావరణ వ్యవస్థలు ప్రమాదంలో ఉన్నాయి. కోల్‌కతా వంటి పట్టణ ప్రాంతాలు నీటిలో మునిగిపోతాయి. అందుకే ఇక్కడికి వెళ్లకపోవడం మంచింది.
ఇది కూడా చదవండి : హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి
గోవా
తన బీచ్‌లకు, రంగురంగుల రాత్రి జీవితానికి ప్రసిద్ధి చెందిన గోవా, రుతుపవన సమయంలో ఇది తీవ్ర ప్రభావితం అవుతుంది. తీరప్రాంత వరదలు, నీటిలో మునిగిన రోడ్లు గోవా అందాన్ని వానాకాలంలో తాత్కాలికంగా మరుగుపరుస్తాయి. అందుకే కాస్త గ్యాప్ ఇచ్చి వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు.
రాజస్థాన్
సాధారణంగా ఎడారి ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన రాజస్థాన్ 2024 రుతుపవన కాలంలో భారీ వర్షాలతో పోరాడింది. గతేడాది జైపూర్, ఉదయపూర్, మౌంట్ అబూ వంటి ప్రాంతాలకు ఐఎండి ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. ఈ ప్రాంతాలకు ఇలాంటి వాతావరణం అలవాటు లేదు. ఊహించని వర్షాల వల్ల ఆకస్మిక వరదలు వచ్చాయి, ముఖ్యంగా ఉదయపూర్, మౌంట్ అబూలో రోడ్లు ఇలాంటి పరిస్థితిని తట్టుకోవడానికి సిద్ధంగా లేవు, మౌలిక సదుపాయాలు ఇలాంటి వర్షాలను తట్టుకునేలా లేవు. అందుకే ఈ సారి కూడా వానాకాంలో ఈ ప్రాంతాలను అవైడ్ చేస్తేనే మంచింది.
కేరళ
రుతుపవనాల స్వర్గధామమైన కేరళ 2024లో వర్షాల ఉగ్రరూపాన్ని ఎదుర్కొంది. ఐఎండి ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. భారీ వర్షాల వల్ల విస్తృతమైన వరదలు , కొండచరియలు విరిగిపడ్డాయి. వయనాడ్ లో ఓ గ్రామమే భూస్థాపితం అయిపోయింది. కేరళలోని ప్రశాంతమైన కొండలు, బ్యాక్‌వాటర్స్ వానాకాలంలో ప్రమాదకరంగా మారుతాయి. కొండచరియలు రోడ్లను మూసుకుపోతాయి. అందుకే అక్కడికి వెళ్తే మధ్యలోనే చిక్కుకుపోయే ప్రమాదం ఉంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.