TTD Vada : ఇక రాత్రి భోజనంలో కూడా వడ ప్రసాదం పంపిణి
TTD Vada : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు అందించే భోజన విషయంతో టిటిడి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. వారికి నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించే దిశలో మరో కీలక నిర్ణయం తీసుకుంది . ప్రస్తుతం మధ్యాహ్న భోజన సమయంలో అందిస్తున్న వడలను ఇకపై రాత్రి భోజన సమయంలో కూడా అందించనున్నారు.