శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం పూర్తి వివరాలు | TTD Vaikuntha Dwara Darshanam 2025–26: Dates & Booking Details

TTD Vaikuntha Dwara Darshanam 2025–26 కంప్లీట్ గైడ్, అధికారిక తేదీలు, ఆన్‌లైన్ బుకింగ్ చేసుకునే విధానం, టైమ్ స్లాట్ దర్శనం సిస్టమ్, రూల్స్, ప్లానింగ్ టిప్స్‌తో కంప్లీట్ గైడ్.

వైకుంఠ ద్వారా దర్శనం అనేది తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara) దర్శనాల్లో అత్యంత పవిత్రమైనది, సంవత్సరానికి ఒకసారి కలిగే ఆధ్యాత్మిక అనుభూతి ఇది. ధనుర్మాసంలో జరిగే ఈ దర్శనం కోసం ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు తిరుమలకి ప్లాన్ చేస్తారు.

2025–26 వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన అధికారిక వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) ప్రకటించింది. ఈ పోస్టును న్యూస్‌లాగ కాకుండా ప్లానింగ్ హ్యాండ్‌బుక్‌లాగా చదవండి.

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం తేదీలు | TTD Vaikuntha Dwara Darshanam Dates 2025–26

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల ప్రకారం వైకుంఠ ద్వార దర్శనం అనేది 2025 డిసెంబర్ 30న ప్రారంభం అవుతుంది.

దర్శనం బుకింగ్, టైమింగ్స్ | TTD Vaikuntha Dwara Darshanam Dates

వైకుంఠ ద్వార దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్ అనేది తప్పనిసరి అని భక్తులు తెలుసుకోవాల్సిన విషయం.

  • బుకింగ్ చేసుకోవాల్సిన తేదీలు : 2025 డిసెంబర్ 30, 31వ తేదీలు
  • బుకింగ్ సమయం : ప్రతీ రోజు మధ్యాహ్నం 1 PM నుంచి
  • బుకింగ్ విధానం : TTD Time Slot Darshan SSD

ముఖ్య గమనిక | Important Note

మీకు కేటాయించిన తేదీ, టైమ్ స్లాట్ ప్రకారం మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు. టైమ్ స్లాట్ మిస్ అయితే రీ ఎంట్రీ అడ్జస్ట్‌మెంట్ ఉండదు. కాబట్టి పంక్చువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్.

ఎవరు బుక్ చేసుకోవచ్చు? | Who Can Book Vaikuntha Dwara Darshanam?

తితిదే సంస్థానం ఈ దర్శనాలకు కింది కేటగిరీలో బుకింగ్‌కు అవకాశం కల్పిస్తోంది.

  • సాధారణ భక్తులు
  • సీనియర్ సిటిజన్లు
  • దివ్యాంగులు (Physically Challenged)
  • NRI Devotees
  • స్పెషల్ కేటగిరి తీర్థయాత్రికులు

దీని కోసం భక్తులు వద్ద చెల్లుబాటు అయ్యే ఐడి కార్డు తప్పనిసరిగా ఉండాలి. అందులో ఆధార్ / పాస్‌పోర్ట్ / ఇతర చెల్లుబాటు అయ్యే ఐడిలు ఉండాలి.*

బుకింగ్ విధానం | Booking Process – Step by Step

వైకుంఠ ద్వార దర్శనం కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ స్టెప్స్ పాటించండి.

  1. ముందుగా ttdevasthanams.ap.gov.in అనే వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  2. వైకుంఠ ద్వార దర్శనం ఆప్షన్ ఎంచుకోవాలి.
  3. పైన వివరించిన తేదీల్లో మీకు నచ్చిన తేదీ, సమయం ఎంచుకోవాలి.
  4. భక్తుల వివరాలు, ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి.
  5. బుకింగ్ కన్ఫర్మేషన్ స్లిప్ డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోవాలి.

దర్శనం రోజు అదే ఐడి కార్డు ఒరిజినల్ కాపీని తీసుకెళ్లాలి.

ఈ నియమాలు తెలుసుకోండి | Important Rules & Guidelines

భక్తులకు పనికొచ్చే టిప్స్ | Useful Planning Tips for Devotees

బుకింగ్ సమయానికి ముందే వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి. చాలా ట్యాబ్స్, డివైసెస్‌లో ట్రై చేసే ఆలోచనను ఆపేయండి. తిరుమలలో అకమడేషన్‌కు దర్శనం బుకింగ్‌తో సంబంధం ఉండదు (Accommodation Not Linked). పుకార్లు లేదా నిర్ధారించబడని వార్తలను నమ్మకండి. టిటిడి అధికారిక సమాచారం మాత్రమే నమ్మండి.

అధికారిక సోర్స్ | Official Source & Trust Note

ఈ ఆర్టికల్‌లో ఉన్న సమాచారం మొత్తం TTD Official Announcements ఆధారంగా సిద్ధం చేశాము. దర్శనం తేదీలు, బుకింగ్ టైమింగ్స్ అనేవి చివరి నిమిషంలో కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులు టిటిడి వెబ్‌సైట్‌ను రెగ్యులర్‌గా చెక్ చేయండి.

వైకుంఠ ద్వార దర్శనం అనేది సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆధ్యాత్మిక అవకాశం. సరిగ్గా బుకింగ్ చేసుకుని, క్రమశిక్షణను పాటిస్తే దర్శన అనుభవం బాగుంటుంది. ఈ గైడ్ మీ దర్శనం ప్లానింగ్ క్లారిటీ ఇవ్వడం కోసం ప్రయాణికుడు (Prayanikudu) ప్రిపేర్ చేసింది. మీకు ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను.

Jai Shri Krishna
Om Namo Venkatesaya

“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

Leave a Comment

error: Content is protected !!