భార‌త్‌ చివరి రైల్వే స్టేషన్.. ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లాలి అంటే వీసా అవసరం – Attari Railway Station

షేర్ చేయండి

మామూలుగా ఒక రైల్వేస్టేషన్‌లోకి వెళ్లాలి అంటే ప్లాట్‌ ఫామ్ టికెట్ కావాలి. అయితే ఈ రైల్వేస్టేషన్‌లోకి వెళ్లాలి అంటే మాత్రం వీసా కావాలి. ఇండియా పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉన్న ఈ స్టేషన్ పేరు అట్టారి రైల్వే స్టేషన్ ( Attari Railway Station ). ఈ స్టేషన్ గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీ కోసం

ఈ రైల్వే స్టేషన్‌ను వాగా రైల్వే స్టేషన్ అని కూడా పిలుస్తారు. ఇరు దేశాల మధ్య ఉన్న ట్రైనును భారీ బందోబస్తు మధ్య నడిపిస్తారు. మరిన్ని విశేషాలు చదవండి.

భారత్ పాక్ సరిహద్దులో ఉన్న ఈ రైల్వేష్టేషన్‌ను ఇండియాలో చివరి రైల్వే స్టేషన్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా పాపులర్ ట్రావెల్ డెస్టినేషన్. ఇక్కడికి వెళ్లాలని చాలా మంది కోరకుంటారు. ఇటు భారతీయులు, అటు పాకిస్తాన్ ప్రజలు కూడా ఈ స్టేషన్ ఎప్పుడు తెరుచుకుంటుంది అని వేచి చూస్తుంటారు.
వాగా రైల్వేస్టేషన్‌ను 1895 లో బ్రిటిష్ వాళ్లు నిర్మించారు. అవిభాజిత భారత్ -పాక్ మధ్య ఇది ప్రయాణానికి ఒక ప్రధాన సాధనంగా ఉండేది. 1947 తరువాత ఇరు దేశాలకు ఒక కీలకమైన బార్డర్ క్రాసింగ్ పాయింట్‌గా మారింది వాగా రైల్వే స్టేషన్.
ఈ రైల్వే స్టేషన్‌ను అట్టారి శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్ ( Attari Sham Singh Railways Station ) అని కూడా పిలుస్తారు.కేవలం సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే తెరుచుకుంటుంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఒకసారి, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరోసారి తెరుచుకుంటుంది.
ఈ సమయంలో భారీ సంఖ్యలో స్థానికులు, పర్యాటకులు ఈ స్టేషన్‌కు చేరుకుంటారు. ఈ సమయంలో ఇక్కడ బార్డర్ సెర్మనీ జరుగుతుంది. బార్డర్ దాటే పర్యాటకులు, ప్రయాణికుల కోసం అతి తక్కువ సమయం కోసం మాత్రమే వాగా బార్డర్ తెరుస్తారు.
స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాగా బార్డర్ క్రాసింగ్ వద్ద వేడుకలు జరుగుతాయి. ఈ సమయంలో ప్రత్యేక సంగీత కాలక్రమాలతో పాటు సైనిక విన్యాసాలు జరుగుతాయి. వీటిని చూసేందుకు చాలా మంది పర్యాటకులు దూర దూరం నుంచి వస్తుంటారు.
భారత్‌లోని చివరి రైల్వే స్టేషన్‌గా ( Last Railway station of India ) పాపులారిటీ సంపాదించుకున్న వాగా రైల్వే స్టేషన్‌ అనేది పాకిస్తాన్‌లోని లాహోర్ నుంచి 24 కిమీ దూరంలో, భారత్‌లోని అమృత్‌సర్‌ నుంచి 32 కిమీ దూరంలో ఉంటుంది. అమృత్‌సర్ నుంచి టాక్సి లేదా బస్సులో ఇక్కడికి మీరు చేరుకోవచ్చు. అయితే ప్లాట్‌ఫారం మీదికి వెళ్లాలి అంటే మాత్రం ప్రత్యేక పర్మీషన్ అవసరం అవుతుంది.

చాలా మంది పర్యాటకులు, ప్రయాణికులు ఈ ట్రైన్‌లో ప్రయాణించడానికి వేచి చూస్తుంటారు. ఈ స్పెషల్ ట్రైన్ ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు ఇలాంటి అరుదైన ట్రైన్, లేదా ఇతర ప్రయాణాలు చేశారా ? చేస్తే వాటి వివరాలు కామెంట్ చేసి చెప్పండి.

గమనిక : ఈ ఆర్టికల్‌లోని ఫోటోలు కేవలం రిప్రజెంటేషన్ కోసం వాడినవి మాత్రమే. మొదటి చిత్రం మినహా మిగితావి ఆ రూట్లో వెళ్లే ట్రైనువి కావు.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!