United Arab Emirates : యూఏఈలో తప్పకుండా చూడాల్సిన 10 ప్రదేశాలు
భారతీయులు ఎక్కువగా సందర్శించే దేశాల్లో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( United Arab Emirates ) కూడా ఒకటి. యూఏఈ అనేది పురాతన సంప్రదాయాలు, ఆచారాలతో పాటు ఆధునిక అద్బుతాలకు నెలవు.
ఆకాశాన్ని అంటే బహుళ అంతస్థుల భవనాల నుంచి అబు ధాబీలోని ఎడారుల వరకు ప్రయాణికులను ఇట్టే కట్టిపడేస్తుంది యూఏఈ.
అరేబియ్ కాఫీ నుంచి షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ వరకు, ఎడారుల్లోని సాండ్ డ్యూన్స్ నుంచి క్రియేటీవ్ పార్కుల వరకు ఒక పర్యటకుడు ఎక్స్పెక్ట్ చేసే ఎక్సైట్మెంట్స్ను యూఏఈ అందిస్తుంది.
యూఏఈలో మొత్తం ఏడు ఎమిరేట్స్ ఉన్నాయి. అవే దుబాయ్, షార్జా, అబుధాబి, అజ్వన్, ఫుజైరా, రస్ అల్ ఖైమా, ఉమ్-అల్-ఖువైన్లు.
Read Also : సౌదీ అరేబియాకి ఎవరైనా వెళ్లవచ్చా ? వెళ్తే ఏం చూడవచ్చు?
ఈ ఏడు ఎమిరేట్స్ నుంచి మీకోసం యూఏఈలో చూడాల్సిన టాప్ 10 పర్యటక స్థలాలను మీకోసం ఎంపిక చేశాం.
Table Of Content
1. బూర్జ్ ఖలీఫా, దుబాయ్ | United Arab Emirates
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ బూర్జ్ ఖలీఫా. బూర్జ్ ఖలీఫాలో “బూర్జ్” అంటే అరబిక్‌లో బిల్డింగ్ అనే అర్థం వస్తుంది.

“ఖలీఫా” అంటే యూఏఈ మాజీ అధ్యక్షుడు, అబు ధాబీ రూలర్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నయాన్ పేరు. తమ మాజీ అధ్యక్షుడిని గౌరవిస్తూ ఈ బిల్డింగ్‌కు ఆయన పేరు పెట్టారు.
బూర్జ్ ఖలీపా ( Burj Khalifa) దుబాయ్‌లో ఉంది. 828 మీటలర్లు అంటే 2717 ఫీట్ల ఎత్తైన ఈ బిల్డింగ్‌ను 2004 లో నిర్మించడం ప్రారంభించారు. డౌన్‌టౌన్ దుబాయ్ అనే కార్యక్రమంలో భాగంగా 2010 లో దీనిని ప్రారంభించారు.
ఇది ఆధునిక నిర్మాణంలో అద్భుతం అని చెప్పవచ్చు. ఇక్కడి నుంచి దుబాయ్ మొత్తం కనిపిస్తుంది.
Also Read : Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
2. షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు,
sheikh zayed grand mosque- Abu Dhabi | ప్రపంచంలో అతిపెద్ద మసీదుల్లో షేక్ జాయెద్ మసీదు కూడా ఒకటి. నిర్మాణ పరంగా ఈ మసీదు చాలా అందంగా ఉంటుంది.

ఈ మసీదును సాంప్రదాయ నిర్మాణ శైలికి సమకాలీన డిజైనింగ్‌ని కలబోసి నిర్మించారు.
ఈ మసీదు బయటి నుంచి ఎంత అందంగా ఉంటుందో లోపలి భాగంలో కూడా అంతే వైభవంగా ఉంటుంది. తెల్లని పాలరాయితో, మొజాయిక్ టైల్స్‌తో పాటు బంగారంతో కూడా ఇంటీరియర్ డిజైనింగ్ చేశారు.
ఇక్కడే ప్రపంచంలోనే అత్యంత పొడవైన చేతితో నేసిన తివాచి ఉంటుంది. ఇది ప్రార్థన చేసే పెద్ద హాల్లో ఉంటుంది. దీంతో పాటు 24 క్యారెట్ల బంగారంతో చేసిన షాండియర్లు ఇక్కడి అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి.
3.లారే మ్యూజియం, అబు ధాబి
louvre museum | యూఏఈలో ఉన్న మ్యూజియమ్స్‌లో ఇది ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఇక్కడ మనం మానవజాతి చరిత్రను పూర్తిగా తెలుసుకోవచ్చు.
లారే మ్యూజియంలో ఆది మానవుడు ఉపయోగించిన పని ముట్లు కూడా చూడవచ్చు. ప్రపంచంలోని అనేేక ప్రదేశాల నుంచి సేకరించిన మానవజాతీ ప్రయాణానికి సంబంధించిన వస్తువులు ఇక్కడ కనిపిస్తాయి.

నాటి జీవిన విధానం, ఆచారాలు, కళలు, సంప్రదాలపై ఒక అవగాహన వచ్చేలా చక్కగా మ్యూజియం థీమ్‌ను డిజైన్ చేశారు
ఈ మ్యూజియం లోపలే కాదు బయట కూడా చాలా బాగుంటుంది. అధునిక నిర్మాణ శైలికి ఒక తార్కాణంగా నిలిచే ఈ మ్యాజియంను ప్రముఖ ఆర్కిటెక్ట్ జీన్ నోవెల్ నిర్మించాడు.
Also Read : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
4.దుబాయ్ థీమ్ పార్కులు
|దుబాయ్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది అక్కడి పార్కులు (Dubai Theme Park) , అద్భుతమైన నిర్మాణాలు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఎక్కువగా బాలీవుడ్ పార్క్, మోషన్గేట్, ఇక్కడి లీగో ల్యాండ్, ఇతర వాటర్ పార్కులకు వెళ్లడానికి ఇష్టపడతారు.

దీంతో పాటు ఇక్కడి సర్వింగ్, ఆథిత్యం అంటే ఇష్టపడే టూరిస్టులు లగ్జరీ హోటల్స్‌తో జీవితాన్ని విలాసవంతంగా ఎంజాయ్ చేస్తుంటారు.
కుటుంబంతో కలిగి వెళ్లి ఎంజాయ్ చేయగలిగిన పార్కులు దుబాయ్ మొత్తంలో చాలానే ఉన్నాయి.
5.జెబేల్ హఫీత్, అబు ధాబి
jebel hafeet, | దుబాయ్ నుంచి సుమారు రెండు గంటలు ప్రయాణించి సుమారు 140 కిమీ దూరంలో ఉన్న అల్ ఎన్ అనే నగరానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడే అబుధాబిలోని 3వ అత్యంత ఎత్తైన పర్వతం జెబెల్ హఫీత్ కనిపిస్తుంది.

జెబెల్ హఫీత్ అనే ఈ పర్వతం హజర్ అనే పర్వత శ్రేణుల్లో ఉంటుంది. ఈ పర్వతంపై నుంచి అల్ ఎన్ నగరం మొత్తం అందంగా కనిపిస్తుంది.
కొండల మధ్యలోంచి కోసుకుని వెళ్తన్నట్టుగా ఉండే దారుల్లో… దూసుకుని వెళ్తున్న వాహనాలను చూసి చాలా మంది థ్రిల్ అవుతుంటారు.
ఈ పర్వతం తూర్పువైపున ఒక పురాతన ఆర్కిలాజికల్ సైట్ ఉంది. ఇక్కడ కాంస్య ( కంచు) యుగం నాటి సమాధులు కనిపిస్తాయి.
Also Read : Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో వీర వనితలు
6.దుబాయ్ క్రీక్ హార్బర్
Dubai Creek Harbor | యూఏఈకి వెళ్తే చాలా మంది క్రీక్ హార్బర్ వెళ్లేందుకు ఇష్టపడతారు. ఎందుకంటే ఇక్కడి వ్యూస్ చాలా బాగుంటాయి. స్థానికులు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.

పిల్లలూ పెద్దలు కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేసేందుకు ఇక్కడ పలు గేమింగ్ స్పాట్స్ ఏర్పాటు చేశారు.
దుబాయ్ చరిత్రలో క్రీక్‌కు ఎంతో విశిష్టమైన స్థానం ఉంటుంది. ఇది ఇక నేచురల్ హార్బర్‌గా దోహదపడింది.
ఇక్కడ అల్ ఫహీది కోటలో ఉండే మ్యూజియం, పురాతన విండ్ టవర్ ఇలా ఎన్నో పర్యటక స్ఖలాలు ఉన్నాయి. దీంతో పాటు ఇక్కడ షాపింగ్ చేయడానికి ఎన్నో పాత కొత్త మార్కెట్స్ ఉన్నాయి.
7.ఫెరారీ వరల్డ్, యాస్ ద్వీపం, అబుధాబి
Ferrari World-Abu Dhabi | ఫెరారీ కొనడం అనేది కోటీశ్వరులకే కాదు సాధారణ మధ్య తరగతి వారికి కూడా ఒక అందమైన కల.
అలాంటి కలలు కనే వారికోసం అబు ధాబి ప్రభుత్వం ప్రపంచంలోనే మొదటి ఫెరారీ థీమ్ పార్కును నిర్మించింది.

ఫెరారీ థీమ్ పార్కును 2010 లో ఇటలీకి చెందిన ఫెరారీ కార్ బ్రాండ్‌కు ఉన్న పాపులారిటీని గుర్తించి నిర్మించింది.
ఇది ప్రపంచంలోనే అత్యంత విశాలమైన ఇండోర్ థీమ్ పార్కు .
9,25,000 స్క్వేర్ ఫీట్ల వైశాల్యంలో విస్తరించి ఉంది ఈ థీమ్ పార్కు.
ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఫార్ములా రోసా అనే రోలర్ కోస్టర్ ఉంది. ఇది 4.9 సెకండ్లలోనే గంటకు 240 కిమీ వేగాన్ని అందుకుంటుంది.
ఫెరారీ థీమ్ పార్కులో ఫెరారికి చెందిన ఎన్నో పాత, క్లాసిక్, అరుదైన కార్ మోడల్స్‌ను సందర్శకుల కోసం ఏర్పాటు చేశారు.
8. అల్ ఫహాదీ క్వార్టర్, ఓల్డ్ దుబాయ్
Al Fahidi Historical Neighbourhood | దుబాయ్ ప్రస్థానం 18వ శతాబ్దంలో క్రీక్ వద్ద ఒక చిన్న చేపలు పట్టే గ్రామం నుంచి మొదలైంది. నేడు అది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రసిద్ధ పర్యటక స్థలంగా మారిపోయింది.

కానీ దుబాయ్ ప్రజలు వారి చరిత్రను మర్చిపోవాలి అనుకోవడం లేదు. అందుకే అధునిక దుబాయ్ ప్రాంతాలతో పాటు పాత దుబాయ్ ప్రాంతాను కూడా సమానంగా ప్రేమిస్తారు.
పాత దుబాయ్‌లోని సన్నని గల్లీల్లో నాటి జీవన విధానం నేటికీ కనిపిస్తుంది. 19వ శతాబ్దంలో ఇక్కడ పెర్షియన్ వ్యాపారులు, సంపన్నులు నివసించేవారట.
9. దయా కోట, రస్ అల్ ఖైమా
Dayah Fort, Ras Al Khaimah | యూఏఈలో ప్రస్తుతం ఉన్న కొండపై ఉన్న ఒకే ఒక కోట దయా కోట. ఈ కోటను ప్రపంచ వారసత్వ సంపదగా యూనెస్కో గుర్తించింది.

ఎడారి ప్రాంతంలో ఉండే కోట వ్యూహాత్మంగా నాటి పాలకులు ఉపయోగపడేది.
ఈ కోటకు సమీపంలోనే ప్రాంతంలో వివిధ దేశాలకు చెందిన ఆహార పదార్థాలను అందించే రెస్టారెంట్స్, షాపింగ్ స్పాట్స్ ఉన్నాయి.
మీరు సాహసికులు అయితే జిప్ లైన్, స్కై టూర్ అండ్ మరెన్నో యాక్టివిటీస్ చేయడానికి ప్రయత్నించవచ్చు.
Also Read : Oymyakon : ప్రపంచంలోనే అతిశీతలమైన గ్రామంలో ప్రజలు ఎలా జీవిస్తున్నారు ?
10. షార్జా మ్యూజియం
Sharjah Museum | షార్జా అనేది యూఏఈఏకి కల్చరల్ క్యాపిటల్ లాంటిది. ఇక్కడ మొత్తం 16 మ్యూజియమ్స్ ఉన్నాయి. ఈ ప్రదర్శనశాలల్లో ఎమిరాతి ప్రజల జీవన విధానం, ఆచారాలు, కళలు, చరిత్ర గురించి అనేక విషయాలు తెలుసుకోవచ్చు.

హెరిటేజ్ మ్యూజియం, ఇస్లామిక్ మ్యూజియం, ఆర్ట్ , నేచురల్ హిస్టరీ, ఆర్కియాలజీ, చిల్ట్రన్స్, ఫైన్ ఆర్ట్స్ ఇలా పలు థీమ్స్ ప్రకారం మ్యూజియంలు ఏర్పాటు చేశారు
మీరు ఇంతకు ముందు దుబాయ్ వెళ్తే నేను ఈ లిస్టులో ప్రస్థావించని ప్రదేశాలు, ఆసక్తికరమైన విషయాలను కామెంట్ చేసి తెలపగరు.
ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.